నిమ్మకాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ఒక అద్భుతమైన ఔషద గుణాలు ఉన్నాయి. నిమ్మకాయలో విటమిన్ – C పుష్కలంగా ఉంటుంది. నిమ్మకాయను తరుచూ ఎక్కువగా తీసుకోవడం వలన మన శరీరానికి ఎంతో ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్లను అందించడమే కాకుండా విటమిన్ – C లోపం వలన వచ్చే స్కర్వీ వ్యాధిని రాకుండా చేస్తుంది. ఎండాకాలంలో నీరసం, అలసట, బీపీ ఉన్నవారికి, ఉప్పు కలిపిన నిమ్మకాయ జ్యూస్ ని తాగటం వలన శక్తి వస్తుంది. అదే నిమ్మకాయ జ్యూస్ లో కాసింత పంచదారను కలిపి తాగడం వలన శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఎండాకాలంలో చేసే వేడిని తగ్గిస్తుంది.
చర్మం, జుట్టు కోసం యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది . నిమ్మకాయ మన శరీరానికి ఒక యాంటీఆక్సిడెంట్ గా పనిచేసి జుట్టకి, చర్మానికి అనేక ప్రయోజనాలని కలిగిస్తుంది. ఆక్సికరణ నష్టాన్ని తగ్గిస్తుంది. వృద్ధాప్య చాయలను రానివ్వకుండా చేస్తుంది. మచ్చలు, మొటిమలు రాకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే జుట్టు కోసం కోల్లాజెన్ అనే ప్రోటీన్ ని పెరిగేలా చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
ఇమ్యునోమోడ్యులేటరీ చర్య కలిగి ఉన్న విటమిన్ – C ఉత్తమ వనరులలో నిమ్మకాయ ఒకటి. దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి ఉపసమనం కోసం నిమ్మకాయ ఎంతో సహకరిస్తుంది. అంటు వ్యాధుల నుంచి రక్షిస్తూ ఒక యాంటీబయటిక్ గా కూడా పనిచేస్తుంది. రక్త హీనత, గుండె, కాలేయం, ముత్‌తపిండాల కోసం యాంటీఆక్సిడెంట్ గా పని చేస్తుంది.
రక్తపోటుని, కొలెస్టరాల్ ని తగ్గించడమే కాకుండా ఆరోగ్యాన్ని పెంచుతుంది. కాలిన గాయాలను, మూత్రపిండాలలో రాళ్లను కూడా కరిగిస్తుంది. బరువు తగ్గుదల కోసం గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మకాయను వేసి కలుపుకొని తాగటం వలన శరీరంలో అనవసరమైన కొవ్వును కరిగిస్తుంది.
నిమ్మకాయ రసాన్ని నేరుగా చర్మంపైన రుద్ధడం వలన మంట చిరాకును కలిగిస్తుంది. కాబట్టి నిమ్మరసాన్ని చర్మంపై పూసే ముందు కొంత నీటితో కాని నూనెతో కాని నిమ్మరసాన్ని పలచన చేసి ఆ తరువాతే చర్మంపై రాసుకోవడం మంచిది.నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉండటం వలన దంతాలను కరిగించే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి నిమ్‌ురసం ఎల్లప్పుడు మితంగా తీసుకోండి.నిమ్మరసంలో ఆమ్లత శాతం ఎక్కువగా ఉండటం వల్ల (Acidity) గ్యాస్, అల్సర్ లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అయితే.. నిమ్మకాయ వల్ల తక్కువ నష్టాలు, ఎక్కువగా లాభాలు ఉన్నాయి.
Carrot Juice : చలికాలం రానే వచ్చేసింది. ఈ కాలంలో పండ్లు మరియు కూరగాయలు ఎక్కువగా దొరుకుతాయి. అలాగే మార్కెట్లో ఎటు…
Karthika Masam : కార్తీక మాసంలో ఉసిరి దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈ కార్తీక మాసం లో చాలామంది…
GAIL Recruitment : గెయిల్ ఇండియా లిమిటెడ్ సీనియర్ ఇంజనీర్ మరియు ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత…
Jupiter : వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తూ…
AUS vs IND : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) 2024-25 భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య…
BSNL : బీఎస్ఎన్ఎల్ నేషనల్ Wi-Fi రోమింగ్ సర్వీస్ను ప్రారంభించింది. BSNL యొక్క నేషనల్ వై-ఫై రోమింగ్ సర్వీస్ ఇప్పుడు…
నటీనటులు : వరుణ్ తేజ్ Varun Tej , మీనాక్షి చౌదరి Meenakshi Chaudhary, నోరా ఫతేహి Nora Fatehi…
Ycp : ఏపీలో కూటమి పార్టీ అధికారంలోకి రావడం మనం చూశాం. మూడు పార్టీలు కలిసి పోటీ చేయడంతో మంచి…
This website uses cookies.