Andu Korralu : ప్రస్తుతం మారుతున్న జీవనశైలిలో మనము మారాలి అని ఎవరు అన్నారో గానీ నిజంగా ఇప్పుడు అదే జరుగుతుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని పట్టించుకునే తీరిక ఉండని వారందరికీ చిరుధాన్యాలే ప్రస్తుతం ఫస్ట్ ప్రయారిటీగా మారుతుంది. అన్నం కంటే కూడా ఇవి తినడం వలన ఆరోగ్యానికి ఆరోగ్యం, బరువు కూడా కంట్రోల్ లో ఉండటంతో పాటుగా షుగర్ బీపీలు కూడా రాకుండా రక్షిస్తుంది. చిరుధాన్యాలలో అండు కొర్రలు కూడా ఒకటి..
అండు కొర్రలు ఆహారంగా తీసుకున్నట్లయితే మలబద్ధకం, గ్యాస్, అజీర్తి లాంటి సమస్యలు తగ్గటమే కాక పెద్దప్రేగు క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన అనారోగ్య సమస్యల బారిన పడకుండా కూడా ఉంటారు. వీటిలో ఉండే విటమిన్ బి3 శరీరంలో కొలెస్ట్రాల్ ను కరిగించి అధిక బరువు తగ్గటం లో కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాంటి అండు కొర్రలతో రొట్టెలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అండు కొర్రలు రొట్టెల తయారీకి ముందుగా అండు కొర్రలు శుభ్రంగా కడిగి నీటిలో పోసి ఎనిమిది గంటలసేపు నానబెట్టుకోవాలి. దాని తర్వాత వాటినే వడగట్టి, ఎండలో పోసి ఆరబెట్టుకోవాలి.
-ఎండిన అండు కొర్రలను ఒక కడాయిలో వేసి దోరగా వేయించుకొని పిండి పట్టించుకోవాలి. ఒక కిలో అండు కొర్రలు పిండికి 100 గ్రాముల మినప్పప్పు పిండిని కలుపుకోవాలి.
-ఇలా కలిపి పెట్టుకున్న పిండిలో మీకు రొట్టెల తయారీకి కావలసినంత మోతాదుల పిండిని తీసుకొని రుచికి తగినంత ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసుకుని చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి దాని తర్వాత గంట సేపు దానిని నానబెట్టాలి.
-రొట్టెల కోసం కలిపి ఉంచుకున్న పిండిలో రొట్టెలు తయారు చేసుకునే పరిమాణంలో పిండిని తీసుకొని పొడి పిండి చల్లుతూ చపాతీల మాదిరిగా కర్రతో ఒత్తలి. ఈ రొట్టెను పెనంపై వేసుకొని తడి అద్దుతూ కాల్చుకోవాలి. అలాగే అండు కొర్రల రొట్టె తయారు అవుతుంది.
– ఈ రొట్టెను రోజు ఆహారంగా తీసుకున్నట్లయితే షుగర్ కంట్రోల్ అవటంతో పాటుగా, బరువు కూడా ఎంతో ఈజీగా తగ్గుతుంది…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.