Health Tips : నిమ్మ తొక్కలో ఉండే లాభాలు తెలిస్తే.. ఇంట్లోనే దాచుకుంటారు! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Tips : నిమ్మ తొక్కలో ఉండే లాభాలు తెలిస్తే.. ఇంట్లోనే దాచుకుంటారు!

Health Tips : ప్రస్తుత కాలంలో చాలా మంది అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. రోజూ బస్సులు, క్యాబ్ లు, ఎండలో తిరుగుతూ… ఒళ్లు హూనం చేసుకుంటున్నారు. దీని వల్ల మానసిక ఆరోగ్యం ఏమో కాని చర్మ ఆరోగ్యం మాత్రం చాలా వరకు చెడిపోతుంది. మొహంపై విపరీతమైన టాన్ ఏర్పడడం, నల్లగా మారడం వంటివి తరచుగా చూస్తుంటాం. కానీ చర్మ సౌందర్యం గురించి పట్టించుకునే వీలు మాత్రం ఉండదు. అలా అని బ్యూటా పార్లర్ల చుట్టూ తరిగేకంటే కేవలం […]

 Authored By pavan | The Telugu News | Updated on :3 May 2022,3:00 pm

Health Tips : ప్రస్తుత కాలంలో చాలా మంది అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. రోజూ బస్సులు, క్యాబ్ లు, ఎండలో తిరుగుతూ… ఒళ్లు హూనం చేసుకుంటున్నారు. దీని వల్ల మానసిక ఆరోగ్యం ఏమో కాని చర్మ ఆరోగ్యం మాత్రం చాలా వరకు చెడిపోతుంది. మొహంపై విపరీతమైన టాన్ ఏర్పడడం, నల్లగా మారడం వంటివి తరచుగా చూస్తుంటాం. కానీ చర్మ సౌందర్యం గురించి పట్టించుకునే వీలు మాత్రం ఉండదు. అలా అని బ్యూటా పార్లర్ల చుట్టూ తరిగేకంటే కేవలం ఐదు ఐదు నిమిషాల్లో సహహజ పద్ధతిలో మీ మొహన్ని తిరిగి అందంగా మార్చుకోండి. అయితే మనంని ప్రిజ్ లో ఉండే నిమ్మకాయలు, ముఖ్యంగా నిమ్మ చెక్కల పొడిని వాడుకోవచ్చు.నిమ్మ చెక్క పొడి చర్మ సంరక్షణను కాపాడుతుంది.

ఆల్ ఇన్ వన్ పౌడర్ గా పనిచేస్తూ… మొహంపై మొటిమలు రాకుండా టాన్ ని తొలగిస్తూ… తెల్లగా తయారు చేస్తుంది. పూర్తిగా సేంద్రీయ నిమ్మపొడి సహజమైన చర్మం తెల్లబడటం కోసం పని చేస్తుంది. నిమ్మకాయ తొక్కలలో విటామిన్ సి ఎక్కువగా ఉండడం, ఎక్స్ ఫోలేయేటింగ్ లక్షణాలతో రావడం వల్ల మార్పులు, మచ్చలను తొలగించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అత్యంత సహజమైన పద్ధతిలో చర్మానికి మేలు చేస్తుంది. ఇది చర్మ సంరక్షణలో అసంఖ్యాక ప్రయోజనాలను ఇస్తుంది. చర్మ ప్రక్షాళన, స్కిన్ పాలిషింగ్, స్కిన్ టోనింగ్, మాయిశ్చరైజింగ్ మరియు చర్మం యొక్క ఆదర్శ పోషణ మరియు పోషనను అందించడం నుంచి చర్మ ఆరోగ్యాన్ని ప్రధాన మార్గంలో చేర్చడానికి సాయపడుతుంది.

best skin whitening tip for face and skin itching lemon peel powder

best skin whitening tip for face and skin itching lemon peel powder

సహజమైన యాంటీ ఏజింగ్ పౌడర్ గా కూడా ఇది పనిచేస్తుంది. విటామిన్ సి కారణంగా యవ్వనంతో చర్మం మెరవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ప్రకాశవంతమైన రంగు కోసం నిమ్మ తొక్క పొడిని ఇలా తయారు చేసుకోవచ్చు.నిమ్మ పీల్ పౌడర్ ఫేస్ ప్యాక్ తయారీ.. ఒక గ్లాసు నీళ్ల గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మపై తొ్క, మరియు రెండు టేబుల్ స్పూన్ల వాటర్ తీసుకొని 2 నుంచి 3 చుక్కల నిమ్మరసం వేసి పేస్టు తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ మరియు ఇతర ప్రాంతాల్లో అప్లై చేసుకోవాలి. కనీసం 20 నుంచి 25 నిమిషాల పాటు ఆరేలా చేస్కోవాలి. అది ఎండిన తర్వాత ఉత్తమ ఫలితాల కోసం గోరువెచ్చని నీటితో కడిగేయాలి. నిమ్మ తొక్కలు ప్రభావంతో ఈ అద్భుతమైన ఫేస్ ప్యాక్ రోజంతా తాజా అనుభూతిని ఇస్తుంది.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది