Eating Rice : మీరు భోజనం చేసిన వెంటనే ఇలాంటి పనులు చేశారో…. యమ డేంజర్ తెలుసా…?
ప్రధానాంశాలు:
Eating Rice : మీరు భోజనం చేసిన వెంటనే ఇలాంటి పనులు చేశారో.... యమ డేంజర్ తెలుసా...?
Eating Rice : మన పెద్దలు తిన్న తర్వాత ఈ పనులు చేయకూడదని చెబుతూనే ఉంటారు. కానీ వాటిని మనం అంతగా పట్టించుకొం. కానీ పెద్దలు చెప్పిన మాటల్లో చాలా సత్యం ఉంది. అలాగే నిపుణులు కూడా తిన్న తర్వాత ఇలాంటి పనులు అస్సలు చేయకూడదని చెబుతున్నారు. దీనివలన జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తడం జరుగుతుంది. భోజనం చేసిన తర్వాత ఇలాంటి పనులు చేస్తే ఎంత డేంజర్ నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం…

Eating Rice : మీరు భోజనం చేసిన వెంటనే ఇలాంటి పనులు చేశారో…. యమ డేంజర్ తెలుసా…?
Eating Rice భోజనంచేసిన వెంటనే ఈ పనులు చేస్తే
కొందరికీ భోజనం చేసిన వెంటనే పడుకోవాలనిపిస్తుంది. ఇంకా సోమరితనం కూడా ఎక్కువ గా ఉండి పడుకుంటారు. కానీ ఇలా చేయడం అస్సలు మంచిది కాదట. దీనివల్లన కడుపులోని ఆమ్లం, అన్నవాహికలోకి చేరుతుందట. దీంతో గుండెల్లో మంట,కడుపులో అసౌకర్యం వంటి సమస్యలు తలెత్తుతాయి. మరి ముఖ్యంగా గ్యాస్,ఉబ్బరం వంటి సమస్యలు కూడా వస్తాయి. అన్నం తిన్న తర్వాత వెంటనే పడుకోకూడదు. కొంతమందికి భోజనం చేసిన తరువాత ధూమపానం చేసే అలవాటు ఉంటుంది. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఇది శరీరానికి చాలా ఆహ్వాని కూడా కలుగుతుంది.ధూమపానం వలన తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం కాదు.దీని వలన మలబద్దక వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే, భోజనం చేసిన తర్వాత ధూమపానం అస్సలు చేయకూడదు. ఇంకా, కొందరు తిన్న వెంటనే వేగంగా నడుస్తూ ఉంటారు. కానీ ఇలా కూడా అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే అలాగే జీర్ణ వ్యవస్థకు ఆటంకం కలుగుతుంది.తిన్న వెంటనే వేగవంతమైన నడక అనేక ఇబ్బందులకు దారితీస్తుంది. అందుకే తిన్న తర్వాత 20 నిమిషాలు గడిచినా తరువాత నిదానంగా నడవాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
అందరూ భోజనం చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగేస్తారు. కానీ ఇది కూడా ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదట. తిన్న వెంటనే టీ లేదా కాఫీ తీసుకున్నట్లయితే,శరీరం ఖనిజాలను గ్రహించే సామర్ధ్యాన్ని కోల్పోతుంది.అలాగే దానికి కావాల్సిన ఖనిజాలు దెబ్బతింటాయి. అలాగే ఐరన్ కూడా లోపిస్తుంది. దీంతో రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. అందుకే తిన్న వెంటనే ఎప్పుడూ కూడా టీ లేదా కాఫీని అస్సలు సేవించకూడదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, తిన్న తర్వాత చాలామంది చేసే పొరపాటుల్లో, ఇది కూడా ఒకటి. కొంతమంది భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తుంటారు. కానీ ఇది శరీరానికి చాలా హానిని కలిగిస్తుంది. చేస్తే అనారోగ్యం కలుగుతుంది. ఇంకా జీర్ణక్రియ నెమ్మదిస్తుంది అని నిపుణులు చెబుతున్నారు. ఇంకా రక్త ప్రవాహాన్ని తగ్గించి జీర్ణ క్రియను నిమ్మదించేలా చేస్తుంది. అందుకే తిన్న వెంటనే స్నానం అస్సలు చేయకూడదు. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత స్నానం చేస్తే మంచిది.