Beauty Tips : ప్రకాశవంతమైన చర్మం కోసం ఈ పండుతో నాచురల్ ఫేస్ ప్యాక్… అందమైన ముఖం మీ సొంతం…?
ప్రధానాంశాలు:
Beauty Tips : ప్రకాశవంతమైన చర్మం కోసం ఈ పండుతో నాచురల్ ఫేస్ ప్యాక్... అందమైన ముఖం మీ సొంతం...?
Beauty Tips : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎన్నో రకాల ఫేస్ ప్యాక్ లను ఉపయోగిస్తున్నారు. ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని కోరుకుంటారు. అందంగా లేనివారు అందంగా కనపడాలని ఎన్నో రకాల బ్యూటీ టిప్స్ ని ఫాలో అవుతారు. అందంగా ఉన్నవారు, మరింత అందంగా ఉండడానికి ఇంకెన్నో టిప్స్ ని వాడుతుంటారు. అయితే కొన్ని పండ్లతో ఫేస్ ప్యాక్ లను వేసుకుంటారు. అటువంటి పండ్లతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ దానిమ్మ పండు. దానిమ్మ పండు చర్మ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ దానిమ్మ కాయ తొక్కతో ముఖానికి స్క్రబ్ మాస్క్ తయారు చేస్తారు. దీనివల్ల నల్లటి మచ్చలు తగ్గిపోతాయి. అంతే కాదు, చర్మం మిల మిల మెరిసేలా చేస్తుంది. ఈ దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటుంది. ఈ విటమిన్ సి చర్మానికి సహజ కాంతిని ఇస్తుంది. విటమిన్ సి చర్మానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సహజ స్క్రబ్బు చర్మాన్ని తేమతో నింపి, మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.దానిమ్మ పండును తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో.. అలాగే, దానిమ్మ తొక్కని చర్మానికి స్క్రబ్ గా వాడితే కూడా అంతే ప్రయోజనాలు కలుగుతాయి.

Beauty Tips : ప్రకాశవంతమైన చర్మం కోసం ఈ పండుతో నాచురల్ ఫేస్ ప్యాక్… అందమైన ముఖం మీ సొంతం…?
దానిమ్మలో సహజంగానే ఔషధ గుణాలు నిండి ఉంటాయి. కావున సహజమైన కాంతిని ముఖానికి అందిస్తుంది, అంతేకాదు చర్మానికి కూడా దానిమ్మ పండు, తొక్క బెరడు, పువ్వు వంటి అన్ని భాగాలలోనూ పౌష్టికతతో పాటు ఔషధ విలువలు కూడా ఉన్నాయి. సరిగ్గా దీనిని వాడితే గనక చర్మం మెరిసిపోయి నల్ల మచ్చలు తొలగిపోతాయి.ముఖంపై మొటిమలు వల్ల వచ్చే నల్ల మచ్చలు ముఖ అందాన్ని పాడు చేస్తుంది. ముఖం అందాన్ని కోల్పోతుంది. అందంగా ఉండాలి అంటే, దానిమ్మ తొక్కతో తయారు చేసిన స్క్రబ్ వాడటం ద్వారా, చర్మంపై ఉండే నల్ల మచ్చలను తగ్గించుకోవచ్చు. చర్మం లో మలినాలు బయటకు తీయటానికి కూడా సహాయపడుతుంది. నల్ల మచ్చలు, తెల్ల మచ్చలు తగ్గటం, ముఖం మరింత శుభ్రంగా, మరింత కాంతివంతంగా మారుతుంది.దానిమ్మ తొక్కతో తయారు చేసిన స్క్రబ్ ముఖంపై అప్లై చేస్తే చర్మం పై ఉన్న చనిపోయిన కణాలు తొలగిపోతాయి. ముఖం చర్మం నివారింపును కోల్పోయినట్లయితే ఈ చనిపోయిన కణాలు ఎక్కువగా ఉన్నాయి అని అర్థం. వీటిని సరిగ్గా తొలగిస్తే చర్మం కొత్తదనంతో మెరుస్తుంది. కావున దానిమ్మ తొక్కను సక్రమంగా వాడితే చర్మం మృదువుగా, మెరిసేలా చేస్తుంది.
Beauty Tips దానిమ్మ స్క్రబ్ ఎలా తయారు చేయాలి
దానిమ్మ పండు తొక్కను సాయంత్రం ఎండలో బాగా ఆరబెట్టాలి, దానిమ్మ పొట్టు ని మెత్తగా పొడి చేయాలి. పొడిని వాడటమే ముఖానికి మంచి ఫలితాలను కలుగజేస్తుంది. మీరు సురక్షితంగా నిల్వ చేసుకోవచ్చు, ఇంకా అవసరానికి తగ్గట్లు వాడుకోవచ్చు.ఈ దానిమ్మ పొడిని తీసుకొని ఒక స్పూన్ చక్కెర ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ అవకాడో నూనె కలపాలి. ఈ మూడిటినీ కలిపినప్పుడు మంచి స్క్రబ్ తయారవుతుంది. మిశ్రమం పేస్టులా తయారు చేసుకోవాలి. దీన్ని ముఖంపై అప్లై చేస్తే చర్మం కాంతివంతంగా తయారవుతుంది.స్క్రబ్ని వాడేటప్పుడు ముందుగా ముఖాన్ని స్వచ్ఛంగా కడిగి ఆ తరువాత స్క్రబ్ నువ్వు ముఖంపై బాగా అప్లై చేయాలి. చేతులతో ముఖంపై మసాజ్ చేస్తూ చర్మం లోకి సాఫీగా చొరగొట్టాలి. మసాజ్ చేసిన తర్వాత 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి నీటితో బాగా కడగాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా కాంతివంతంగా తయారవుతుంది.ఈ దానిమ్మలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి,చర్మం కోసం ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. చర్మానికి ఏ జీవాన్ని అందిస్తూ వృద్ధాప్య ఛాయాలను తగ్గిస్తుంది. ఒకసారి మీరు ముఖానికి స్క్రబ్ మీ వాడినట్లయితే చర్మం కాంతివంతంగా మారడాన్ని మీరు గమనించవచ్చు. దానిమ్మతో తయారైన ఈ స్క్రబ్ సహజమైనది. నాచురల్ స్క్రబ్. దీనివలన దురద, అలర్జీలు లాంటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది న్యాచురల్ బ్యూటీ టిప్.