Aloe Vera : కలబంద మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే చాలామంది చర్మ సౌందర్యం కోసం కూడా కలబందరు వాడుతూ ఉంటారు. అంతేకాక కలబంద చర్మానికి కాదు జుట్టుకు కూడా ఎంతో బాగా మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా దాగి ఉన్నాయి. అలోవెరా చర్మం మరియు జుట్టు సమస్యలను ప్రభావంతంగా తగ్గిస్తుంది. అలాగే జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కలబందకు మించిన రెమెడీ ఇంకొకటి లేదు అంటే అతిశయోక్తి కాదు. అలాగే కలబందలో రెండు రకాల ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఇది ఆరోగ్యాన్ని మరియు అందాన్ని పెంచుతుంది. ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు రాలటం అనేది పెద్ద సమస్యగా మారింది. అలాగే జుట్టు పోషకాలు అనేవి అందకపోతే పల్చగా మారుతుంది. అయితే జుట్టు పెరుగుదలకు కలబందని ఎలా వాడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం….
ముందుగా మనం ఒక గిన్నెను తీసుకొని దానిలో నాలుగు చెంచాల కలబంద గుజ్జు వేసుకోవాలి. ఆ తర్వాత దాని లో రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మరో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె కూడా వేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు మీరు ఈ మిశ్రమాన్ని జుట్టు మూలాల నుండి చివర్ల వరకు బాగా పట్టించాలి. అలాగే మీ జుట్టు రకాన్ని బట్టి కలబంద మరియు నూనెను కలుపుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత కాసేపు మృదువుగా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన రక్త ప్రసన్న అనేది మెరుగవుతుంది.
దాని తర్వాత గంటసేపు అలా ఉంచి తేలిక పాటి షాంపూ తో తల స్నానం చేస్తే చాలు. ఇలా చేయడం వలన చుండ్రుఅనేది ఈజీగా తగ్గుతుంది. అలాగే జుట్టు రాలే సమస్య కూడా తగ్గిపోతుంది. మీరు గనక ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జుట్టు మందంగా మరియు పొడవుగా పెరుగుతుంది. Aloe vera for hair benefits in telugu
Business : ఈ రోజుల్లో డబ్బులు సాధించడం చాలా కష్టం. ఒక్కో బిజినెస్ ఐడియాతో ఒక్కొక్కరు పలు స్కెచ్‌లు వేస్తున్నారు.…
Forgetting : ప్రస్తుత కాలంలో మతిమరుపు అనేది సర్వసాధారణం. ఈ సమస్య ఉన్నవారు తరచుగా బాధపడుతూ ఉంటారు. కానీ దాని గురించి…
Pushpa 2 The Rule : అల్లు అర్జున్ Allu Arjun సుకుమార్ Sukumar కాంబోలో వస్తున్న పుష్ప 2…
Kasturi : ఒకప్పుడు హీరోయిన్ గా చేసి సిల్వర్ స్క్రీన్ పై కొద్దిగా క్రేజ్ తగ్గాక స్మాల్ స్క్రీన్ పై…
Dialysis : మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కిడ్నీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాగే శరీరంలో రక్తం నుండి టాక్సిన్స్…
Akira Nandan : పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఓజీ ఒకటి. ఈ చిత్రం రన్ రాజా రన్,…
Good Habits : మనం ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి జీవనశైలి అలవాటు చేసుకోవాలి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తున్న సమయంలో ద్వాదశ…
This website uses cookies.