Health Benefits : ఐదే ఐదు రోజులు తాగండి.. బాడీలో ఉన్న కొవ్వునంతా కరిగించేస్తుంది ఈ క్యారెట్ జ్యూస్!
Health Benefits : ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అయితే బరువును తగ్గించుకునేందుకు జిమ్ లు, డైట్ ఫాలో అవుతూ అనేక రకాల అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఎన్ని చేసినా సమస్యలు తప్ప పరిష్కారం దొరకడం లేదని ఆత్మ విశ్యాసాన్ని కోల్పోతుంటారు. అయితే ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ సహజ సిద్ధ పద్ధతిలో మీ అధిక బరువును తగ్గించుకోవచ్చు. అంతే కాకుండా జీర్ణ వ్యవస్థను మరింత మెరుగు చేసే ఈ జ్యూస్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.క్యారెట్.. చాలా మంది ఇష్టపడి తింటుంటారు. కానీ రోజూ తినరు. ఇది తినడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. ఇది ఏ సీజన్ లో అయినా మనకు సులువుగా దొరికేస్తుంది.
అయితే చాలా మంది దీన్ని పచ్చిగా తింటే.. కొందరు సలాడ్లు, జ్యూస్ లు గా చేస్కొని తీసుకుంటారు. క్యారెట్ లో యాంటీ ఆక్సిడెంట్ విటామిన్స్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, పాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. క్యారెట్ లో ఉండే విటామిన్ ఎ ఆహారం నుంచి తీసుకొని శరీరం కెరోటినాయిడ్స్ గా మార్చుకుంటుంది. కొవ్వు కణాలతో సంఘర్షణ చెంది కొత్త కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది. కొవ్వు కరగడానికి సహాయ పడి కొత్త కొవ్వు పేరుకోకుండా సాయపడుతుంది. క్యారెట్ లో ఉండే పోలిక్ యాసిడ్, థయామిన్ జీర్ణ క్రియ బాగా జరగడానికి సహాయ పడతాయి. జీర్ణ ప్రక్రియ బాగా జరిగితే… తీసుకున్న ఆహారం కొవ్వుగా మారకుండా శక్తిగా మారుతుంది.
క్యారెట్ లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. ఇన్న ప్రయోజనాలను చేకూర్చే క్యారెట్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా క్యారెట్స్ ని శుభ్రంగా కడిగి ముక్కులుగా చేస్కోవాలి. ఇందులో కొంచెం అల్లం ముక్క నీళ్లు వేసి జ్యూస్ చేసుకోవాలి. దీన్ని వడకట్టుకొని రసం తీసుకోవాలి. క్యారెట్ రసంలో అర చెక్క నిమ్మ రసం పిండుకోవాలి. నిమ్మకాయ కూడా బరువు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ జ్యూస్ జీర్ణ ప్రక్రియ మీద ప్రబావం చూపించి బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. అయితే ఈ క్యారెట్ జ్యూస్ ను ప్రతిరోజూ ఉదయం అంటే పరగడుపున తాగడం వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి.