Health Benefits : ఎలాంటీ నొప్పినైనా ఐదే ఐదు సెకండ్లలో తగ్గించే కర్పూరం గురించి మీకు ఈ విషయాలు తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : ఎలాంటీ నొప్పినైనా ఐదే ఐదు సెకండ్లలో తగ్గించే కర్పూరం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Health Benefits : మనం దేవుడి పూజకు ఉపయోగించే కర్పూరం వల్ల మన శరీరంలోని అనేక నొప్పులు మటుమాయం అవుతాయంట. అయితే ఈ విషయం చాలా మందికి తెలియదు. కేవలం హారతి ఇచ్చేందుకు మాత్రమే వాడే కర్పూరం వల్ల ఒళ్ల నొప్పులను క్షణాల్లో దూరం చేసుకోవచ్చు. అయితే ముందుగా కర్పూరాన్ని మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని నూనెతో కలిపి నొప్పి ఉన్న చోట రాయడం వల్ల ఐదే ఐదు సెకండ్లలో ఉపశమనం లభిస్తుంది. అయితే ఇది […]

 Authored By pavan | The Telugu News | Updated on :3 April 2022,2:00 pm

Health Benefits : మనం దేవుడి పూజకు ఉపయోగించే కర్పూరం వల్ల మన శరీరంలోని అనేక నొప్పులు మటుమాయం అవుతాయంట. అయితే ఈ విషయం చాలా మందికి తెలియదు. కేవలం హారతి ఇచ్చేందుకు మాత్రమే వాడే కర్పూరం వల్ల ఒళ్ల నొప్పులను క్షణాల్లో దూరం చేసుకోవచ్చు. అయితే ముందుగా కర్పూరాన్ని మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని నూనెతో కలిపి నొప్పి ఉన్న చోట రాయడం వల్ల ఐదే ఐదు సెకండ్లలో ఉపశమనం లభిస్తుంది. అయితే ఇది కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాకుండా.. పలు అధ్యయనాల్లో రుజువు అయింది. కర్పూరం నూనెను సమయోచిత అనాల్జెసిక్స్ తో సహా నొప్పి నివారణ మందుల్లో విరివిగా వాడుతుంటారు. కర్పూరం నూనె వల్ల దీర్ఘకాళిక కండరాల నొప్పులు, కీళ్ల నొప్పుల వంటి వాటిని తగ్గించుకోచ్చు.

2016లో పలువురు ఆరోగ్య శాస్త్ర నిపుణులు చేసిన ఓ అధ్యయనం ప్రకారం… కర్పూరం నూనె నడుము నొప్పిని తగ్గించిందట. హాట్ మరియు కోల్డ్ యాక్షన్, కర్పూరం ఆయిల్ నరాల చివర్లను మొద్దుబారేలా చేస్తుందట. అంతే కాకుండా చల్లగా ఉంచుతుందట. ఆ తర్వాత కీళ్లు, కండరాలకు రక్త ప్రసరణను పెంచి… నొప్పి ఉన్న చోటును వేడిగా మారుస్తుంది. అంతే కాకుండా తలనొప్పిని తగ్గించడానికి కర్పూరం నూనె ఉపయోగించడంపై పరిశోధన కొనసాగుతోంది. ముఖ్యమైన నూనెలు మైగ్రేన్ తలనొప్పి, సాధారణ తలనొప్పి చికిత్స చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే ఈ కర్పూరం నూనె నొప్పి-సిగ్నలింగ్ మార్గాలను అణిచివేసి న్యూరోజెనిక్ వాపును బలహీనపరుస్తుందని ఆరోగ్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

amazing health benefits of karpuram for reducing any kind of pain in body

amazing health benefits of karpuram for reducing any kind of pain in body

కర్పూరం నూనె అరోమా చికిత్సలో ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఇది ముక్కు రద్దీని తగ్గించడంలో సాయపడుతుంది. అలాగే పిల్లలు మరియు పెద్దల్లో దగ్గుతో పాటు శ్వాస సమస్యలను తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అలాగే 2015లో చేసిన ఓ అధ్యయనం ప్రకారం… కర్పూరం నూనె మరియు కొబ్బరి నూనె ఉపరితల కాలిన గాయాలను మాన్చడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని తెలిపింది. అలాగే శరీరంలో ఏర్పడే పలు రకాల కణితులను కరిగించడంలో కూడా కర్పూరం అద్భుతంగా పని చేస్తుంది వివరించారు. ముఖ్యంగా శరీరంలో ఏర్పడే ఎలాంటి నొప్పినైనా కేవలం ఐదే సెకండ్లలో తగ్గించగల శక్తి కర్పూరం నూనెకు ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే మీరు ఒక సారి ఈ చిట్కాను పాటించి నొప్పులను తగ్గించుకోండి.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది