Smart Phone : మీరూ ఎక్కువగా స్మార్ట్ ఫోన్ చూస్తున్నారా..? ఏకంగా మీ కంటిచూపు పోయే ప్రమాదం ఉంది జాగ్రత్త..!
Smart Phone : ప్రస్తుతం మనం ఉన్న జనరేషన్లో స్మార్ట్ ఫోన్లు వాడకం ఎక్కువవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ నీ ప్రపంచంగా అనుకుంటూ ఉంటారు. స్మార్ట్ ఫోన్ ప్రపంచాన్ని అరచేతిలోకి తెచ్చుకున్న ఒక సాధనం. దీని వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో..ఎక్కువగా వినియోగం వలన అన్ని అనర్ధాలు కూడా ఉన్నాయి. ఉదయం లేచిన దగ్గర నుండి మళ్లీ పడుకునే వరకు నిద్ర పట్టేంతవరకు చేతిలో ఫోన్ చూస్తూనే ఉండాల్సిందే.. అయితే దీనివలన ఎన్నో అనారోగ్యాలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా మహిళలలో స్మార్ట్ఫోన్ ఎక్కువగా వాడుతున్నవాళ్లు దృష్టిలోపం వస్తుంది. అని వైద్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాలలో లైట్ ఆపి మరి ఫోన్ ని వాడుతూ ఉంటారు. అయితే ఆ విధంగా వాడడం వల్ల కంటిపై తీవ్ర ఎఫెక్ట్ పడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
దీనికి సంబంధించిన ఓ లైవ్ కేస్ స్టడీని హైదరాబాద్ కు చెందిన ఓ ముఖ్య వైద్యుడు తన సోషల్ మీడియాలో ఈ వివరాలను పెట్టడం జరిగింది..ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం… ఇదే కేసు : హైదరాబాద్ కి చెందిన 30 ఏళ్ల ఓ మహిళ తన స్మార్ట్ ఫోన్ కి బాగా ఆడిక్ట్ అయిపోయింది. చీకట్లో కూడా గంటలు తరబడి అదే పనిగా ఫోన్ చూస్తూ ఉంటుంది. దాంతో ఆమెకు త్రీవరమైన దృష్టిలోపం సోకింది. సుమారు ఒకటిన్నర ఏళ్లగా ఈ మహిళ ఈ వ్యాధితో ఇబ్బంది పడుతోంది. ఆమె అపోలో హాస్పటల్ న్యూరాలజిస్ట్ డాక్టర్ కుమార్ ను కలిశారు. దాంతో ఆ డాక్టర్ ఆ మహిళకు కలిగిన బాధను లక్షణాలను అందించిన చికిత్సను ట్విట్టర్ వేదిక ద్వారా తెలిపారు. మంజు అనే ఈ మహిళ సుమారు ఒకటిన్నర ఏళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఏ వస్తువు సరిగా కనిపించదు.
ప్రకాశవంతమైన వస్తువులు చూడలేక పోతుంది. కొన్ని వస్తువులు బ్లరుగా కొన్ని జిగ్జాగ్ లాగా కనిపిస్తూ ఉంటాయి. ఏ వస్తువుని ఆమె సరిగా గుర్తించలేదు. దాంతో డాక్టర్ ఆమె లైఫ్ స్టైల్ అలవాటులను సెల్ ఫోన్ వాడకం లాంటి వివరాలు తెలుసుకొని ఆమెకు స్మార్ట్ ఫోన్ అనే వ్యాధి సోకినట్లు తెలియజేశారు… కళ్ళను ఏ విధంగా కాపాడుకోవాలి : స్మార్ట్ ఫోన్ ను ఏ విధంగా నివారించొచ్చు. దానిపై డాక్టర్ కొన్ని సూచనలు కూడా తెలిపారు.. 20 _20_20 నియం అని కూడా పిలవబడే ఈ నియమాన్ని పాటిస్తూ ఉండాలి.అంటే డిజిటల్ స్క్రీన్ ని వాడుతున్నప్పుడు 20 అడుగుల దూరంలో ఉండాలి. అలాగే ప్రతి 20 నిమిషాలకు 20 సెకండ్లు విరామం తీసుకోవాలి.. అధిక రిజర్వేషన్ స్క్రీన్ లను వాడితే మంచిది. పరిస్థితి మరింత దిగజారడానికి ముందే మీరు స్వల్పంగా
ఒత్తిడిని అనుభవిస్తున్నప్పుడే వెంటనే కంటి పరీక్షలు చేయించుకోవాలి. మీరు పని చేస్తున్న లేదా కంప్యూటర్ లేదా ఫోన్ స్క్రీన్ చూస్తున్న గది బాగా వెలుతురు ఉండేలా చూసుకోవాలి. డిజిటల్ పరికరాల స్క్రీన్ లను ఎక్కువసేపు చూడకుండా ఉంటే మంచిది. లేదా త్రివరమైన దృష్టి సమస్యలు వస్తాయి. డాక్టర్ అందించిన ట్రీట్మెంట్ ఏంటి; ఈ వ్యాధిని గుర్తించిన డాక్టర్ ఆ మహిళకు ఎలాంటి మందులు ఇవ్వలేదు కొన్ని పరీక్షలు చేసి మందులు ఇవ్వాలని ఆమెకి చెప్పలేదు. ప్రధానంగా స్మార్ట్ ఫోన్ వాడకాన్ని తగ్గించాలని తెలియజేశారు. దాంతో ఆ మహిళ ఫోన్ వాడకాన్ని తగ్గించేసింది. తిరిగి ఓ నెల రోజుల తర్వాత తిరిగి వచ్చి తన కంటి చూపు ప్రస్తుతం మెరుగుపడిందని దాంతో సుమారు 18 నెలల పాటు చాలా ఇబ్బందులు పడ్డానని ఇప్పుడు ఆమె ప్రతిదీ కూడా ఎంతో స్పష్టంగా చూడగలుగుతున్నానని సంతోషంగా తెలియజేసింది.
4. The diagnosis was obvious now. She was suffering from smartphone vision syndrome (SVS). Long-term use of devices such as computer, smartphones or tablets can cause various eye-related disabling symptoms, referred to as computer vision syndrome (CVS) or digital vision syndrome.
— Dr Sudhir Kumar MD DM???????? (@hyderabaddoctor) February 6, 2023