Mint Tea : పరిగడుపున పుదీనా టీ తాగుతున్నారా.. అయితే మీరు అవాక్కు అవ్వాల్సిందే….! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mint Tea : పరిగడుపున పుదీనా టీ తాగుతున్నారా.. అయితే మీరు అవాక్కు అవ్వాల్సిందే….!

 Authored By ramu | The Telugu News | Updated on :20 December 2024,8:00 am

Mint Tea : మనం ఉదయం లేవగానే పరిగడుపున కొన్ని రకాల హెల్త్ టిప్స్ పాటిస్తే సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది. అందులో ఒకటైన పుదీనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొంతమంది కాఫీ, టీ ‘ లాంటివి పరగడుపున తాగుతుంటారు.. అలాగే ఈ పుదీనా టీ కూడా తాగుతూ ఉంటారు. ఈ పుదీనా టీ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమై ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. దీంతో నోటికి రుచి, వికారం నుండి ఉపశమనం లభిస్తుంది. అపాన వాయువు,కడుపు నొప్పి నుండి ఉపశమనం పొందడంలో పుదీనా టీ అద్భుతంగా సహాయపడుతుంది. పుట్ట సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

Mint Tea పరిగడుపున పుదీనా టీ తాగుతున్నారా అయితే మీరు అవాక్కు అవ్వాల్సిందే

Mint Tea : పరిగడుపున పుదీనా టీ తాగుతున్నారా.. అయితే మీరు అవాక్కు అవ్వాల్సిందే….!

ఉదయాన్నే ఖాళీ కడుపుతోటి పుదీనా టీని ఒక కప్పు తాగండి. మీలో రోగనిరోధక శక్తిని తట్టుకునే గుణం పెరుగుతుంది. ఇది ఆంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, ఆంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలను కలిగి ఉంది. ఇవన్నీ రోగనిరోధక వ్యవస్థకు సహాయపడతాయి. పుదీనా టీ తో ఈజీగా బరువు తగ్గుతారు. చక్కెర వేసి తయారుచేసిన టీ ‘ కాఫీలు తాగే బదులు క్యాలరీలు లేని పెప్పర్మెంట్ టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు మరింత స్థిరంగా ఉంటాయి. ప్రతిరోజు పరిగడుపున పుదీనా టీ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ చాలా మెరుగుపడుతుంది. దీనివల్ల జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది.అజీర్ణ సమస్య, గ్యాస్,మలబద్ధకం అంటే సమస్యలు కూడా తగ్గుతాయి. దీనివల్ల ఆకలి కూడా బాగా పెరుగుతుంది. సన్నగా ఉండే వారికి ఈ పుదీనా ఆకులు, వారిలో ఆకలిని పెంచి బాగా తినేలా చేస్తాయి. ఫలితంగా వారం బరువు పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా పుదీనాలోని మెంతాల్ అనే పదార్థం కడుపులో వాయువును తగ్గించడంలో సహాయపడుతుంది. పుదీనా టీ వల్ల తలనొప్పి,మైగ్రేన్ నొప్పులు తగ్గిపోవడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది.

అలాగే శ్వాసకోశ మార్గాలను శుభ్రపరుస్తుంది. దీనివల్ల వచ్చే శ్వాసకోశ సమస్యలను నివారిస్తుంది. పుదీనా ఒత్తిడిని తగ్గిస్తుంది. మనసును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. పుదీనా ఆంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని రక్షిస్తాయి. పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్లు చర్మం ముడతలు రాకుండా చేస్తుంది. దీనివల్ల త్వరగా వృద్ధాప్యలో రావు. పుదీనాలోని ఆంటీ బ్యాక్టీరియల్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలర్జీ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పుదీనా ఆకుల నుండి విడుదలయ్యే సహజం మెంథాల్ నూనె ఆవిరి.. తల కండరాలను సడలించడంలో సహాయపడుతుంది. ముఖ చర్మ సౌందర్యాన్ని కూడా దోహదపడుతుంది. పెప్పర్మెంట్ ఈ సాధనంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనిది. కానీ కొంతమంది కడుపునొప్పి గుండెల్లో మంట విరోచనాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దిన టి వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కావున ప్రతిరోజు పరిగడుపున రెండు పుదీనా ఆకులను కానీ, గ్లాస్ వాటర్ లో పుదీనా ఆకులను రెండు మూడు వేసి మరగబెట్టి చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే పరిగడుపున తాగాలి. దీన్నే పుదీనా టీ అని కూడా అంటారు. ఈటీవీ ప్రతిరోజు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది