Beauty Tips : మీ దంతాలను తెల్లగా మెరిపించుకోవాలంటే ఇలా చేయాల్సిందే..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Beauty Tips : మీ దంతాలను తెల్లగా మెరిపించుకోవాలంటే ఇలా చేయాల్సిందే..!

Beauty Tips : ఇటీవల కాలంలో చాలా మంది దంత సమస్యలను ఎదుర్కొంటున్నారు. శరీరం సౌందర్యంలో దంతాలు కూడా ఒఖ భాగమే. అందరి ముందు కాన్ఫిడెంట్ గా నవ్వూతు ఉండాలన్నా, మాట్లాడలన్నా దంతాలు తెల్లగా ఉండాల్సిందే. అలాగే నోరంతా దుర్వాసన రాకుండా ఉండాల్సిందే. అయితే వాస్తవానికి మెరిసే తెల్లటి దంతాలు ఉంటే… వేరే వ్యక్తులకు త్వరగా ఆకర్షితులవుతారు. దీంతో పాటు ఆత్మ విశ్వాసం పెరిగి కొత్త వ్యక్తులను కూడా త్వరగా పలకరించవచ్చు. ఇతరులపై మనం ప్రభావితం చేసే […]

 Authored By pavan | The Telugu News | Updated on :11 May 2022,4:00 pm

Beauty Tips : ఇటీవల కాలంలో చాలా మంది దంత సమస్యలను ఎదుర్కొంటున్నారు. శరీరం సౌందర్యంలో దంతాలు కూడా ఒఖ భాగమే. అందరి ముందు కాన్ఫిడెంట్ గా నవ్వూతు ఉండాలన్నా, మాట్లాడలన్నా దంతాలు తెల్లగా ఉండాల్సిందే. అలాగే నోరంతా దుర్వాసన రాకుండా ఉండాల్సిందే. అయితే వాస్తవానికి మెరిసే తెల్లటి దంతాలు ఉంటే… వేరే వ్యక్తులకు త్వరగా ఆకర్షితులవుతారు. దీంతో పాటు ఆత్మ విశ్వాసం పెరిగి కొత్త వ్యక్తులను కూడా త్వరగా పలకరించవచ్చు. ఇతరులపై మనం ప్రభావితం చేసే అంశాల్లో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వస్త్ర ధారణలో మేకప్ లాగా ఇది కూడా ఒఖ భాగం అని సౌందర్య నిపుములు పేర్కొంటున్నారు. కాగా దంతాలు పసుపు పచ్చగా మారి ఇబ్బంది పడుతుంటే… తెల్లగా మార్చేందుకు ఇంటి చిట్కాలను అనుసరించాలని సూచిస్తున్నారు. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.

ముందుగా వంటసోడా.. బేకింగ్ సోడా లేదా వంట సోడా పళ్లను తెల్లగా చేస్తుంది. ఇది తేలికపాటి రాపిడి ప్రభావాన్ని కల్గి ఉండి దంతాల మీద మరకలను తలగిస్తుంది. ఇది టూత్ పౌడర్ లాగా ఉపయోగించవచ్చు. అయితే బేకింగ్ సోడా తీస్కొని దంతాల మీద ఒక నిమిషం పాటు అప్లై చేయాలి. ఆ తర్వాత నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. బేకింగ్ సోడాలో కొంచెం నిమ్మరసం వేసి కలిపి బ్రష్ చేస్తే మరింత ప్రభావవంతంగా ఉంటుంది. ఎందుకంటే నిమ్మరసం తేలికపాటి బ్లీచింగ్ ప్రభావాన్ని కల్గి ఉంటుంది. కొబ్బరి నూనె పుల్లింగ్.. ఇది ఒక పురాతన ఆయుర్వేద ఔషధం. ఇది దంతాలను శుభ్ర పరచడానికి తెల్ల చేయడానికి మాత్రమే కాకుండా శరీరం నుంచి విషాన్ని తొలిగంచడానికి కూడా ఉపయోగిస్తారు. కొబ్బరి నూనె లేదా ఏదైనా కూరగాయల నూనెతో దీన్ని చేయవచ్చు. ఒక టేబుల్ స్పూన్ నూనెను నోట్లోకి తీస్కొని పుల్లింగ్ చేయండి. దాదాపు 15 నిమిషాల పాటు ఇలా చేయాలి. దీంతో నూనె లాలాజలంతో కలస్తుంది. ఇది స్విర్లింగ్ ఎంజైమ్ లను సక్రియం చేస్తుంది.

Beauty Tips amazing home remedy to whiten teeth naturally

Beauty Tips amazing home remedy to whiten teeth naturally

ఆ తర్వాత ఇది దంతాల మధ్య రక్త ప్రవాహాన్ని మెరుగుపర్చి విషాన్ని బయటకు పంపుతుంది. అనంతరం నూనెను ఉమ్మివేయండి.నారింజ పండు తొక్క తీసి కింద భాగం అంటే తెల్లటి బాగాన్ని దంతాల మీద రుద్దడం వల్ల దంతాలు తెల్లగా అవుతాయి. ఇందులో ఉండే డి-లిమోనెన్ వల్ల పళ్లు మిలమిలా మెరుస్తాయి. తొక్క తెల్లటి భాగంలో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి, ఆపై దంతాల అప్లై చేయాలి. అలాగే పసుపు కూడా తేలికపాటి బ్లీచింగ్ ప్రభావాన్ని కల్గి ఉంటుంది. ఇది సహజ క్రిమినాశని కావున దంతాలు చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. పసుపు ద్వారా పేస్టు కూడా తయారు చేసుకోవచ్చు. ఒక టీ స్పూన్ పసుపులో కొబ్బరి నూనె, బేకిండ్ సోడా అర టీ స్పూన్ కలిపి టూత్ పేస్టులా తయారు చేసుకోవచ్చు. అలాగే కలబంద అనేక సమస్యలకు ఔషధంలా పని చేస్తుంది. ఇది దంతాలను తెల్లగా మారుస్తుంది. ఇది దంతాల మీద పసుపు రంగు మరకలను తొలగించడంలో సహాయ పడుతుంది.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది