Castor Oil : బ్యూటీ కేర్ లో ఆముదాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసా…!!
Castor Oil : ఆముదం అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు ఎప్పుడు చెబుతూ ఉంటారు. అలాగే ఇది ఆడవారికి సౌందర్య రక్షణలో కూడా ఎంతో సహాయపడుతుంది. అయితే ఈ ఆముదం అనేది చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలో విటమిన్ ఇ మరియు యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమెంటరీ, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీలు సమృద్ధిగా ఉంటాయి. ఇది చర్మం యొక్క అందాన్ని పెంచడంలో ఎంతో హెల్ప్ చేస్తాయి. అయితే ఆముదాన్ని రోజు ముఖానికి […]
ప్రధానాంశాలు:
Castor Oil : బ్యూటీ కేర్ లో ఆముదాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసా...!!
Castor Oil : ఆముదం అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు ఎప్పుడు చెబుతూ ఉంటారు. అలాగే ఇది ఆడవారికి సౌందర్య రక్షణలో కూడా ఎంతో సహాయపడుతుంది. అయితే ఈ ఆముదం అనేది చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలో విటమిన్ ఇ మరియు యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమెంటరీ, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీలు సమృద్ధిగా ఉంటాయి. ఇది చర్మం యొక్క అందాన్ని పెంచడంలో ఎంతో హెల్ప్ చేస్తాయి. అయితే ఆముదాన్ని రోజు ముఖానికి అప్లై చేసుకోవడం వలన స్పాట్స్ మరియు నల్ల మచ్చలు, మొటిమలకు సంబంధించిన మచ్చలు కూడా తొలగిపోతాయి. అయితే ఈ ఆముదం లో రిసినోలిస్ యాసిడ్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఈ లక్షణాలు అనేవి సౌందర్య పోషణకు ఎంతో హెల్ప్ చేస్తాయి. అయితే ఈ ఆముదాన్ని రోజు ముఖానికి అప్లై చేసుకోవడం వలన మీ ముఖంలో గ్లో పెరగడమే కాకుండా స్కిన్ అనేది టైట్ గా కూడా మారుతుంది…
అయితే మనకు వయసు పెరుగుతున్న కొద్దీ ముఖంపై ముడతలు అనేవి వస్తూ ఉంటాయి. అయితే ఆ ముడతలను మాయం చేసి అందంగా కనిపించేలా చేయడంలో ఈ ఆముదం హెల్ప్ చేస్తుంది. అయితే ఎంతో మంది డ్రై స్కిన్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటివారు గనుక ముఖానికి ఆముదాన్ని రాసుకుంటే చర్మం అనేది ఎంతో మృదువుగా మరియు హైడ్రేటెడ్ గా కూడా మారుతుంది. అయితే ఉదయం నిద్ర లేవగానే లేక రాత్రి పడుకునే టైమ్ లో ఒక చుక్క ఆముదాన్ని పెదాలకు రాసుకుంటే కొద్దిరోజుల్లోనే లేత మరియు ఎంతో కోమలమైన పెదవులు మీ సొంతం అవుతాయి. ఈ ఆముదం అనేది ఎంతో సహజ సిద్ధమైన లిప్ బామ్ గా కూడా పని చేస్తుంది. అలాగే మీరు ఎండలో బయటకు వెళ్లినా, వెళ్లకపోయినా ట్యాన్ అనేది వస్తూ ఉంటుంది. అయితే ఆ ట్యాన్ ను నియంత్రించడంలో ఈ ఆముదం ఎంతో హెల్ప్ చేస్తుంది.
కొంతమంది కైతే మోచెయ్యి మరియు మెడ భాగంలో నల్లగా మారుతూ ఉంటుంది. ఇలాంటివారు ఆముదం లో కాస్త ఆలివ్ నూనె మరియు నిమ్మరసాన్ని కలుపుకొని ఆ ప్రాంతంలో మర్దన చేస్తే నెలరోజులలో మంచి ఫలితం ఉంటుంది. అలాగే పాదాల పగుళ్ల సమస్యలకు కూడా ఆముదంతో చెక్ పెట్టవచ్చు. దీనికి ఆముదం లో కాస్త పసుపు కలుపుకొని పగిలిన ప్రాంతములో రాస్తే కొద్ది రోజుల్లోనే పగుళ్ల సమస్యలు నయం అవుతాయి. అయితే ఈ ఆముదం అనేది సహజ క్లేన్సర్ లాగా కూడా పని చేస్తుంది. ఈ ఆముదం ను ముఖానికి అప్లై చేసుకొని పది నిమిషాల పాటు ఆవిరి పట్టినట్లయితే చర్మ కణాలు అనేవి ఎంతో క్లీన్ అవుతాయి. అలాగే ముఖంపై పేర్కొన్నటువంటి మురికి కూడా క్లిన్ అవుతుంది. అలాగే చర్మం కూడా ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది…