Milk : మీ పిల్లలకు ఉదయాన్నే పరగడుపున పాలు తాగిస్తున్నారా… ఎంత ప్రమాదమో తెలుసా…?
ప్రధానాంశాలు:
Milk : మీ పిల్లలకు ఉదయాన్నే పరగడుపున పాలు తాగిస్తున్నారా... ఎంత ప్రమాదమో తెలుసా...?
Milk :ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆరోగ్యాన్ని అందించాలని ఎన్నో రకాల పోషకాలు కలిగిన ఆహారాలను అందిస్తూ ఉంటారు. వారి పోషకాహార విషయాన్నికొస్తే ముందుగా గుర్తొచ్చేది పాలు. పిల్లలకు ప్రతి ఒక్కరు కూడా పాలు తాగించే అలవాటు చేస్తున్నారు. పాలు పిల్లలకు పుష్కలమైన క్యాల్షియం అందిస్తుంది.అలాగే ఆరోగ్యంగానూ బలంగాను ఉంచుతుంది. పాలు పిల్లలకు తాగించే సమయం విషయంలో కూడా సరైన సమయం ఉందని మీకు తెలుసా. ఎప్పుడు పడితే అప్పుడు పిల్లలకు పాలు ఇవ్వడం కాదు ఏ సమయంలో ఇవ్వాలో తెలుసుకోవాలంటున్నారు నిపుణులు ఇలా మంచి సమయంలో ఇస్తే పిల్లలకు మంచి పోషణతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇవ్వగలుగుతాం అంటున్నారు వైద్య నిపుణులు మరి ఏ సమయంలో పాలు తాగకూడదు, ఏలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయో తెలుసుకుందాం..

Milk : మీ పిల్లలకు ఉదయాన్నే పరగడుపున పాలు తాగిస్తున్నారా… ఎంత ప్రమాదమో తెలుసా…?
తల్లిదండ్రులు పిల్లలు ఉదయం నిద్ర లేవగానే మొదట బ్రష్ చేసిన వెంటనే పరిగడుపున పిల్లలకు తాగిస్తుంటారు. అయితే, ఇలా చేస్తే పిల్లలకు మలబద్ధకం తగ్గుతుందని వారు భావిస్తూ ఉంటారు. కానీ,ఈ అలవాటు పిల్లల్లో కొన్ని సమస్యలను తెచ్చిపెడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు పాలు పరగడుపున తాగితే చిరాకును అనుభవిస్తారు. అంతేకాదు, కొందరు నిపుణులు పిల్లలకి ఉదయాన్నే పరిగడుపున పాలు ఇవ్వకూడదని హెచ్చరిస్తున్నారు కూడా.
Milk ఉదయం పూట పిల్లలకు పాలు ఎందుకు ఇవ్వకూడదు
పాలలో క్యాల్షియం,ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం చేత ఆరోగ్యానికి మంచిది.ఉదయాన్నే మొదట పాలు తాగితే కొన్ని సమస్యలు ఎదురవుతాయి. పాలలో ఫైబర్ కార్బోహైడ్రేట్లో తక్కువగా ఉంటాయి. ఈ రెండు లేకపోవడం వల్ల ఉదయం పూట పాలు తాగడం సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా,ప్రతిరోజు చురుగ్గా ఉండాలనుకుంటే ఉదయం పాలు తాగడం తగ్గించాలి. ఇది జీర్ణశక్తిని బలహీన పరుస్తుంది. శక్తి తగ్గిపోతుంది. కాబట్టి,పిల్లలకు ఏదైనా తినిపించిన తర్వాతనే పాలు ఇవ్వడం మంచిది. పిల్లలకు అల్పాహారం తర్వాతే పాలు తాపించాలి. ఏదైనా టిఫిన్ తినిపించిన తరువాత పాలు ఇవ్వడం మంచిది.
ఆకలి మందగించడం : పరగడుపున ఉదయాన్నే పాలు తాగితే,పొట్ట నిండుగా అనిపిస్తుంది. పాలలో ఉండే కొవ్వు ప్రోటీన్ల జీర్ణశక్తిని నిమ్మరిస్తుంది. దీనివల్ల పిల్లలకు ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి కలిగిస్తుంది.ఫలితంగా వారికి ఆకలి వేయదు. పిల్లలకు ఆకలి వేయకపోతే వారు ఇతర పోషకాలను తీసుకోలేరు.కాబట్టి, వారు ఎదుగుదల ఆటంకాన్ని కలిగిస్తుంది. ఉదయం నిద్ర లేవగానే పిల్లలకు తల్లిపాలు కూడా ఇవ్వకూడదని గుర్తుంచుకోవాలి.
పొట్ట ఉబ్బరం : పాలల్లో ఫైబర్ ఉంటుంది. ఫైబర్ తక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే జీర్ణ వ్యవస్థ చురుగ్గా ఉంటుంది.అందుకే గ్యాస్ సమస్యలు తగ్గించడానికి ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తినమని చెబుతుంటారు.వైద్యులు పాలల్లో ఫైబర్ లేనందున ఎక్కువ మోతాదులో తీసుకుంటే అది సరిగ్గా జీర్ణం కాకపోవచ్చు. దీనివల్ల రోజంతా అసౌకర్యం కడుపు ఉబ్బరం అనిపిస్తుంది. గ్యాస్ ఎసిడిటీ సమస్యలు కూడా తలెత్తుతాయి. ఈ లక్షణాలు అందరిలో కనిపిస్తాయని చెప్పలేం. జీర్ణ సమస్యలు ఉన్న వారిలో అధిక మోతాదులో పాలు తీసుకున్నప్పుడు ఈ లక్షణాలు తీవ్రమైన అవకాశం కూడా ఉంటుంది. కడుపులో పాలు తీసుకుంటే కడుపులో తిప్పినట్లు ఉంటుంది.కాబట్టి, ఏదైనా అల్పాహారం తీసుకున్న తర్వాత పాలు సేవిస్తే ఇలాంటి సమస్య ఉండదు.
రాత్రి పూట పాలు వద్దు : రాత్రి సమయంలో ఎక్కువ పాలు తాగితే, పిల్లల్లో ఐరన్ లోపం ఏర్పడవచ్చు.ఇతర ఆహార పదార్థాల నుండి ఐరన్ గ్రహింపుసరిగా జరగదు. అంతేకాదు, పాలలో సహజ చెక్కర్లు ఎక్కువగా ఉంటాయి. ఇది పిల్లల్లో రక్తంలో చక్కర స్థాయిలో పెంచుతుంది.ఫైబర్ లోపం వల్ల పిల్లలు తరచుగా అనారోగ్యానికి గురవుతుంటారు. కాబట్టి,ఏదైనా తిన్న తర్వాతనే పాలు తాగిస్తే మంచిది.
ఏం తింటే మంచిది : పాలకు బదులుగా తేలికైనా ఆహారాలు ఇవ్వడం. ఆపిల్, అరటిపండు, లేదా పొప్పడి వంటి పండ్లను ఇవ్వవచ్చు. ఇవి అందుబాటులో లేకపోతే, ఆహారము అయినా ఇడ్లీ, దోశ, ఉప్మా,పోహా వంటివి ఇవ్వవచ్చు. ఎల్లో సరైన మోతాదుల్లో పోషకాలు ఉంటాయి. ఇవి రుచిగా ఉంటాయి. మీ పిల్లలు సంతోషంగా తింటారు. ఓట్స్ లేదా కూడా ఇవ్వవచ్చు. అయినప్పటికీ ఉదయం పాలు ఇవ్వాలనుకుంటే ఏదైనా తినిపించిన తర్వాతే ఇవ్వటం ఆరోగ్యానికి మంచిది. ఉదయం కాకపోతే సాయంత్రం స్నాక్స్ సమయంలో కూడా పాలు ఇవ్వవచ్చు.కానీ ఖాళీ కడుపుతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకు పాలు తాపించకండి.ఇది వారిని ఆనారోగ్య సమస్యకు గురి చేయించడానికి కారణమవుతుంది.