Conch Shell : మీ ఇంట్లో శంఖం ఉందా? అయితే.. మీరు ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే?
Conch Shell : చాలామంది తమ ఇళ్లలో శంఖాన్ని పెట్టుకుంటారు. శంఖం ఉంటే ఇంట్లో శుభం కలుగుతుందని చాలామంది నమ్మకం. చాలామంది పూజల్లో కూడా శంఖాన్ని ఊదుతుంటారు. శంఖం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చాలామంది చెబుతుంటారు. అసలు.. శంఖాన్ని ఇంట్లలో పెట్టుకోవచ్చా.. ఇంట్లో పెట్టుకుంటే ఏమౌతుంది.. అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి.
శంఖానికి సనాతన సంప్రదాయంలో చాలా విశిష్టత ఉంది. శంఖం అంటేనే పవిత్రతకు మారుపేరు. శంఖాన్ని పూజించినా.. దేవుడిని పూజించినట్టే. శంఖం ఇంట్లో ఉంటే సాక్షాత్తూ ఆ లక్ష్మీదేవినే ఇంట్లో ఉన్నట్టు భావిస్తారు.శంఖం పాపాలను నాశనం చేస్తుంది. దీర్ఘాయిష్షును ప్రసాదిస్తుంది. అలాగే.. రోజూ శంఖాన్ని ఊదడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. శంఖం ఊదడం వల్ల ఊపిరితిత్తులు క్లీన్ అయి ధృఢంగా మారుతాయి. శ్వాస సంబంధ సమస్యలు దూరం అవుతాయి.
Conch Shell : శంఖం ఇంట్లో ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు
శంఖం ఇంట్లో ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. సిరిసంపదలు వస్తాయి. శంఖంలో నీటి నిలువ చేసి తాగితే కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా శంఖం అనేది పాజిటివ్ ఎనర్జీకి సంబంధించింది. అది ఇంట్లో ఉంటే నెగెటివ్ ఎనర్జీ ఇంట్లో నుంచి పారిపోతుంది. ఇంట్లో ఉన్నవాళ్లు పాజిటివ్ గా ఉంటారు. అందుకే.. చాలామంది ఇంట్లో శంఖాన్ని పెట్టుకుంటారు. మీరు కూడా వీలైతే ఇంట్లో శంఖాన్ని పెట్టుకోండి. ఆరోగ్యంగా చల్లగా ఉండండి.