Belly Fat : ఈ జ్యూస్ లతో బెల్లీ ఫ్యాట్ కి చెక్ పెట్టవచ్చు…!!
Belly Fat : ప్రస్తుతం చాలామంది బెల్లీ ఫ్యాట్ తో సతమతమవుతూ ఉన్నారు. ఈ బెల్లీ ఫ్యాట్ అనేది ఆడ, మగ తేడా లేకుండా అందరిలోనూ కనిపిస్తుంది.. ఈ సమస్య మనదేశంలో రోజురోజుకి ఎక్కువ అవుతుంది. ఈ అధిక బరువు సమస్యతో ఎంతోమంది బాధపడడం మనం చూస్తూనే ఉన్నాం.. శారిక శ్రమ లేకపోవడం సరైన ఆహార నియమాలను పాటించకపోవడం హార్మోన్లు ఒత్తిడి జీవనశైలిలో కొన్ని విధాల మార్పులు జన్యుపరమైన కారణాల వలన చాలామంది ఈ బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతున్నారు.. ఇంకా ఆహారం అలవాట్ల వలన ఈ బెల్లీ ఫ్యాట్ వస్తుందని అధ్యాయనాలు చెబుతున్నాయి. ఇప్పుడున్న కాలంలో సౌకర్యాలు పెరిగాయి. శారీరక శ్రమ తగ్గిపోయింది. వ్యాయామం చేసే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోయింది. కేలరీలు కరిగించడమే కూడా తగ్గింది.
పండ్లు తాజా కూరగాయలకు బదులుగా ప్రాసెస్ చేసిన స్వీట్స్, కూల్డ్రింక్స్, ఆహారం అధికంగా అలవాటు పడుతున్నారు. వీటి వలన ఒళ్ళు పెంచేస్తున్నారు. అధిక బరువు పెరిగిపోతుంది. అలాగే డయాబెటిస్ గుండె సమస్యలు ఎముకలు గుల్ల బారడం హైపర్ టెన్షన్ లాంటి సమస్యలు ప్రమాదంగా మారుతున్నాయి. బరువును తగ్గించడానికి వెయిట్ లాస్ మిషన్లు, క్రాస్ స్టైట్లు, ఆశ్రయిస్తున్నారు. వీటి మూలంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి. అయితే మీరు తీసుకునే ఆహారంతోనే ఈజీగా బరువు తగ్గవచ్చు. ఇది శరీరానికి తగిన పోషకాలను అందిస్తుంది.కొన్ని రకాల జ్యూస్ లు తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తొందరగా కరిగిపోతుందని ప్రధానంగా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు.
అయితే ఈ జ్యూస్ లను ఉదయం పూట త్రాగితే మంచి ఫలితం పొందవచ్చు.. ఆ జ్యూస్ లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సొరకాయ జ్యూస్ : ఈ సొరకాయలో జింక్, విటమిన్ సి, బి మెగ్నీషియం, మాంగనీస్ లాంటి పోషకాలు అధికంగా ఉంటాయి. శరీరానికి హాని చేసే కొవ్వు దీనిలో ఉండదు. బరువు తగ్గాలనుకునే వాళ్ళు సొరకాయ జ్యూస్ చాలా మంచిది. దీనిలో ఉండే పీచు జీర్ణవ్యవస్థకు మంచి చేస్తుంది. సొరకాయ జ్యూస్ ఆకలిని తగ్గిస్తుంది. మెట్టబలిజంను మెరుగుపరుస్తుంది. ఇక ఈ దీంతో బరువు తగ్గడం తేలికవుతుంది. శరీరంలోని క్యాలరీలను ఎంతో సింపుల్గా తగ్గిస్తుంది. క్యారెట్ జ్యూస్ : క్యారెట్ జ్యూస్లో పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది మీ రోజువారికి అవసరమైన పోషకాలను శరీరానికి అందించడంలో ఉపయోగపడుతుంది. దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ క్రియ కు ఉపయోగపడుతుంది.
అలాగే బరువు తగ్గడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ జ్యూస్ ను ఆరు వారాలు పాటు తీసుకోవడం వలన బరువు తగ్గొచ్చని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. బీట్రూట్ జ్యూస్ : బీట్రూట్ జ్యూస్ ప్రభావంతంగా పనిచేస్తుంది. బీట్రూట్ పోషకాలు పవర్ హస్. దీనిలో విటమిన్ b6, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్, ఐరన్ పాస్ఫరస్ లాంటి పోషకాలు అధికంగా ఉంటాయి. బీట్రూట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది పేగుల్లో చెడు బ్యాక్టీరియా తగ్గించి ఆరోగ్యం కరమైన జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. భోజనం తర్వాత ఒక గ్లాసు బీట్రూట్ జ్యూస్ తీసుకుంటే మీ బరువు కంట్రోల్ లో ఉంటుంది. క్యాబేజీ జ్యూస్ : క్యాబేజీ జ్యూస్ తీసుకోవడం వలన కడుపుబ్బరం అజీర్ణం లాంటి ఎన్నో కడుపు సమస్యల నుంచి బయటపడవచ్చు.
ఇది మీ జీర్ణవ్యస్త ను శుభ్రపరచడంతో పాటు బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. రోజు క్యాబేజీ జ్యూస్ తాగితే శరీరంలో చెడు కొలెస్ట్రాల కూడా కరుగుతుంది. క్యాబేజీలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కావున చాలా సేపటి వరకు కడుపు నిండిన అనుభూతు ఉంటుంది. అధికంగా తినకుండా ఉంటారు. క్యాబేజీలో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి.. పాలకూర జ్యూస్ : పాలకూర మన ఆహారంలో చేర్చుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పాలకూరలో మెగ్నీషియం, ఐరన్, విటమిన్ ఏ,సీ , కాల్షియం పుష్కలంగా ఉంటాయి. దీనిని నిత్యం తీసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. దీనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది..