Andu Korralu : అండు కొర్రలను ఇలా తింటే… బీపీ, షుగర్ కు చెక్ పెట్టినట్లే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Andu Korralu : అండు కొర్రలను ఇలా తింటే… బీపీ, షుగర్ కు చెక్ పెట్టినట్లే…!

Andu Korralu : ప్రస్తుతం మారుతున్న జీవనశైలిలో మనము మారాలి అని ఎవరు అన్నారో గానీ నిజంగా ఇప్పుడు అదే జరుగుతుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని పట్టించుకునే తీరిక ఉండని వారందరికీ చిరుధాన్యాలే ప్రస్తుతం ఫస్ట్ ప్రయారిటీగా మారుతుంది. అన్నం కంటే కూడా ఇవి తినడం వలన ఆరోగ్యానికి ఆరోగ్యం, బరువు కూడా కంట్రోల్ లో ఉండటంతో పాటుగా షుగర్ బీపీలు కూడా రాకుండా రక్షిస్తుంది. చిరుధాన్యాలలో అండు కొర్రలు కూడా ఒకటి.. Andu Korralu […]

 Authored By ramu | The Telugu News | Updated on :9 June 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Andu Korralu : అండు కొర్రలను ఇలా తింటే...బీపీ, షుగర్ కు చెక్ పెట్టినట్లే...!

Andu Korralu : ప్రస్తుతం మారుతున్న జీవనశైలిలో మనము మారాలి అని ఎవరు అన్నారో గానీ నిజంగా ఇప్పుడు అదే జరుగుతుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని పట్టించుకునే తీరిక ఉండని వారందరికీ చిరుధాన్యాలే ప్రస్తుతం ఫస్ట్ ప్రయారిటీగా మారుతుంది. అన్నం కంటే కూడా ఇవి తినడం వలన ఆరోగ్యానికి ఆరోగ్యం, బరువు కూడా కంట్రోల్ లో ఉండటంతో పాటుగా షుగర్ బీపీలు కూడా రాకుండా రక్షిస్తుంది. చిరుధాన్యాలలో అండు కొర్రలు కూడా ఒకటి..

Andu Korralu గ్యాస్, అజీర్తి స‌మ‌స్య‌లకు చెక్‌

అండు కొర్రలు ఆహారంగా తీసుకున్నట్లయితే మలబద్ధకం, గ్యాస్, అజీర్తి లాంటి సమస్యలు తగ్గటమే కాక పెద్దప్రేగు క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన అనారోగ్య సమస్యల బారిన పడకుండా కూడా ఉంటారు. వీటిలో ఉండే విటమిన్ బి3 శరీరంలో కొలెస్ట్రాల్ ను కరిగించి అధిక బరువు తగ్గటం లో కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాంటి అండు కొర్రలతో రొట్టెలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అండు కొర్రలు రొట్టెల తయారీకి ముందుగా అండు కొర్రలు శుభ్రంగా కడిగి నీటిలో పోసి ఎనిమిది గంటలసేపు నానబెట్టుకోవాలి. దాని తర్వాత వాటినే వడగట్టి, ఎండలో పోసి ఆరబెట్టుకోవాలి.
-ఎండిన అండు కొర్రలను ఒక కడాయిలో వేసి దోరగా వేయించుకొని పిండి పట్టించుకోవాలి. ఒక కిలో అండు కొర్రలు పిండికి 100 గ్రాముల మినప్పప్పు పిండిని కలుపుకోవాలి.
-ఇలా కలిపి పెట్టుకున్న పిండిలో మీకు రొట్టెల తయారీకి కావలసినంత మోతాదుల పిండిని తీసుకొని రుచికి తగినంత ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసుకుని చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి దాని తర్వాత గంట సేపు దానిని నానబెట్టాలి.

Andu Korralu అండు కొర్రలను ఇలా తింటే బీపీ షుగర్ కు చెక్ పెట్టినట్లే

Andu Korralu : అండు కొర్రలను ఇలా తింటే… బీపీ, షుగర్ కు చెక్ పెట్టినట్లే…!

-రొట్టెల కోసం కలిపి ఉంచుకున్న పిండిలో రొట్టెలు తయారు చేసుకునే పరిమాణంలో పిండిని తీసుకొని పొడి పిండి చల్లుతూ చపాతీల మాదిరిగా కర్రతో ఒత్తలి. ఈ రొట్టెను పెనంపై వేసుకొని తడి అద్దుతూ కాల్చుకోవాలి. అలాగే అండు కొర్రల రొట్టె తయారు అవుతుంది.
– ఈ రొట్టెను రోజు ఆహారంగా తీసుకున్నట్లయితే షుగర్ కంట్రోల్ అవటంతో పాటుగా, బరువు కూడా ఎంతో ఈజీగా తగ్గుతుంది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది