Booster Dose : గుడ్ న్యూస్.. బూస్టర్ డోస్‌తో ఒమిక్రాన్‌ను ఎదుర్కోవడంతో పాటు అధిక రక్షణ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Booster Dose : గుడ్ న్యూస్.. బూస్టర్ డోస్‌తో ఒమిక్రాన్‌ను ఎదుర్కోవడంతో పాటు అధిక రక్షణ..!

 Authored By mallesh | The Telugu News | Updated on :3 January 2022,3:40 pm

Booster Dose : కరోనా వైరస్ ఇక సమసిపోయిందని అనుకునే లోపే సరికొత్త వేరియంట్‌గా మళ్లీ వస్తున్నది. ఈ క్రమంలోనే జనాలు భయపడిపోతున్నారు. ఆరోగ్య నిపుణులు కూడా ఇప్పటి వరకు తీసుకున్న వ్యాక్సిన్ కొత్తగా వచ్చే వేరియంట్స్‌పైన పని చేయగలవా అని అనుమానపడుతున్నారు. ఇక ఇప్పటికే తీసుకున్న రెండు డోసుల వ్యాక్సిన్ కాకుండా బూస్టర్ డోస్ కూడా తీసుకోవాల్సి ఉంటుందని పలువురు అంటున్నారు. ఈ క్రమంలోనే బూస్టర్ డోసు ద్వారా కలిగే లాభాలపై బ్రిటన్ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో పలు విషయాలు బయటపడ్డాయి. అవేంటంటే..

బూస్టర్ డోస్ కరోనా ఒమిక్రాన్ వేరియంట్‌కు వ్యతిరేకంగా 88 పర్సెంట్ పని చేస్తుందని యూకే అధ్యయనం స్పష్టం చేసింది. ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకుగాను కావాల్సిన ఇమ్యూనిటీ పవర్‌ను బూస్టర్ డోసు పెంచగలదని అధ్యయనంలో తేలింది. ఇకపోతే బూస్టర్ డోస్ ఇంపాక్ట్ ఆరు నెలల తర్వాత మెల్ల మెల్లగా తగ్గుతుందని ఈ సందర్భంగా పరిశోధకులు స్పష్టం చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ తొలి కేసును బ్రిటన్‌లో కనుగొన్నారు. ఈ క్రమంలోనే బూస్టర్ డోసు గురించి బ్రిటన్ పరిశోధకులు తెలిపిన విషయం అందరూ గమనిస్తున్నారు.

Booster Dose : అధ్యయనం ద్వారా పలు కీలక విషయాలు స్పష్టం..

booster dose importance of booster dose

booster dose importance of booster dose

బూస్టర్ డోస్ గురించి ఈ సందర్భంగా అన్ని కంట్రీస్ కంటే ముందరనే యూకే ప్రచారం చేస్తోంది. బూస్టర్ డోస్ ప్రతీ ఒక్కరు తీసుకోవాలని యూకే ప్రజలకు యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఇటీవల విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బూస్టర్ డోసు ఇంపార్టెన్స్ అందరికీ అర్థమయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బూస్టర్ డోసు తీసుకోని వారే ఐసీయూలో చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. మొత్తంగా బూస్టర్ డోసు ఇంపార్టెన్స్ పైన యూకే పరిశోధకులు పలు విషయాలు త మ అధ్యయనంలో తేల్చారు. బూస్టర్ డోస్ తీసుకోవడం ద్వారా హ్యూమన్ బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ అవుతుందని, ఫలితంగా వారు చాలా యాక్టివ్‌గా ఉంటారని, వారికి కొవిడ్ వేరియంట్స్ నుంచి రక్షణ లభిస్తుందని పరిశోధకులు స్పష్టం చేశారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది