Betel Leaf : భోజనం చేసిన తర్వాత తమలపాకులను తింటున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి..!
ప్రధానాంశాలు:
Betel Leaf : భోజనం చేసిన తర్వాత తమలపాకులను తింటున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి..!
Betel Leaf : తమలపాకు అంటే తెలియని వారు ఎవరు ఉండరు. తమలపాకులకి భారతీయులకు విడదీయరాని బంధం ఉంటుంది. శుభకార్యాలు అంటే తమలపాకు కచ్చితంగా ఉండి తీరాల్సిందే.. ఆధ్యాత్మిక విషయాల కోసం మన పెద్దవాళ్లు తమలపాకులను చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. తాంబూలం ఇచ్చే సమయంలో కానీ ఇతరులకు వాయనాలు ఇచ్చే సమయంలో గానీ ఇలా ఆధ్యాత్మిక పరంగా తమలపాకులను వాడుతూ ఉంటాం. అయితే ఈ తమలపాకుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అంటే తాంబూలం లాగా తమలపాకులు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు..చాలామంది భోజనం చేసిన తర్వాత తమలపాకులు తింటూ ఉంటారు. భోజనం చేసిన తర్వాత తమలపాకులు తింటే తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఈ తమలపాకులో క్యాల్షియం ఐరన్ మాంగనీస్ విటమిన్ అనేక పోషకాలు కూడా ఉన్నాయి.
ఈ తమలపాకు శరీర ఉష్ణోగ్రతను పెంచడానికి మెరుగుపరచడానికి కడుపు పేగుల్లో పీహెచ్ స్థాయిలను క్రమబద్ధీకరించడానికి ఉపయోగపడతాయి..కడుపునొప్పి నుండి కూడా త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. ఉదయాన్నే పరగడుపున తమలపాకులు తినడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. మీరు కడపు సమస్యలు ఉంటే ఖాళీ కడుపుతో తమలపాకు తింటే మంచిది. ప్రతి రోజు ఉదయాన్నే తమలపాకులు తినడం వల్ల పోషకాల్ లోపాలు దూరం చేసుకోవచ్చు.. చాతి ఊపిరితిత్తులు ఆస్తమాతో బాధపడే వారికి తమలపాకు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది.
తమలపాకులపై కొద్దిగా ఆవాల నూనె రాసి వేడి చేసి చాతిపై ఉంచితే గుండె నొప్పి సమస్యల నుంచి బయటపడవచ్చు.. అని చెప్తున్నారు నిపుణులు..తమలపాకుల్లో క్రిమినహాస గుణాలు ఉంటాయి. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తమలపాకులు తింటే ఎలాంటి ఇన్ఫెక్షన్లు, కీళ్ల నొప్పులతో బాధపడేవారుకి ఉపశమనం లభిస్తుంది. అలాగే రక్తంలో చక్కర స్థాయిలు తగ్గించు సామర్ధ్యాన్ని కూడా కలిగి ఉంటాయని ఇటీవల పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. తమలపాకు ఒక శక్తివంతమైన యాంటీబయోటిక్ లా ఉపయోగపడుతుంది. అలాగే రక్తంలో గ్లూకోస్ ను అదుపు చేయకపోవడం వల్ల కలిగే మంటను కూడా నివారిస్తుంది..