Weight Loss : మీ రోజు వారి ఆహారంలో ఈ గింజలను చేర్చుకుంటే చాలు… మంచి ఆరోగ్యం మీ సొంతం…!!
ప్రధానాంశాలు:
Weight Loss : మీ రోజు వారి ఆహారంలో ఈ గింజలను చేర్చుకుంటే చాలు... మంచి ఆరోగ్యం మీ సొంతం...!!
Weight Loss : రాజ్ గిరాను అమరాంత్ లేక రామదానా ధాన్యాలు అని అంటారు. అయితే గోధుమ మరియు బియ్యం లాంటి ఇతర ముఖ్య ఆహారాలతో పోలిస్తే ఇవి చాలా పోషక మైనవి అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే ఈ రాజ్ గిరాను తృణ ధాన్యాలలో ఒకటిగా చెబుతారు. ఇది ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. అలాగే ఈ రాజ్ గిరాలో యాంటీ బయోటీక్ లక్షణాలు ఉన్నాయి. అలాగే ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. అంతేకాక మైగ్రేన్ తలనొప్పి నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే ఆకలిని కూడా నియంత్రిస్తుంది. అయితే ఈ రామదాన గింజలలో ప్రోటీన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది జంతు ప్రోటీన్ల క్వాలిటీని కలిగి ఉంటుంది….
అయితే ఎదిగే పిల్లలకు ప్రోటీన్ అనేది చాలా ముఖ్యం. అలాగే ఎముకలు మరియు కండరాలు, చర్మం,రక్తం పెరుగుదలకు కూడా ప్రోటీన్ అనేది చాలా అవసరం. అలాగే శరీరం బలంగా ఉండేందుకు మరియు ఆరోగ్యంగా ఉండేందుకు రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా ప్రోటీన్ చాలా ఉపయోగపడుతుంది. ఈ రామదాన గింజలు గ్లూటెన్ ఫ్రీ. అయితే అలర్జీ సమస్యతో బాధపడేవారు ఈ గ్లూటెన్ ను ఆహారంగా తీసుకోవచ్చు. అలాగే ఇది అధిక కొలెస్ట్రాల్ మరియు మధుమేహ సమస్యలను దరి చేరకుండా చూస్తుంది. అయితే గింజలలో ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ ఫైబర్ అనేది జీర్ణ క్రియను ఎంతో మెరుగుపరుస్తుంది. అలాగే పేగు కదలికలను సక్రమంగా జరిగేలా కూడా చూస్తుంది. అలాగే మలబద్ధక సమస్యతో ఇబ్బంది పడేవారు తోటకూర గింజలను తీసుకుంటే తొందరగా నయం అవుతుంది. అయితే ఈ గింజలలో మాంగనీస్ కూడా పుష్కలంగా ఉంటుంది. దీనిలో ఉన్నటువంటి మాంగనీస్ అనేది మెదడుకు చాలా ముఖ్యమైనది. అలాగే కొన్ని నాడీకి సంబంధించిన సమస్యల నుండి శరీరాన్ని కాపాడుతుంది.
ఈ గింజలలో మినరల్స్ మరియు విటమిన్స్,ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ లాంటి ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. ఈ పోషకాలు గుండా ఆరోగ్యానికి కూడా హెల్ప్ చేస్తాయి. అలాగే హైపర్ టెన్షన్ కూడా కంట్రోల్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే అధికంగా ప్రోటీన్ తీసుకోవడం వలన శరీర కొవ్వు మరియు బరువు పెరగటం లాంటి సమస్యలను కూడా నియంత్రిస్తుంది. అయితే మీరు బరువు తగ్గాలి అనుకుంటే మాత్రం మీ ఆహారంలో ఈ గింజలను కచ్చితంగా చేర్చుకోవాలి. అలాగే ఈ రామదాన గింజలలో పెపైడ్ లకు యాంటీ ఇన్ప్లమెంటరీ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి క్యాన్సర్ నుండి కూడా కాపాడుతుంది అని కొన్ని అధ్యాయాలు తెలిపాయి. అయితే తోటకూర గింజలలో ఉండే యాంటీ యాక్సిడెంట్లు శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడుతుంది. అంతేకాక ఎముక వ్యాధుల సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. ఇది శరీరంలో మంచి కొలస్ట్రాల్ ను పెంచేందుకు కూడా హెల్ప్ చేస్తుంది. దీనిలో ఉన్న యాంటీ ఇన్ ఫ్లమెంటరీ గుణాలు శరీరంలోని మంటను కూడా నియంత్రిస్తుంది…