YSRCP TDP : వైసీపీ లో చేరబోతున్న టీడీపీ కీలక నేత..?
YSRCP TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న వేళ, రాజకీయ రంగంలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పార్టీ మార్పుల అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత జిల్లైన కడపలో టీడీపీకి సుదీర్ఘకాలంగా బలంగా నిలిచిన సుగవాసి కుటుంబం ఇప్పుడు వైసీపీ కండువా కప్పేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు జోరుగా నడుస్తున్నాయి.
YSRCP TDP : వైసీపీ లో చేరబోతున్న టీడీపీ కీలక నేత..?
సుగవాసి పాలకొండ్రాయుడు 1978లో జనతా పార్టీ తరఫున రాయచోటిలో ఎమ్మెల్యేగా గెలవగా, అనంతరం స్వతంత్ర అభ్యర్థిగా కూడా విజయం సాధించారు. 1984లో టీడీపీలో చేరిన తరువాత రాయలసీమ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. రాజంపేట ఎంపీగా, రాయచోటి ఎమ్మెల్యేగా అనేక విజయాలు సాధించారు. వారసుడిగా మిగిలిన బాలసుబ్రమణ్యం 2024 ఎన్నికల్లో రాజంపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన తరువాత పార్టీకి దూరమయ్యారు. ఇక ఇప్పుడు పార్టీ పై అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేస్తూ చంద్రబాబుకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. నిజానికి ఆయన వైసీపీ నేతలతో సంప్రదింపుల అనంతరం రాజీనామా చేసినట్టు ప్రచారం సాగుతోంది.
బలిజ సామాజిక వర్గంలో తనదైన ప్రాధాన్యం ఉన్న సుగవాసి కుటుంబాన్ని పార్టీలోకి తీసుకోవడం ద్వారా, రాయలసీమలో సామాజిక సమీకరణాలను బలోపేతం చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. బాలసుబ్రమణ్యంకు రాజంపేట ఎంపీ టికెట్ హామీ ఇచ్చినట్లు సమాచారం, ఇక మిథున్ రెడ్డి పీలేరు నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం. అయితే ఈ తరుణంలో జనసేన కూడా సుగవాసిని తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు నేతలు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారని సమాచారం. కానీ సుగవాసి మద్దతుదారులు మాత్రం కూటమిలో ఇతర పార్టీలలో చేరే ఆస్కారమే లేదని స్పష్టం చేస్తున్నారు. వచ్చే వారం జగన్‌తో భేటీ అనంతరం అధికారికంగా వైసీపీలో చేరిక ఖరారవుతుందని భావిస్తున్నారు. మరి పాలకొండ్రాయుడు ఫైనల్ గా ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్‌లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.