Meat : మాంసం ఎక్కువగా తింటున్నారా.. ఈ క్యాన్సర్ వస్తుంది జాగ్రత్త..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Meat : మాంసం ఎక్కువగా తింటున్నారా.. ఈ క్యాన్సర్ వస్తుంది జాగ్రత్త..!

Meat : కూరల్లో మాంసం కూర తినడానికి అందరూ ఇష్టపడుతారు. ఎందుకంటే మాంసం కూర తినడానికి చాలా రుచిగా ఉంటుంది. అయితే మాంసం కూరను తింటే చాలానే పోషకాలు అందుతాయని మనందరికీ తెలుసు. కాగా ఇది తింటే వచ్చే రోగాల గురించి మాత్రం ఎవరికీ పెద్దగా తెలియదు. ఏంటీ మాంసం తింటే రోగాలు వస్తాయా అని షాక్ అయిపోకండి.. మీరు విన్నది నిజమే. మాంసం కూర తింటే చాలా పెద్ద క్యాన్సర్ వస్తుందని ఇప్పుడు మనం తెలుసుకుందాం. […]

 Authored By ramu | The Telugu News | Updated on :12 April 2024,9:00 am

Meat : కూరల్లో మాంసం కూర తినడానికి అందరూ ఇష్టపడుతారు. ఎందుకంటే మాంసం కూర తినడానికి చాలా రుచిగా ఉంటుంది. అయితే మాంసం కూరను తింటే చాలానే పోషకాలు అందుతాయని మనందరికీ తెలుసు. కాగా ఇది తింటే వచ్చే రోగాల గురించి మాత్రం ఎవరికీ పెద్దగా తెలియదు. ఏంటీ మాంసం తింటే రోగాలు వస్తాయా అని షాక్ అయిపోకండి.. మీరు విన్నది నిజమే. మాంసం కూర తింటే చాలా పెద్ద క్యాన్సర్ వస్తుందని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు చాలా మందికి ఈ విషయం తెలియదు. దాంతో ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ మాంసం కూరను తినేస్తున్నారు.

Meat : ఆల్కాహాల్ తీసుకున్నా..

ఎందుకంటే చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. అయితే ఇలా మాంసం ఎక్కువగా తినడం వల్ల కూడా ఒక రకమైన క్యాన్సర్ వస్తుంది. అదే కొలొరెక్టల్ క్యాన్సర్. ఇది పెద్దపేగుకు వస్తుందని చెబుతున్నారు. తగినంత వ్యాయామం చేయకపోవడం వల్ల ఇది ప్రధానంగా వచ్చే ప్రమాదం ఉంది. అంతే కాకుండా స్థూలకాయంగా ఉండటం, దానికి తోడు ఆల్కహాల్ లేదా పొగాకు తాగడంతో పాటు పండ్లు కూరగాయలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం లాంటివి కూడా ఇది రావడానికి కారణం అవుతుంటాయి. చాలా మంది కొవ్వు, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటారు. అందులోనూ రెడ్ మీట్ ను బాగా తింటుంటారు. ఈ మధ్య ఎక్కువ మంది ప్రాసెస్ చేసిన ఫుడ్ ను అధికంగా తింటున్నారు. దాని వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. మాంసాన్ని ఎక్కువ వేడితో వండినప్పుడు ఆ మాంసంలో నుంచి క్యాన్సర్ కారక రసాయణాలు బయటకు వస్తుంటాయి.

Meat మాంసం ఎక్కువగా తింటున్నారా ఈ క్యాన్సర్ వస్తుంది జాగ్రత్త

Meat : మాంసం ఎక్కువగా తింటున్నారా.. ఈ క్యాన్సర్ వస్తుంది జాగ్రత్త..!

అవి పెద్దపేగు క్యాన్సర్ కు కారణం అవుతుంటాయి. మనం తినేటప్పుడు కూడా అవసరం అయినంత తినకపోవడం, వ్యాయామం, ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం లాంటివి కూడా పెద్దపేగు క్యాన్సర్ కు కారణం అవుతాయి. ఇలా పెద్దపేగు క్యాన్సర్ వచ్చినప్పుడు మలబద్దకం, విరేచనాలు, మలంలో రక్తం రావడం లాంటివి జరుగుతాయి. త్వరగా అలసిపోవడం, సడెన్ గా బరువు తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. ముందుగానే తగిన చికిత్స తీసుకుంటే దీన్ని తగ్గించుకోవచ్చు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది