Booster Dose : కరోనా వైరస్ ఇక సమసిపోయిందని అనుకునే లోపే సరికొత్త వేరియంట్‌గా మళ్లీ వస్తున్నది. ఈ క్రమంలోనే జనాలు భయపడిపోతున్నారు. ఆరోగ్య నిపుణులు కూడా ఇప్పటి వరకు తీసుకున్న వ్యాక్సిన్ కొత్తగా వచ్చే వేరియంట్స్‌పైన పని చేయగలవా అని అనుమానపడుతున్నారు. ఇక ఇప్పటికే తీసుకున్న రెండు డోసుల వ్యాక్సిన్ కాకుండా బూస్టర్ డోస్ కూడా తీసుకోవాల్సి ఉంటుందని పలువురు అంటున్నారు. ఈ క్రమంలోనే బూస్టర్ డోసు ద్వారా కలిగే లాభాలపై బ్రిటన్ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో పలు విషయాలు బయటపడ్డాయి. అవేంటంటే..
బూస్టర్ డోస్ కరోనా ఒమిక్రాన్ వేరియంట్‌కు వ్యతిరేకంగా 88 పర్సెంట్ పని చేస్తుందని యూకే అధ్యయనం స్పష్టం చేసింది. ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకుగాను కావాల్సిన ఇమ్యూనిటీ పవర్‌ను బూస్టర్ డోసు పెంచగలదని అధ్యయనంలో తేలింది. ఇకపోతే బూస్టర్ డోస్ ఇంపాక్ట్ ఆరు నెలల తర్వాత మెల్ల మెల్లగా తగ్గుతుందని ఈ సందర్భంగా పరిశోధకులు స్పష్టం చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ తొలి కేసును బ్రిటన్‌లో కనుగొన్నారు. ఈ క్రమంలోనే బూస్టర్ డోసు గురించి బ్రిటన్ పరిశోధకులు తెలిపిన విషయం అందరూ గమనిస్తున్నారు.
బూస్టర్ డోస్ గురించి ఈ సందర్భంగా అన్ని కంట్రీస్ కంటే ముందరనే యూకే ప్రచారం చేస్తోంది. బూస్టర్ డోస్ ప్రతీ ఒక్కరు తీసుకోవాలని యూకే ప్రజలకు యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఇటీవల విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బూస్టర్ డోసు ఇంపార్టెన్స్ అందరికీ అర్థమయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బూస్టర్ డోసు తీసుకోని వారే ఐసీయూలో చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. మొత్తంగా బూస్టర్ డోసు ఇంపార్టెన్స్ పైన యూకే పరిశోధకులు పలు విషయాలు త మ అధ్యయనంలో తేల్చారు. బూస్టర్ డోస్ తీసుకోవడం ద్వారా హ్యూమన్ బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ అవుతుందని, ఫలితంగా వారు చాలా యాక్టివ్‌గా ఉంటారని, వారికి కొవిడ్ వేరియంట్స్ నుంచి రక్షణ లభిస్తుందని పరిశోధకులు స్పష్టం చేశారు.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.