Banana Stem : అరటి కాండం ఆరోగ్యానికి అమృత భాండం… నెల‌కు ఒక్క‌సారైన తినండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Banana Stem : అరటి కాండం ఆరోగ్యానికి అమృత భాండం… నెల‌కు ఒక్క‌సారైన తినండి..!

 Authored By ramu | The Telugu News | Updated on :4 June 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Banana Stem : అరటి కాండం ఆరోగ్యానికి అమృత భాండం... నెల‌కు ఒక్క‌సారైన తినండి..!

Banana Stem : మనం రోజు తీసుకునే ఎన్నో పండ్లలలో పోషకాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కానీ వాటిలో ముఖ్యమైనది అరటిపండు. సాధారణంగా అరటిపండు దాని పూలు మనం ఎక్కువగా తీసుకోము. అరటి చెట్టులోను ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అరటి కాండం కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీంతో మన ఆరోగ్యానికి కావలసినటువంటి పోషకాలు కూడా వస్తాయి. ఎన్నో వ్యాధులను కూడా నయం చేయగలదు. సాంప్రదాయ వైద్యంలోనూ ఉపయోగిస్తారు. కావున అరటి కాండం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం….

Banana Stem  : పోషకాలు

అరటిపండు ల్లో పీచు పదార్థాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇవి కాక దీనిలో పొటాషియం, మెగ్నీషియం, కాపర్, ఐరన్ లాంటి ఇతర ఖనిజాలు,విటమిన్ సి, బి6 లాంటి పోషకాలు కూడా ఉంటాయి…

Banana Stem  బరువు తగ్గటానికి మంచిది

దీనిలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కావున మీరు అరటి కాండం రసాన్ని రోజు తాగటం వలన బరువు తగ్గటానికి తొందరగా మంచి ఫలితాలు కూడా కనిపిస్తాయి. ముఖ్యమైన విషయం ఏమిటి అంటే. దీనిలో ప్రత్యేకమైన ఫైబర్ అనేది ఉంటుంది. ఇది శరీరం నుండి చెడు కొవ్వులను తీసివేయటములో కూడా ఎంతో మేలు చేస్తుంది…

Banana Stem  కడుపు సమస్యలకు మంచిది

అరటి రసం శరీరంలోని టాక్సిన్ లను బయటకు పంపుతుంది. అంతేకాక పొట్టకు కూడా చాలా మంచిది. ఇది ఆ జీర్ణం, మలబద్ధకం లేక ఎసిడిటీ లాంటి సమస్యల నుండి కూడా ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. అలాగే ఇది ఎసిడిటీ కారణంగా కడుపు లేక చాతిలో మంటను కూడా అధిగమించేందుకు ఎంతో సహాయం చేస్తుంది…

హిమోగ్లోబిన్ కౌంటింగ్ పెంచుతుంది : అరటి పండులో విటమిన్ బీ6అనేది పుష్కలంగా ఉంటుంది. ఐరన్ కూడా ఎంతో పుష్కలంగా ఉంటుంది. కావున ఇది హిమోగ్లోబిన్ సంఖ్యను కూడా పెంచగలదు. అదే టైమ్ లో దీనిలో ఉండే పొటాషియం, కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు సమస్యలను కూడా తొలగిస్తుంది…

మూత్ర సంబంధిత సమస్యలకు మేలు : కిడ్నీలో రాళ్ల సమస్యలతో బాధపడే వారికి కూడా ఈ అరటి కాండం రసం అనేది ఎంతో మేలు చేస్తుంది. దీనిని రోజు తీసుకోవటం వలన కిడ్నీలో రాళ్లు కూడా ఏర్పడకుండా ఉంటాయి. ఇది కాక యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వలన కలిగే నొప్పి అసౌకర్యాలను కూడా సమర్థవంతంగా తగ్గిస్తుంది…

మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది : మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఈ అరటి కాండ రసం రోజు తాగితే ఇన్సులిన్ స్థాయిలు అనేవి అదుపులో ఉంటాయి. దీనిలో ఉండే పీచు పదార్థం అందాలి అంటే,వడకట్టకుండా తీసుకోవాలి.

Banana Stem అరటి కాండం ఆరోగ్యానికి అమృత భాండం నెల‌కు ఒక్క‌సారైన తినండి

Banana Stem : అరటి కాండం ఆరోగ్యానికి అమృత భాండం… నెల‌కు ఒక్క‌సారైన తినండి..!

కామెర్లకు పరిష్కారం : కామెర్లు ఉన్నవారు అరటి కాండంను ఎండలో బాగా ఆరబెట్టి, పొడిలా చేసుకుని రోజు ఒక చెంచా చొప్పున దీనిలో తేనే కలుపుకొని తీసుకుంటే చాలా మంచిది. క్రమం తప్పకుండా కొద్ది రోజులపాటు ఇలా చేసినట్లయితే సమస్యలు అనేవి తగ్గు ముఖం పడతాయి…

మహిళల సమస్యలకు పని చేస్తుంది : అరటి కాండంలో కాస్త ఆవాలు కలుపుకొని తీసుకున్నట్లయితే అలర్జీ, చర్మ చికాకు మరియు మూలవ్యాధి అనే సమస్యలు కూడా తగ్గుతాయి. రుతుక్రమం టైమ్ లో మహిళలకు వచ్చే వివిధ సమస్యలకు కూడా అరటి కాండం అనేది పరిష్కారం చూపుతుంది. మీరు అరటి పువ్వు రసాన్ని కూడా తీసుకోవచ్చు…

అరటి కాండం రసం ఎలా తయారు చేయాలి : ముందు అరటి కాండం సన్నగా తరిగి మిక్సీ జార్లో వేసి, ఒక కప్పు నీళ్లు పోసి గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసుకోవాలి.తర్వాత దానిలో ఒక చెంచా వరకు నిమ్మరసం మరియు కొద్దిగా ఉప్పు మరియు పంచదార కొద్దిగా వేసుకుని తాగాలి…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది