
Allu Arjun : బాలయ్య షోలో పుష్పరాజ్ సందడి.. రచ్చ మాములుగా లేదుగా..!
Allu Arjun : ప్రముఖ ఓటీటీ OTT ప్లాట్ ఫామ్ ఆహాలో Aha నందమూరి బాలకృష్ణ N Balakrishna అన్‌స్టాపబుల్ unstoppable సీజన్ 4 విజయవంతంగా దూసుకుపోతుండడం మనం చూస్తూనే ఉన్నాం. మునుపెన్నడూ చూడని విధంగా బాలయ్య తన హోస్టింగ్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. సినీతారల కెరీర్, పర్సనల్ విషయాల గురించి అడియన్స్ కోరుకుంటున్న విషయాలను తెలుసుకుంటున్నారు. ఇప్పటికే మూడు సీజన్స్ సక్సెస్ కాగా.. ఇప్పుడు సీజన్ 4 సైతం ఆకట్టుకుంటుంది. రీసెంట్‌ఘా సూర్యతో పాటు బాబీ డియోల్, డైరెక్టర్ శివ బాలయ్యతో కలిసి అలరించారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు బన్నీ Bunny ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు. నాల్గవ ఎపిసోడ్ కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ Allu Arjun రాబోతున్నారని అధికారికంగా ప్రకటించారు.
అంతేకాదు ప్రోమో కూడా విడుదల చేశారు.మెగాస్టార్ చిరంజీవి ఫోటోను వేసి చూపించాడు బాలయ్య. చిరుతో ఉన్న బంధం, ప్రేమ, గౌరవం గురించి బన్నీ బాగానే చెప్పినట్టున్నాడు. మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధాన్ని ఈ వేదికగా మళ్లీ పంచుకున్నాడనిపిస్తోంది. నీకు ఎప్పుడు ఎక్కువ కోపం వస్తుంది? అని బన్నీని బాలయ్య అడిగాడు. అమ్మాయికి అన్యాయం జరిగింది అని తెలిసినప్పుడు, విన్నప్పుడు అన్నింటి కంటే ఎక్కువగా కోపం వస్తుంది అని బన్నీ ఎమోషనల్ అయ్యాడు.ఈ షోకు బన్నీ తల్లి నిర్మలమ్మ కూడా వచ్చారు. చిన్నతనంలో మీరు బన్నీని కొట్టారా? అని నిర్మలమ్మని బాలయ్య అడిగాడు.
Allu Arjun : బాలయ్య షోలో పుష్పరాజ్ సందడి.. రచ్చ మాములుగా లేదుగా..!
దేనితో కొట్టలేదో అడగండి.. నా మీద అన్నీ ఆయుధాలు వాడారు అని బన్నీ నవ్వేశాడు. అన్నింటికంటే మోస్ట్ పవర్ ఫుల్ వెపన్ ఏంటి? ఏం వాడాక మారిపోయావ్ అని బాలయ్య అడిగితే.. స్నేహా రెడ్డి అని తన భార్య చెప్పి నవ్వేస్తాడు బన్నీ. పుష్ప 2 ప్రమోషన్స్ కోసం అన్‌స్టాపబుల్ షో పాల్గొన్నారు బన్నీ. బాలయ్య షో నుంచే పుష్ప 2 మూవీ ప్రమోషన్స్ ప్రారంభించాలని మూవీ టీం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ షోలో అల్లు అర్జున్ చేసిన సందడి మాములుగా లేదని చెప్పాలి. ఇక బన్నీ నటించిన పుష్ప 2 చిత్రం డిసెంబర్‌లో విడుదల కానుంది. 5న మూవీని రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
This website uses cookies.