Side Effects : పెరుగుతున్న తర్వాత ఈ 7 పదార్థాలను పొరపాటున తిన్నారంటే… డేంజర్ లో పడక తప్పదు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Side Effects : పెరుగుతున్న తర్వాత ఈ 7 పదార్థాలను పొరపాటున తిన్నారంటే… డేంజర్ లో పడక తప్పదు…!

 Authored By jyothi | The Telugu News | Updated on :30 December 2023,10:00 am

ప్రధానాంశాలు:

  •  Side Effects : పెరుగుతున్న తర్వాత ఈ 7 పదార్థాలను పొరపాటున తిన్నారంటే... డేంజర్ లో పడక తప్పదు...!

Side Effects : పెరుగు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. పెరుగుఅన్నం తినకపోతే భోజనం కంప్లీట్ చేసినట్లు అనిపించదు.. ఈ పెరుగు ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ పెరుగుతో ఈ ఏడు పదార్థాలు కలిపి తింటే డేంజర్ లో పడక తప్పదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం…పెరుగు అందానికి దివ్య ఔషధంగా ఉపయోగపడుతుంది. మనం అనేక విధాలుగా పెరుగును ఆహారంలో చేర్చుకుంటాం. నేరుగా పెరుగుని అన్నట్లు కలుపుకొని తినడం కావచ్చు.. ఒక గ్లాసు మజ్జిగ రూపంలో కావచ్చు.. లస్సిగా కావచ్చు.. రైతగా కావచ్చు.. మజ్జిగ చారుగా అయినా కావచ్చు.. ఎలా అయినా తినొచ్చు. పెరుగుతో చేసే అనేక రెసిపీలు మనకు అందుబాటులో ఉన్నాయి. రోజు ఒక గిన్నె పెరుగు తీసుకోవడం వల్ల అది మనల్ని హైడ్రైట్ గా ఉంచడమే కాకుండా మన ఎనర్జీ లెవెల్స్ ని కూడా పెంచుతుంది. అయితే పెరుగు రాత్రులు మాత్రం తినకూడదని అంశంపై విన్నవాదములు ఉన్నాయి. రాత్రిపూట పెరుగు తీసుకోవడం వల్ల కొంతమందికి అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు అని చెబుతున్నారు. పెరుగు రాత్రి తింటే జలుబు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. మీరు దగ్గు లేదా జలుబుతో బాధపడుతుంటే రాత్రి వేళలో పెరుగు అస్సలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట పెరుగు తినడం వల్ల గొంతులో కఫం ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు.

Side Effects : పెరుగు తిన్న తర్వాత తినకూడని పదార్థాలు

ఉల్లిపాయ :  పెరుగు ఉల్లిపాయ కాంబినేషన్ వేసవి రోజుల్లో తినడానికి చాలామంది ఇష్టపడతారు. ఉల్లిపాయ వేడి చేస్తుంది. పెరిగేమో చల్లగా ఉంటుంది. వీటిని కలిపి తింటే ఎనర్జీలు గ్యాస్ వల్ల వాంతులు వస్తాయి. ఈ రెండింటిని ఎప్పుడు తినకూడదు.

మసాలా కూరలు: మసాలాలు మీ శరీరంలో వేడిని పెంచుతాయి. మరియు,పెరుగు చల్లదనాన్ని పెంచుతాయి. పెరుగు యొక్క ప్రభావం దానిని ఎదుర్కోవడానికి సరిపడకపోవచ్చు. ఇది యాసిడిటీ లేదా గుండెల్లో మంటను కలిగిస్తుంది.

చేపలు: చేపలుకొన్ని ప్రోటీన్లను కలిగి ఉంటాయి. అవి పెరుగుతో కలిసినప్పుడు జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. సరైన జీరణ క్రియా మరియు పోషకాల షోసణను నిర్ధారించడానికి ఈ రెండింటిని విడివిడిగా తీసుకోవడం మంచిది.

పాలు: పెరుగు మరియు పాలు పెరుగు మరియు పాలు రెండు పాల ఉత్పత్తిని వాటిని కలిపి తీసుకోవడం వల్ల కొంతమందికి కడుపులో భారం మరియు అజీర్ణం కలగవచ్చు.

పుచ్చకాయలు, అరటిపండ్లు: పుచ్చకాయలు మరియు అరటి పండ్లు ఉన్నాయి కదా. ఈ పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. పెరుగులో చేరిన ఎంజైములను పలుచన చేస్తాయి. ఇవి నెమ్మదిగా జీర్ణక్రియకు దారితీస్తాయి. ఈ పండ్లను పెరుగుతో కలిపి అస్సలు తినకండి. ఎందుకంటే జీర్ణ సమస్యలు వస్తాయి.

మామిడిపండు: అలాగే పెరుగు మామిడికాయ అనేది కలిపి తింటూ ఉంటారు. చాలామంది పెరుగుతో పాటు మామిడి పండ్లను తినకూడదు. ఎలర్జీలు చర్మ సమస్యలు తలెత్తవచ్చు.

ఆయిల్ పదార్థాలు: అలాగే పెరుగు నూనె పదార్థాలు పెరుగు తిన్న వెంటనే నూనెలో వేయించిన ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు. ఒకవేళ తీసుకుంటే అజీర్తి సమస్యలు వస్తాయి. పెరుగు మినప్పప్పు, పెరుగు తిన్న వెంటనే మినపప్పుతో చేసే వంటకాలు తినకండి. దీనివల్ల జీర్ణక్రియ మందగించి బద్ధకం పెరుగుతుంది. ఏదేమైనా పెరుగుని పెరుగులాగే మీరు తీసుకోవాలి. అది కూడా మధ్యాహ్నం వేళలో తీసుకుంటేనే మంచిది. ఒకవేళ రాత్రిపూట తీసుకోవలసి వస్తే పెరుగు రూపంలో కాకుండా పల్చని మజ్జిగ రూపంలో తీసుకోవచ్చు…

Advertisement
WhatsApp Group Join Now

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది