Health Benefits : పావు స్పూను పొడితో పది రకాల సమస్యలకు చెక్ పెట్టండిలా..!
Health Benefits : భారతీయ, అమెరికన్ వంటకాల్లో తరచుగా వాడే ఆవాల గురించి ప్రతీ ఒక్కరికి తెలుసు. అత్యధిక విటామిన్లు, మినరల్స్ ఈ ఆవాలను ప్రతీ ఒక్కరూ రోజువారి వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. రకరకాల రంగుల్లో దొరికే ఆ ఆవాలు.. వాటి పిండిల్లో గ్లూకోసినోలేట్స్ మైరోసినేట్టి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో క్యాన్సర్ కారక కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. జర్నల్ హ్యూమన్, ఎక్స్ పరిమెంటల్ టాక్సికాలజీలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం చిన్న విత్తనాలు కెమైప్రివెంచివ్ సామర్థ్యాన్ని కల్గి ఉంటుంది. అలాగే క్యాన్సర్ కారకం నుంటి కాపాడటంలో ఆవాలు చాలా బాగా ఉపయోగపడతాయి.
దీర్ఘ కాళిక తలనొప్పి, మైగ్రేన్ లతో బాధపడుతున్న వారు ఆవాలను తినడం వల్ల అది తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. ఇందులో ఉండే మెగ్నీషియం మన నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే శరీరంలోవచ్చే నొప్పి, ఒత్తిడి తగ్గిస్తుంది. అలాగే ఆవాల వల్ల జీర్ణ వ్యవస్థను బాగు చేస్తుంది. ఆజీర్ణం సమస్యతో బాధపడుతుంటే ఆవాలు వాటిని వదిలించుకోవడానికి సాయపడుతుంది. ఈ ఆవాల్లో ఫైబర్ తో నిండి ఉంటాయి. ఇది సులభంగా పేగు కదలికలో సాయపడుతుంది. దీని వల్ల జీర్ణ శక్తి మరింత మెరుగుపడుతుంది. మస్టర్డ్ ఆయిల్ సాధారణంగా ప్రతీ భారతీయ ఇంటిలో ఉపయోగించబడుతుంది. మరియు హృదయ సంబంధ సమస్యలతో బాధపడేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇదీ మీ కొలెస్ట్రాల్ స్థాయిని నిర్వహించడంలో సాయపడుతుంది. అంతే కాకుండా రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది గుండె ఆరోగ్యం బాగుపడటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
ఆవపిండి మీ ఎముకలకు కూడా మంచిది. ఆవాల్లో ఉండే సెలీనియం వల్ల మీ ఎముకలు బలంగా తయారవుతాయి. అలాగే గోర్లు, జుట్టు, దంతాలు కూడా బాగుపడతాయి. ఆవపిండిలో యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి చిగుళ్లు, ఎముకలు, జుట్టు, దంతాలను ఆరగ్యాన్ని బాగు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతీ సీజన్ లో మీ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో ఆవాలు చాలా బాగా ఉపయోగపడతాయి. చర్మ కణాల్లో ఉండే మలినాలను తొలగించి మీ ముఖాన్ని కాంతివంతగా తయారు చేస్తాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. అలాగే వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడంలో కూడా బాగు చేస్తుంది. ఈ ఆవాలను సలాడ్లు, చట్నీలు, ఆవగాయలు, ఊరగాయలు, వివిధ వంటకాల్లో విరివిగా ఉపయోగించుకోవచ్చు.