Betel Leaves : తమలపాకు గురించి ఎవరికి తెలియని నిజాలు .. తెలిస్తే ఇంటికి తెచ్చుకుంటారు ..
Betel Leaves : తమలపాకును ఆహారం తిన్న తర్వాత త్వరగా అరగడానికి తాంబూలంగా వేసుకుంటారు. అంతే కాదు ఈ తమలపాకు వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. తమలపాకును హడావిడిగా కంగారు కంగారుగా తినకూడదు. నెమ్మదిగా నమ్ముతూ రసం మింగాలి. తమలపాకును ఔషధంగా తీసుకోవాలి. దీన్ని తింటే మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే తమలపాకులలో విటమిన్ సి, థయామిన్, రైబో ఫ్లెవిన్, కెరోటిన్ లాంటి విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్ ను తగ్గిస్తుంది.
చక్కెరను కంట్రోల్ లో ఉంచుతుంది.అధిక కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. గాయలతో బాధపడేవారు ఉబ్బసం, మంట ఉన్నవారు ఈ తమలపాకులను తింటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే నోటి దుర్వాసనకి తమలపాకు అత్యద్భుతంగా పనిచేస్తుంది. తమలపాకులు రోజుకు ఒకటి తింటే దంత సమస్యలు తొలగిపోతాయి. ఒత్తిడితో బాధపడేవారు ఉదయాన్నే పరిగడుపున తమలపాకులు తింటే మంచి ఫలితం ఉంటుంది. ఖాళీ కడుపుతో తమలపాకును తింటే జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. తమలపాకు పై ఆవాల నూనె వేడి చేసి వేసి ఛాతిపై ఉంచితే గుండె సమస్యలు తొలగిపోతాయి.
కీళ్లు, కాళ్లు నొప్పులు ఉన్నవారు కూడా పరిగడుపున తమలపాకు తింటే మంచిది. వెన్ను నొప్పితో బాధపడుతున్న వారు కొబ్బరి నూనెలో తమలపాకు రసాన్ని కలిపి రాసుకుంటే నొప్పి తగ్గుతుంది. చెవి పోటుతో బాధపడేవారు కొన్ని చుక్కల తమలపాకు రసాన్ని చెవిలో వేసుకుంటే నొప్పి తగ్గుతుంది. అజీర్తి, ఆకలి లేకపోవడం, మోకాళ్ళ కీళ్ల నొప్పులు దగ్గర తమలపాకుల కాసేపు ఉంచితే మంచి ఫలితం ఉంటుంది. కాల్షియం తక్కువగా ఉన్నవారు తమలపాకుపై సున్నం వేసుకొని తింటే మంచి ఫలితం ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.