Rotis : రోటీలని గ్యాస్ పైన నేరుగా కాలుస్తున్నారా… తస్మాత్ జాగ్రత్త…! చాలా ప్రమాదం పొంచి ఉంది….?
ప్రధానాంశాలు:
Rotis : రోటీలని గ్యాస్ పైన నేరుగా కాలుస్తున్నారా... తస్మాత్ జాగ్రత్త...! చాలా ప్రమాదం పొంచి ఉంది....?
Rotis : ప్రస్తుత కాలంలో రైస్ ఎక్కువగా తినడానికి ఇష్టపడని వారు. చపాతీల్ని ఎక్కువగా తింటున్నారు. ఎందుకంటే అన్నంలో కలిగే సైడ్ ఎఫెక్ట్స్ చాలామంది అవగాహన పెంచుకుంటున్నారు. రైస్ కంటే చపాతీలు ఎక్కువ ప్రోటీన్స్ కలిగి ఉంటుంది కాబట్టి. అయితే చపాతీని తయారు చేసే విధానంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. వాటిని ఒక పెనంపై వేసి కాల్చుకోకుండా నేరుగా గ్యాస్ పై వేసి కాలుస్తూ ఉంటారు. అలా చేయడం సరైనది కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నేరుగా గ్యాస్ పై కాల్చిన రోటీలను తింటే ఆరోగ్యానికి ముప్పు తప్పదు అంటున్నారు… పూర్తి వివరాల్లోకి వెళితే….
Roti on direct cause cancer
రోటీలు మన భారతీయ ఆహారంలో ఒక భాగం. దక్షిణాది దేశాల్లో తక్కువగానే తింటారు. ఉత్తరాదిలో మాత్రం రోటీలను ఎక్కువగా తింటారు. అయితే వీటిని చాలామంది రోటీలని పెనంపై కాకుండా నేరుగా మంటపై కాలుస్తుంటారు. ఎందుకంటే రోటీలు మంచిగా పొంగినట్టు వస్తాయని ఇలా చేస్తుంటారు. కానీ ఇలా రోటీలని మంటపై కాల్చడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలో తెలిపారు. చపాతీలు రోటీలు అంటివి ఏదైనా సరే నేరుగా గ్యాస్ మంటపై అధిక ఉష్ణోగ్రత వద్ద కాల్చడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో పెను ప్రమాదాలు పొంచి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా కాల్చడం వల్ల హానికరమైన పదార్థాలు ఉత్పత్తి అవుతాయని. ఇది మానవ శరీరానికి ప్రమాదకరమని చెబుతున్నారు. వీటిని నేరుగా స్టౌ పై పెట్టి కాల్చడం వల్ల క్యాన్సర్ వస్తుందని, ఓ మంటపై కాల్చడం వల్ల క్యాన్సర్ కారకాలను ఉత్పత్తి చేస్తుందని సూచిస్తున్నారు. ఇలా నేరుగా గ్యాస్ పై రోటీలని కాల్చడం వల్ల క్యాన్సర్ కారకమయ్యాయి అకిలా మైండ్, హెటె రో సైక్లిక్ అమైన్లు. పాలి సైక్లిక్, ఆరోమాటిక్ హైడ్రో కార్బన్లు కూడా ఉత్పత్తి అవుతాయని వైద్యులు చెబుతున్నారు. బాగా కాలిన చోట నల్లగా మారి ఆ భాగాలలో హానికరమైన కార్బన్ సమ్మేళనాలు అవకాశం ఉంది. దీనివల్ల శ్వాసకోశ సమస్యలు, గుండె సమస్యలతో పాటు క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందంట. అందుకే రోటీని బాగా కాల్చి మాడిపోయే విధంగా కాల్చవద్దు. దోరగా కాల్చుకుంటే మంచిది. అటు ఇటు తిరగవేస్తూ దోరగా కాల్చు కోవాలి. పెనం పైన వేసుకొని చపాతిని కాల్చుకోవడం మంచిది.
అలాగే జీర్ణ సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు. ఇలా డైరెక్ట్ గా గ్యాస్ పై కాల్చిన చపాతీని, రోటీలను తినడం వల్ల వారి పరిస్థితి అనారోగ్య సమస్య పాలవుతుందని చెబుతున్నారు. ఇటువంటి జీర్ణ సమస్య లేదా ఇతర సమస్యలు ఉన్నవారు ఎలా తినాలో వైద్యుల సలహా మేరకు తినమని చెబుతున్నారు. ఇలా డైరెక్ట్ గా గ్యాస్ పై కాంచన చపాతిని తింటే కడుపులో మంట, జీర్ణ సమస్యలు, ఎసిడిటీ, క్యాన్సర్ ప్రమాదం పెరిగే అవకాశం మరింత ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మీకు నేరుగా మంటపై కాల్చిన రొట్టెలే నచ్చితే… వాటిని వీలైనంత తక్కువగా తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకు బదులుగా సమతుల్యమైన ఆహారాన్ని మీ డైట్ లో చేర్చుకోవాలని చెబుతున్నారు. చపాతీ లేని వీలైనంతవరకు పెనంపై వేసుకొని మాత్రమే తినడానికి ప్రయత్నం చేయండి. ఇలా చేస్తే చపాతి ఎక్కువగా కాలకోకుండా నార్మల్ గా కాలుతుంది రోటి. నీ వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు.