Health Benefits : ఇది తింటే బీపీ నార్మ‌ల్ .. షుగ‌ర్ మీ కంట్రోల్ లో ఉంట‌ది అదేంటో తెలుసుకోండి మీరే.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : ఇది తింటే బీపీ నార్మ‌ల్ .. షుగ‌ర్ మీ కంట్రోల్ లో ఉంట‌ది అదేంటో తెలుసుకోండి మీరే..

Health Benefits : ముల్లంగి ఆరోగ్య‌క‌ర‌మైన ఫుడ్ లో ఒక‌టి. ఇది త‌క్కువ కేల‌రీలు క‌లిగిన రూట్ వెజిటేబుల్స్ పోష‌కాల‌తో నిండి ఉంటుంది. ఉత్తరాది ప్రజలైతే ముల్లంగిని అత్యంత ఇష్టంగా తింటారు. ముల్లంగి సలాడ్లు విపరీతంగా లాగించే నార్త్ ఇండియన్స్ కు మూలీ పరోఠా అత్యంత ఇష్టమైన ఆహారం. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే ముల్లంగితో చాలా వెరైటీలు చేసుకోవచ్చు. అయితే సాంప్ర‌దాయ వైద్యంలో ముల్లంగిని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. సాంప్ర‌దాయ చైనీస్ వైద్యంలో జ‌ర్వం, గొంతు […]

 Authored By mallesh | The Telugu News | Updated on :25 March 2022,7:00 pm

Health Benefits : ముల్లంగి ఆరోగ్య‌క‌ర‌మైన ఫుడ్ లో ఒక‌టి. ఇది త‌క్కువ కేల‌రీలు క‌లిగిన రూట్ వెజిటేబుల్స్ పోష‌కాల‌తో నిండి ఉంటుంది. ఉత్తరాది ప్రజలైతే ముల్లంగిని అత్యంత ఇష్టంగా తింటారు. ముల్లంగి సలాడ్లు విపరీతంగా లాగించే నార్త్ ఇండియన్స్ కు మూలీ పరోఠా అత్యంత ఇష్టమైన ఆహారం. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే ముల్లంగితో చాలా వెరైటీలు చేసుకోవచ్చు. అయితే సాంప్ర‌దాయ వైద్యంలో ముల్లంగిని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. సాంప్ర‌దాయ చైనీస్ వైద్యంలో జ‌ర్వం, గొంతు నొప్పి, మంట వంటి స‌మ‌స్య‌ల‌కు చికిత్స చేయ‌డంలో ముల్లంగిని వాడ‌తారు.ముల్లంగిలోని పోష‌కాలు అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. ముల్లంగిలో విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ ఈ, బి6, పొటాషియం ఇతర మినరల్స్ ఇందులో ఉంటాయి.

విట‌మిన్ సీ యాంటిఆక్సిడెంట్ ఇది శ‌రీరంలోని ఫ్రీరాడిక‌ల్స్ తో పోరాడ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. అలాగే వృద్దాప్యం, అన్ హెల్తీ లైఫ్ స్టైల్, ప‌ర్యావ‌ర‌ణ విష‌ప‌దార్థాల వ‌ల్ల క‌లిగే క‌ణాల న‌ష్టాన్ని నిరోధించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. అలాగే ర‌క్త‌నాళాల‌ను, చ‌ర్మ సంర‌క్ష‌ణ‌కు తోడ్ప‌డుతుంది.ముల్లంగి వంటి క్రూసిఫెర‌స్ కూర‌గాయ‌లు తిన‌డం వ‌ల్ల క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. ఐసోథియోసైనేట్ లు క్యాన్స‌ర్ కు కార‌ణ‌మ‌య్యే క‌ణ‌తిల అభివృద్దిని నిరోధిస్తాయి. ముల్లంగి రోగ నిరోధక శక్తి ని పెంపొందిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఇతర పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. దీని వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందని న్యూట్రిషనిస్ట్స్ చెబుతున్నారు.ముల్లంగి వల్ల చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ మనకి లభిస్తాయి. లివర్ సంభందిత వ్యాధుల‌ను నియంత్రిస్తుంది. ముల్లంగి లో కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి మరియు గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది.

BP Normal Sugar Control in Health Benefits of Radish

BP Normal Sugar Control in Health Benefits of Radish

Health Benefits  : క్యాన్స‌ర్ క‌ణాల‌ను నిరోధిస్తుంది..

కాబట్టి షుగర్ పేషెంట్లకు ఇది మంచి ప్రయోజనాన్ని చేకూస్తుంది.ముల్లంగిని డైలీ ఆహారంలో తీసుకోవ‌డం వ‌ల్ల స‌రిప‌డా ఫైబ‌ర్ అందుతుంది. దీంతో శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపించి మ‌ల‌బ‌ద్ద‌కాన్ని నియంత్రిస్తుంది. బీపీ అండ్ షుగ‌ర్ ని కంట్రోల్ చేయ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. అలాగే అధిక బ‌రువును నియంత్రించ‌డంలో కూడా స‌హాయ‌ప‌డుతుంది. గ్యాస్ట్రిక్ క‌ణ‌జాలాన్ని ర‌క్షిస్తూ.. శ్లేష్మ అవ‌రోధాన్ని బ‌లోపేతం చేసి గ్యాస్ట్రిక్ అల్స‌ర్ ని నివారిస్తుంది.ముల్లంగిని తరచు ఆహారంలో చేర్చుకోవడం వల్ల దురద వంటి కొన్ని చర్మ సమస్యలు తగ్గిపోతాయి. అంతే కాదు ముల్లంగి లో పోలిక్ యాసిడ్, విటమిన్ సి, కాల్షియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. దీనితో ఇది బ్లడ్ ప్రెషర్ ని రెగ్యులేట్ చేస్తుంది. ముల్లంగి ఒక స‌హ‌జ యాంటీ ఫంగ‌ల్. కాండిడా అల్బికాన్స్ అధికంగా పెరిగిన‌పుడు యోని ఈస్ట్ ఇన్పెక్ష‌న్లు, నోటి ద్వారా వ‌చ్చే ఇన్ఫెక్ష‌న్ల‌ను ముల్లంగిలో ఉన్న యాంటి ఫంగ‌ల్ నివారిస్తుంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది