Beauty Tips : ఇటీవల కాలంలో చాలా మంది దంత సమస్యలను ఎదుర్కొంటున్నారు. శరీరం సౌందర్యంలో దంతాలు కూడా ఒఖ భాగమే. అందరి ముందు కాన్ఫిడెంట్ గా నవ్వూతు ఉండాలన్నా, మాట్లాడలన్నా దంతాలు తెల్లగా ఉండాల్సిందే. అలాగే నోరంతా దుర్వాసన రాకుండా ఉండాల్సిందే. అయితే వాస్తవానికి మెరిసే తెల్లటి దంతాలు ఉంటే… వేరే వ్యక్తులకు త్వరగా ఆకర్షితులవుతారు. దీంతో పాటు ఆత్మ విశ్వాసం పెరిగి కొత్త వ్యక్తులను కూడా త్వరగా పలకరించవచ్చు. ఇతరులపై మనం ప్రభావితం చేసే అంశాల్లో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వస్త్ర ధారణలో మేకప్ లాగా ఇది కూడా ఒఖ భాగం అని సౌందర్య నిపుములు పేర్కొంటున్నారు. కాగా దంతాలు పసుపు పచ్చగా మారి ఇబ్బంది పడుతుంటే… తెల్లగా మార్చేందుకు ఇంటి చిట్కాలను అనుసరించాలని సూచిస్తున్నారు. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.
ముందుగా వంటసోడా.. బేకింగ్ సోడా లేదా వంట సోడా పళ్లను తెల్లగా చేస్తుంది. ఇది తేలికపాటి రాపిడి ప్రభావాన్ని కల్గి ఉండి దంతాల మీద మరకలను తలగిస్తుంది. ఇది టూత్ పౌడర్ లాగా ఉపయోగించవచ్చు. అయితే బేకింగ్ సోడా తీస్కొని దంతాల మీద ఒక నిమిషం పాటు అప్లై చేయాలి. ఆ తర్వాత నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. బేకింగ్ సోడాలో కొంచెం నిమ్మరసం వేసి కలిపి బ్రష్ చేస్తే మరింత ప్రభావవంతంగా ఉంటుంది. ఎందుకంటే నిమ్మరసం తేలికపాటి బ్లీచింగ్ ప్రభావాన్ని కల్గి ఉంటుంది. కొబ్బరి నూనె పుల్లింగ్.. ఇది ఒక పురాతన ఆయుర్వేద ఔషధం. ఇది దంతాలను శుభ్ర పరచడానికి తెల్ల చేయడానికి మాత్రమే కాకుండా శరీరం నుంచి విషాన్ని తొలిగంచడానికి కూడా ఉపయోగిస్తారు. కొబ్బరి నూనె లేదా ఏదైనా కూరగాయల నూనెతో దీన్ని చేయవచ్చు. ఒక టేబుల్ స్పూన్ నూనెను నోట్లోకి తీస్కొని పుల్లింగ్ చేయండి. దాదాపు 15 నిమిషాల పాటు ఇలా చేయాలి. దీంతో నూనె లాలాజలంతో కలస్తుంది. ఇది స్విర్లింగ్ ఎంజైమ్ లను సక్రియం చేస్తుంది.
ఆ తర్వాత ఇది దంతాల మధ్య రక్త ప్రవాహాన్ని మెరుగుపర్చి విషాన్ని బయటకు పంపుతుంది. అనంతరం నూనెను ఉమ్మివేయండి.నారింజ పండు తొక్క తీసి కింద భాగం అంటే తెల్లటి బాగాన్ని దంతాల మీద రుద్దడం వల్ల దంతాలు తెల్లగా అవుతాయి. ఇందులో ఉండే డి-లిమోనెన్ వల్ల పళ్లు మిలమిలా మెరుస్తాయి. తొక్క తెల్లటి భాగంలో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి, ఆపై దంతాల అప్లై చేయాలి. అలాగే పసుపు కూడా తేలికపాటి బ్లీచింగ్ ప్రభావాన్ని కల్గి ఉంటుంది. ఇది సహజ క్రిమినాశని కావున దంతాలు చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. పసుపు ద్వారా పేస్టు కూడా తయారు చేసుకోవచ్చు. ఒక టీ స్పూన్ పసుపులో కొబ్బరి నూనె, బేకిండ్ సోడా అర టీ స్పూన్ కలిపి టూత్ పేస్టులా తయారు చేసుకోవచ్చు. అలాగే కలబంద అనేక సమస్యలకు ఔషధంలా పని చేస్తుంది. ఇది దంతాలను తెల్లగా మారుస్తుంది. ఇది దంతాల మీద పసుపు రంగు మరకలను తొలగించడంలో సహాయ పడుతుంది.
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
This website uses cookies.