Sleep : నిద్ర పోయే ముందర ఇదొక్కటీ చేయండి చక్కగా నిద్ర పడుతుంది !
Sleep : ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ కారణంగా చాలామంది కంటి నిండా నిద్ర కూడా పోవడం లేదు. దీని కారణంగా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే సుఖమైన నిద్రకు కొన్ని పద్ధతులు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రశాంతమైన నిద్రకు కొన్ని భంగిమలు దోహదపడతాయి. కొన్నిసార్లు మానసికంగా ప్రశాంతంగా ఉన్నా సరే నిద్ర పట్టదు దీనికి కారణం సరైన భంగిమలో నిద్ర పోకపోవడం అని అంటున్నారు. నిద్రపోయేటప్పుడు సరైన భంగిమలి అనుసరించడం ద్వారా కంటినిండా సరిపడా నిద్ర వస్తుందని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా రాత్రిపూట నిద్ర సరిగా ఉంటే ఆరోగ్యానికి మంచిది.
పడుకునేటప్పుడు ఎడమవైపు తిరిగి నిద్రించడం ద్వారా జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. వ్యర్ధాలన్నీ కిందికి చేరుతాయి. పెద్ద ప్రగు ఖాళీ కావడంతో ఇతర సమస్యలు ఉత్పన్నం కాకుండా చేసేందుకు ఈ భంగిమ దోహదపడుతుంది. ఇటీవల గుండె జబ్బులు బాగా వస్తున్నాయి. గుండె బాగుండాలంటే ఎడమవైపు పడుకోవాలి. ఎందుకంటే ఎడమ వైపుకు గుండె ఉంటుంది. గురుత్వాకర్షణతో రక్త ప్రసరణ బిజీగా జరుగుతుంది. గుండె పై ఒత్తిడి పడకుండా ఉంటుంది. అలాగే గర్భిణీలు ఎడమవైపు పడుకోవడం వలన మేలు జరుగుతుంది.
ఎడమ వైపు పడుకోవడం వలన సౌకర్యంగా ఉంటుంది. గర్భిణీ కడుపులో ఉండే బిడ్డ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నిద్ర భంగం కూడా కలగదు. ఇలా పడుకోవడం వలన వెన్నెముక, నడుము పై ఒత్తిడి తగ్గుతుంది. రక్తప్రసరణ బాగుంటుంది. బిడ్డకు పోషకాలు అందుతాయి. కొన్నిసార్లు ఆహారం రుచిగా ఉంది కదా అని ఎక్కువగా లాగేస్తుంటారు దీంతో ఆయాసం లాగా అనిపిస్తుంది. ఈ టైంలో ఎడమవైపు పడుకోవడం వలన ఆ సమస్య అనేది పోతుంది. అలాగే అధిక బరువు, సైనస్ ఉన్నవాళ్లు కుడి ఎడమవైపు పడుకుంటే మంచిది. అలాగే పాలిచ్చే తల్లులు బిడ్డను మీద పడుకోబెట్టి పాలు అస్సలు ఇవ్వకూడదు. ఇది బిడ్డకు హాని కలుగజేస్తుంది. పక్కకు పడుకోబెట్టి పాలు ఇవ్వడం వలన ముక్కులోకి పాలు పోకుండా ఉంటాయి.