Castor Oil : ఆముదంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Castor Oil : ఆముదంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా…?

 Authored By ramu | The Telugu News | Updated on :31 December 2024,11:30 am

ప్రధానాంశాలు:

  •  Castor Oil : ఆముదంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా...?

Castor Oil : ఆముదంలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు health Tips ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారు. ఆముదాన్ని ఈ రోజుల్లో వాడాలంటే తీసి పడేస్తారు. మీ ఇళ్లల్లో ముసలి వాళ్ళని అడిగితే దీని బెనిఫిట్స్ ఏంటో చెబుతారు. ముఖంపై ముడతలు, చర్మం పొడిబారడం వంటి సమస్యలకు ఆముదంతో చెక్ పెట్టవచ్చు. ఆముదాన్ని సాంప్రదాయ వైద్య విధానంలో విరివిగా ఉపయోగిస్తారు. ఈ ఆముదాన్ని ఎక్కువగా వినియోగిస్తే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో నిపుణులు తెలియజేశారు. జుట్టు సంబంధించిన సమస్యలు, జీర్ణాశయ సమస్యలు వంటి నివారణకు బాగా ప్రాచుర్యం పొందింది. ఆముదం తనలో ఉండే ఔషధ గుణాలు వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు అందిస్తుంది. ఈ సహజమైన నూనె ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Castor Oil ఆముదంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా

Castor Oil : ఆముదంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా…?

Castor Oil  1) జీర్ణ క్రియ కు మంచిది

ఆముదంలో ఉండే రిసీనోలిక్ యాసిడ్ పేగులు కదలికలు పెంచుతుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. జీర్ణ రసాల స్రావాన్ని పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
.2) చర్మ సౌందర్యానికి మంచిది : ఆముదంలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ముడతలు లేకుండా చేస్తుంది. ముఖంపై మచ్చలు లేకుంటే చేస్తుంది. చర్మం తేమగా ఉంచుతుంది. పొడి చర్మాన్ని నివారిస్తుంది. జుట్టు పెరుగుదలకు ప్రేరేపిస్తుంది. జుట్టు రాలి సమస్య పూర్తిగా తగ్గుతుంది.

.3) రోగనిరోధక శక్తి పెంచుతుంది : చాముదములో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి, ఆంటీ ఫంగల్ గుణాలు శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
4.) నొప్పులను తగ్గిస్తుంది :ఆముదములో ఉండే ఆంటీ ఇన్ఫల మెటరీ గుణాలు కీళ్ల నొప్పులు, మోకాలి నొప్పులు వంటి వాటిని తగ్గిస్తాయి. కండరాల నొప్పులను తగ్గిస్తాయి, కండరాల వాపును తగ్గిస్తాయి.

5.) ఇతర ప్రయోజనాలు :  ఆముదం ఋతుస్రావ సమస్యలను తగ్గిస్తుంది. దర్బాదారుల సమస్యలను కూడా తగ్గిస్తుంది. చెవుల నొప్పులను తగ్గిస్తుంది. కళ్ళకు మంచిది. పాదాల పగుళ్లు తగ్గుతాయి. ఆముదము ఆయిల్ తో మసాజ్ చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది.

ఆముదాన్ని ఎలా వాడాలి : ఆముదాన్ని నోటి ద్వారా లేదా శరీర భాగానికి అప్లై చేయవచ్చు. ఆమె దాన్ని నేరుగా కాకుండా ఒక టీ స్పూన్ ఆముదాన్ని ఒక గ్లాస్ పాలలో కలిపి తాగాలి. ఎక్కడైతే నొప్పి ఉందో ఆ ప్రదేశంలో ఆముదాన్ని రాసి మర్దన చేయాలి. ఇలా చేస్తే ఉపశమనం లభిస్తుంది.

ఆముదం అందరికీ మంచిది కాదు : చిన్నపిల్లలు, పాలిచ్చే స్త్రీలు, గర్భిణీ స్త్రీలు, ఆముదాన్ని వాడకూడదు. పాము దాన్ని వాడే ముందు వైద్యుని సంప్రదించడం మంచిది. ఆముదం ఒక అద్భుతమైన సహజమైన నూనె. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది. ఆముదాన్ని సరిగ్గా వాడడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది