నిమ్మ‌కాయను మితంగా తీసుకుంటేనే ఆరోగ్యం.. అమితంగా తీసుకుంటే ఏమౌతుందో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

నిమ్మ‌కాయను మితంగా తీసుకుంటేనే ఆరోగ్యం.. అమితంగా తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?

 Authored By aruna | The Telugu News | Updated on :22 May 2021,10:30 am

నిమ్మ‌కాయ‌లో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలతో కూడిన ఒక అద్భుతమైన ఔష‌ద గుణాలు ఉన్నాయి. నిమ్మ‌కాయ‌లో విట‌మిన్ – C పుష్క‌లంగా ఉంటుంది. నిమ్మ‌కాయను త‌రుచూ ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల‌న మ‌న శ‌రీరానికి ఎంతో ముఖ్య‌మైన యాంటీఆక్సిడెంట్ల‌ను అందించడమే కాకుండా విట‌మిన్ – C లోపం వ‌ల‌న వచ్చే స్క‌ర్వీ వ్యాధిని రాకుండా చేస్తుంది. ఎండాకాలంలో నీర‌సం, అల‌స‌ట, బీపీ ఉన్న‌వారికి, ఉప్పు క‌లిపిన‌ నిమ్మ‌కాయ జ్యూస్ ని తాగ‌టం వ‌ల‌న శ‌క్తి వ‌స్తుంది. అదే నిమ్మ‌కాయ జ్యూస్ లో కాసింత పంచదారను క‌లిపి తాగ‌డం వ‌ల‌న శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఎండాకాలంలో చేసే వేడిని త‌గ్గిస్తుంది.
చ‌ర్మం, జుట్టు కోసం యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది . నిమ్మ‌కాయ మ‌న శ‌రీరానికి ఒక యాంటీఆక్సిడెంట్ గా ప‌నిచేసి జుట్ట‌కి, చ‌ర్మానికి అనేక ప్ర‌యోజ‌నాల‌ని క‌లిగిస్తుంది. ఆక్సిక‌ర‌ణ న‌ష్టాన్ని త‌గ్గిస్తుంది. వృద్ధాప్య చాయ‌ల‌ను రానివ్వకుండా చేస్తుంది. మ‌చ్చ‌లు, మొటిమలు రాకుండా చేయ‌డానికి ఉప‌యోగప‌డుతుంది. అలాగే జుట్టు కోసం కోల్లాజెన్ అనే ప్రోటీన్ ని పెరిగేలా చేసి జుట్టు రాల‌డాన్ని త‌గ్గిస్తుంది.

రోగ‌నిరోధ‌క శ‌క్తి కోసం

ఇమ్యునోమోడ్యులేట‌రీ చ‌ర్య క‌లిగి ఉన్న విట‌మిన్ – C ఉత్త‌మ వ‌న‌రుల‌లో నిమ్మ‌కాయ ఒక‌టి. ద‌గ్గు, జ‌లుబు వంటి స‌మ‌స్య‌ల నుంచి ఉప‌స‌మ‌నం కోసం నిమ్మ‌కాయ ఎంతో స‌హక‌రిస్తుంది. అంటు వ్యాధుల నుంచి రక్షిస్తూ ఒక యాంటీబ‌య‌టిక్ గా కూడా ప‌నిచేస్తుంది. ర‌క్త‌ హీన‌త, గుండె, కాలేయం, ముత్‌తపిండాల కోసం యాంటీఆక్సిడెంట్ గా ప‌ని చేస్తుంది.

Benefits and side Effects Of Lemon in Telugu

Benefits and side Effects Of Lemon in Telugu

ర‌క్త‌పోటుని, కొలెస్టరాల్ ని త‌గ్గించ‌డ‌మే కాకుండా ఆరోగ్యాన్ని పెంచుతుంది. కాలిన గాయాల‌ను, మూత్రపిండాలలో రాళ్లను కూడా క‌రిగిస్తుంది.  బ‌రువు త‌గ్గుద‌ల కోసం గోరువెచ్చ‌ని నీటిలో తేనె, నిమ్మ‌కాయ‌ను వేసి క‌లుపుకొని తాగ‌టం వ‌ల‌న శ‌రీరంలో అన‌వ‌స‌ర‌మైన కొవ్వును కరిగిస్తుంది.

నిమ్మ‌కాయ వ‌ల్ల కలిగే చెడు ప్రయోజనాలు

నిమ్మ‌కాయ ర‌సాన్ని నేరుగా చ‌ర్మంపైన రుద్ధ‌డం వ‌ల‌న మంట చిరాకును క‌లిగిస్తుంది. కాబ‌ట్టి నిమ్మ‌ర‌సాన్ని చ‌ర్మంపై పూసే ముందు కొంత నీటితో కాని నూనెతో కాని నిమ్మ‌ర‌సాన్ని ప‌లచ‌న చేసి ఆ త‌రువాతే చ‌ర్మంపై రాసుకోవ‌డం మంచిది.నిమ్మ‌కాయ‌లో సిట్రిక్ యాసిడ్ ఉండ‌టం వ‌ల‌న దంతాలను క‌రిగించే ప్ర‌భావాన్ని క‌లిగి ఉంటుంది. కాబ‌ట్టి నిమ్‌ుర‌సం ఎల్ల‌ప్పుడు మితంగా తీసుకోండి.నిమ్మ‌ర‌సంలో ఆమ్లత శాతం ఎక్కువగా ఉండటం వల్ల (Acidity) గ్యాస్, అల్స‌ర్ లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అయితే.. నిమ్మకాయ వల్ల త‌క్కువ న‌ష్టాలు, ఎక్కువగా లాభాలు ఉన్నాయి.

Tags :

    aruna

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది