Beauty Tips : 5 రూపాయలకే స్వీట్ షాప్ లో దొరికే ఈ వస్తువుతో మీ ముఖము తెల్లగా అవుతుంది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Beauty Tips : 5 రూపాయలకే స్వీట్ షాప్ లో దొరికే ఈ వస్తువుతో మీ ముఖము తెల్లగా అవుతుంది..!

Beauty Tips : చాలామంది స్కిన్ వైట్ గా అవ్వడం కోసం పార్లర్కి వెళ్లి ఎన్నో వేల రూపాయలు ఖర్చులు చేస్తూ ఉంటారు. ఏదైనా ఫంక్షన్స్, పార్టీకి వెళ్లాలన్న అందంగా కనిపించాలని అనుకుంటూ ఉంటారు. అయితే మరింత అందంగా కనిపించడం కోసం ఫేషియల్స్ లేదా సిల్వర్ ఫేషియల్ చేయించుకుంటూ ఉంటారు. వాటికి ఎన్నో వేల ఖర్చు అవుతూ ఉంటాయి. అయితే అలాంటివి చేసుకున్న రెండు రోజులు మూడు రోజులు మాత్రమే ఉంటాయి. కానీ కేవలం ఐదు రూపాయలతో […]

 Authored By prabhas | The Telugu News | Updated on :11 December 2022,2:00 pm

Beauty Tips : చాలామంది స్కిన్ వైట్ గా అవ్వడం కోసం పార్లర్కి వెళ్లి ఎన్నో వేల రూపాయలు ఖర్చులు చేస్తూ ఉంటారు. ఏదైనా ఫంక్షన్స్, పార్టీకి వెళ్లాలన్న అందంగా కనిపించాలని అనుకుంటూ ఉంటారు. అయితే మరింత అందంగా కనిపించడం కోసం ఫేషియల్స్ లేదా సిల్వర్ ఫేషియల్ చేయించుకుంటూ ఉంటారు. వాటికి ఎన్నో వేల ఖర్చు అవుతూ ఉంటాయి. అయితే అలాంటివి చేసుకున్న రెండు రోజులు మూడు రోజులు మాత్రమే ఉంటాయి. కానీ కేవలం ఐదు రూపాయలతో స్వీట్ షాప్ లో దొరికే ఫేషియల్ వేసుకున్నట్లయితే మీ ముఖం అందంగా కాంతివంతంగా తయారవుతుంది. ఈ రెమిడి తయారు చేసుకోవడానికి ముందుగా ముఖానికి స్క్రబ్ చేయాలి. స్క్రబ్ కోసం ఒక గిన్నెను తీసుకొని ఒక చెంచా పెరుగు తీసుకోవాలి.

ఈ స్క్రబ్ కోసం పుల్లటి పెరుగు కాకుండా తీయటి పెరిగును మాత్రమే వాడాలి. దీనిలో ఒక చెంచా పంచదార కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి స్క్రబ్ లాగా చేయాలి. పెరుగుతో స్క్రబ్ చేసుకోవడం వలన ముఖంపై ఉండే జిడ్డు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ మురికి లాంటివి అన్ని పోతాయి. మీ ముఖం స్మూత్ గా తయారవుతుంది. ముఖంపై ఉండే టాన్ పోతే ఫేషియల్ యొక్క రిజల్ట్ చాలా బాగా వస్తుంది. తర్వాత ముఖాన్ని శుభ్రంగా నీటితో కడిగి ముఖానికి అలోవెరా జెల్లి పెట్టుకోవాలి. తర్వాత స్వీట్ షాప్ లో దొరికే గోల్డ్ పేపర్ లేదా సిల్వర్ పేపర్ ను తీసుకొని ఈ పేపర్ ని ముఖంపై మొత్తం పెట్టుకోవాలి. తర్వాత చేతితో అలవేరా జెల్ వేసుకొని ముఖాన్ని ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా మసాజ్ చేసుకోవాలి.

Beauty Tips in Silver Facial or Gold Facial

Beauty Tips in Silver Facial or Gold Facial

తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే మీ ముఖం కాంతివంతంగా మారుతుంది. మీ ముఖం తెల్లగా తయారవ్వాలంటే సిల్వర్ పేపర్ ను వినియోగించాలి. గోల్డెన్ గ్లో కావాలనుకుంటే గోల్డ్ కలర్ పేపర్ను వినియోగించాల్సి ఉంటుంది. పార్లర్కి వెళ్లి వేల వేల ఖర్చు చేసే వాళ్లు సిల్వర్ ఫేషియల్ లేదా గోల్డ్ ఫేషియల్ రెండు రోజులు మాత్రమే ఉంటుంది. అదే ఈ ఐదు రూపాయల తో మనం ఇంట్లో చేసుకునే ఫేషియల్ ఈ విధంగా వేసుకున్నట్లయితే ఎక్కువ రోజులు ఉంటుంది. అలాగే ఏదైనా ఫంక్షన్ కి పార్టీకి వెళ్లాలన్న క్షణాల్లో దీన్ని వేసుకోవచ్చు. ఎటువంటి ఖర్చు ఉండదు. దీంతో మీ ముఖం అందంగా కాంతివంతంగా మెరిసిపోతూ ఉంటుంది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది