Rythu Bharosa : రైతులకు శుభవార్త .. అందరికీ ఒకేసారి డబ్బులు .. ఈ సారి రైతు భరోసా నిధుల విడుదలలో కొత్త విధానం ..!

 Authored By sudheer | The Telugu News | Updated on :20 March 2026,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Rythu Bharosa : రైతులకు శుభవార్త .. అందరికీ ఒకేసారి డబ్బులు .. ఈ సారి రైతు భరోసా నిధుల విడుదలలో కొత్త విధానం ..!

Rythu Bharosa : తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రైతు భరోసా నిధుల పంపిణీ విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటివరకు అమలులో ఉన్న విడతల విధానానికి స్వస్తి పలుకుతూ ఈసారి కొత్త పద్ధతిలో నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. ఈ మార్పు వల్ల ముఖ్యంగా ఎక్కువ భూమి కలిగిన రైతులకు పెద్ద ఎత్తున లాభం చేకూరనుంది.

Rythu Bharosa funds for all farmers at once

Rythu Bharosa funds for all farmers at once

Rythu Bharosa : కొత్త విధానం .. తొలి విడతలోనే అందరికీ లబ్ధి

ఇప్పటి వరకు ప్రభుత్వం రైతు భరోసా నిధులను ఎకరం వారీగా విడతలుగా విడుదల చేసేది. చిన్న రైతులతో ప్రారంభించి, పెద్ద ఎత్తున భూమి ఉన్న రైతులకు చివర్లో నిధులు జమ చేసేది. ఈ విధానం కారణంగా చాలా మంది రైతులు పెట్టుబడి సాయం కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. అయితే తాజా నిర్ణయంతో ఈ సమస్యకు చెక్ పడనుంది. ఇక నుంచి తొలి విడతలోనే అన్ని అర్హులైన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ప్రతి రైతుకు మొదటి ఎకరానికి రూ.6,000 చొప్పున నేరుగా ఖాతాలో వేయబడుతుంది. ఉదాహరణకు ఐదు ఎకరాల భూమి ఉన్న రైతుకు మొదటి విడతలో ఒక ఎకరానికి రూ.6,000 అందుతుంది. మిగతా ఎకరాలకు సంబంధించిన సొమ్మును తర్వాతి విడతల్లో జమ చేస్తారు. ఈ విధానం ద్వారా ప్రతి రైతుకు ఒకేసారి కనీస సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

Rythu Bharosa : విడతల షెడ్యూల్ మరియు నిధుల విడుదల

ఈ నెల 22వ తేదీన నర్మెట్టలో జరిగే కార్యక్రమంలో రైతు భరోసా నిధులను అధికారికంగా విడుదల చేయనున్నారు. మొదటి విడతలో సుమారు 70 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.3,590 కోట్లు ఖర్చు చేయనుంది. మొదటి విడత జమ అయిన 20 రోజుల తర్వాత రెండో విడత నిధులు విడుదల చేస్తారు. అలాగే ఏప్రిల్ నెలాఖరులోగా మూడో విడత డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. ఈసారి మూడు విడతల్లోనే మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మార్పు వల్ల రైతులు సకాలంలో పెట్టుబడి సాయం పొందగలుగుతారు. ముఖ్యంగా విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడంలో ఇక ఆలస్యం ఉండదని అధికారులు భావిస్తున్నారు.

Rythu Bharosa : కొత్త దరఖాస్తులకు ఆహ్వానం

ఇక రైతు భరోసా పథకానికి సంబంధించి కొత్త దరఖాస్తులను కూడా ప్రభుత్వం స్వీకరిస్తోంది. ఈ నెల 25వ తేదీ లోగా అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఫిబ్రవరి 2026 నాటికి కొత్తగా పట్టాదారు పాస్‌బుక్ పొందిన రైతులు కూడా ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది. దరఖాస్తులు సమీప రైతు వేదికలు లేదా వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద అందుబాటులో ఉంటాయి. దరఖాస్తు చేసుకునే సమయంలో పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా పాస్‌బుక్, రైతు భరోసా అప్లికేషన్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. అలాగే భూమి ధరణి పోర్టల్‌లో నమోదు అయి ఉండాలి. వ్యవసాయానికి అనుకూలమైన భూమి ఉన్నవారికే ఈ పథకం వర్తిస్తుంది. ఈ కొత్త విధానం రైతులకు తక్షణ ఆర్థిక సాయం అందించేలా రూపుదిద్దుకుంది. దీంతో రైతులపై ఆర్థిక భారం తగ్గి, సాగు పనులు సమయానికి పూర్తి చేసే అవకాశం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

sudheer

Ramanujam Sudheer Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి