Fat | పొట్ట చుట్టూ కొవ్వు కరిగించడంలో అద్భుతాలు చేసే మెంతి నీరు, అల్లం నీరు.. ఏది బెటర్?
Fat | బరువు తగ్గడానికి ఎప్పుడూ కష్టమైన వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు. సరైన పానీయాలు తీసుకుంటే కూడా అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. నిద్రలేవగానే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగడం చాలామందికి అలవాటే. కానీ వీటితో పాటు మెంతి నీరు, అల్లం నీరు కూడా శరీరంలో కొవ్వును వేగంగా కరిగించడంలో కీలకపాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
రాత్రంతా నానబెట్టిన మెంతులు లేదా అల్లం ముక్కలను ఉదయం నీటిలో మరిగించి తాగితే శరీరంలో అనేక మార్పులు గమనించవచ్చు. అయితే ఈ రెండింటిలో ఏది బరువు తగ్గించడంలో ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుందో చూద్దాం.
#image_title
మెంతి నీరు ప్రయోజనాలు
మెంతులు వంటకాలకు రుచిని మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి. రాత్రంతా నీటిలో నానబెట్టిన మెంతులను మరుసటి రోజు ఉదయం తాగడం ద్వారా జీవక్రియ వేగవంతమవుతుంది.
ఇందులో గెలాక్టోమన్నన్ అనే పదార్థం ఉంటుంది, ఇది ఆకలి నియంత్రణలో సహాయపడుతుంది.
ఉబ్బరం, అజీర్ణం, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
బరువు తగ్గించడమే కాకుండా కడుపులో గ్యాస్, అపానవాయువు వంటి సమస్యలను కూడా నివారిస్తుంది.
అల్లం నీరు ప్రయోజనాలు
అల్లం నీరు ఔషధ గుణాలతో నిండిన సహజ పానీయం. ఉదయాన్నే తాగితే శరీరంలోని టాక్సిన్లు బయటకు పంపి, కొవ్వును వేగంగా కరిగిస్తుంది.
కేలరీలను బర్న్ చేయడంలో, ఆకలి నియంత్రణలో సహాయపడుతుంది.
రక్తపోటును నియంత్రిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
జీర్ణక్రియను మెరుగుపరచి, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
ఏది ఎంచుకోవాలి?
మీరు జీవక్రియను పెంచి, వేగంగా కొవ్వును కరిగించాలనుకుంటే అల్లం నీరు ఉత్తమం.
రక్తంలో చక్కెర స్థాయిలు మరియు జీర్ణక్రియను నియంత్రించాలనుకుంటే మెంతి నీరు సరైన ఎంపిక.
అయితే ఈ పానీయాలను మొదటిసారి ప్రయత్నించే వారు తక్కువ పరిమాణంలో ప్రారంభించడం మంచిది. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో వీటిలో ఏదో ఒకటి తాగితే కొద్ది రోజుల్లోనే తేడా గమనించవచ్చు.