Vegetable Drink : ఈ వెజిటేబుల్ నీటిని రోజుకు ఒక గ్లాస్ చాలు.. 7 రోజులలో మీ అధిక బరువుకి చెక్…!
ప్రధానాంశాలు:
Vegetable Drink : ఈ వెజిటేబుల్ నీటిని రోజుకు ఒక గ్లాస్ చాలు.. 7 రోజులలో మీ అధిక బరువుకి చెక్...!
Vegetable Drink : ప్రతిరోజు కూరగాయలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది. కూరగాయలలో బెండకాయలు శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయి. బెండకాయ చాలామంది ఇష్టపడి తింటుంటారు. దీంతో పులుసు, ఫ్రై, కూర ఇంకా ఎన్నో రకాలుగా చేసి తింటూ ఉంటారు. అయితే మీరు ఎప్పుడైనా బెండకాయ నీటిని తాగారా.? బెండకాయ నీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి. దీనిలో విటమిన్ సి విటమిన్ b6 ఫైబర్ ప్రోటీన్ పొటాషియం పొలేట్, మెగ్నీషియం లాంటి ఎన్నో పోషక గుణాలుంటాయి. ఇది అధిక రక్తపోటుని మధుమేహం జీర్ణ సంబంధిత వ్యాధుల్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. బెండకాయ నీటిని క్రమం తప్పకుండా తాగడం వలన గుండె ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.దీన్ని రోజు తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరుగుతుంది.
Vegetable Drink బెండకాయ నీటిని ఎలా తయారు చేయాలి
బెండకాయ నీటిని తయారు చేయడానికి ముందుగా ఒక అరు బెండకాయలను తీసుకొని వాటిని చివర్లు కత్తిరించండి. ఇప్పుడు ఆ బెండకాయల్ని రెండు కప్పుల నీటిలో నానబెట్టండి. ఇలా నైట్ అంతా అలాగే ఉంచాలి.మరుసటి రోజు ఉదయం బెండకాయలను నీళ్లలోంచి తీసివేయాలి. ఇప్పుడు ఈ నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఇలా బెండకాయ నీటిని ప్రతి రోజు తాగడం వల్ల బరువు తగ్గడానికి ఎంతగానో దూత పడుతుంది.
ఇది శరీరంలో కొవ్వును కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.బరువు తగ్గడానికి బెండకాయ నీరు ఎలా సహాయపడుతుంది.? బరువు తగ్గడానికి బెండకాయ నీరు చాలా సహాయకారిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది తక్కువ క్యాలరీల ఆహారం 100 గ్రాముల బెండకాయలలో సుమారు 30 క్యాలరీలు ఉంటాయి. అంతేకాదు దీనిలో ఫైబరు పుష్కలంగా ఉంటుంది. దీన్ని తిన్న తర్వాత ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. బెండకాయ వాటర్ తాగడం వల్ల తరచుగా తినాలని ఆహారపు అలవాట్లు తగ్గుతాయి. అలాగే ఇది జీవ క్రియను పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇది శరీరంలోని అదనపు కొవ్వును కరిగిస్తుంది. రోజు ఉదయం ఖాళీ కడుపుతో బెండకాయ నీటిని తాగడం వలన వేగంగా బరువు తగ్గుతారు.