Uppal : బీఆర్ఎస్‌కు భారీ షాక్ .. కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on: March 20, 2026, 7:53 pm
  •  Uppal : బీఆర్ఎస్‌కు భారీ షాక్ .. కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు

Uppal : ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉప్పల్ డివిజన్ పరిధిలోని లక్ష్మీనారాయణ కాలనీలో బీఆర్ఎస్‌కు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామం స్థానిక రాజకీయ సమీకరణాల్లో కీలక మార్పులకు దారితీస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉప్పల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి సమక్షంలో భారీగా చేరికలు జరిగాయి.

Huge additions to the Congress in Uppal constituency

Uppal : బీఆర్ఎస్‌కు భారీ షాక్ .. కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు

ఈ సందర్భంగా పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కండువాలు కప్పి ఘనంగా ఆహ్వానించారు. కొత్తగా చేరిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై చేరుతున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ .. రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతోందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల పథకాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయని, అందువల్లనే ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ వైపు మళ్లుతున్నారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో లక్ష్మీనారాయణ కాలనీకి చెందిన పెద్దలు రాములు, సత్తయ్య, వెంకటయ్య, బిక్షపతి, సత్యనారాయణ, రఘుపతి రెడ్డి, అలాగే యువ నాయకులు ప్రశాంత్, నరేష్, జాకర్, లింగాచారి, భాస్కర్ రెడ్డి, లక్ష్మణ్, బొడ్డు రఘు తదితరులు పాల్గొన్నారు. ఈ చేరికలు భవిష్యత్తులో ఉప్పల్ రాజకీయ దృశ్యాన్ని మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "November Box Office : నవంబర్ మూడో వారం బాక్సాఫీస్ వద్ద రక్తపాతం.. క్రేజీ సినిమాల మధ్య బిగ్ ఫైట్ ఫిక్స్..!"

  2. "Prabhas Imanvi : ప్రభాస్ నుంచి ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీకి బర్త్‌డే సర్‌ప్రైజ్.. ఇన్ని రకాల వంటకాలా..!"

  3. "Jailer 2 Movie First Review : జైలర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!"

  4. "Ysrcp : ఉన్నదే 11 సీట్లు.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! వైసీపీ హైడ్రామాపై నెటిజన్ల సెటైర్లు.!"

  5. "AP Local Elections : మున్సిపల్ సీట్ల పంపకంలో కూటమి బిగ్ ట్విస్ట్.. నేడే తేల్చేయనున్న టీడీపీ-జనసేన-బీజేపీ..!"

  6. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  7. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp