Weight Looss : అధిక బరువు తగ్గాలనుకునేవారు.. చపాతీలే కాదు.. ఈ రోటీలను ట్రై చేసి చూడండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Weight Looss : అధిక బరువు తగ్గాలనుకునేవారు.. చపాతీలే కాదు.. ఈ రోటీలను ట్రై చేసి చూడండి..!

 Authored By aruna | The Telugu News | Updated on :2 February 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Weight Looss : అధిక బరువు తగ్గాలనుకునేవారు.. చపాతీలే కాదు.. ఈ రోటీలను ట్రై చేసి చూడండి..!

Weight Looss : ప్రస్తుతం చాలామంది వయసు తరహా లేకుండా అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు.. ఆ అధిక బరువును తగ్గించుకోవడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో ఒకటి సాయంత్రం వేళలో భోజనం చేయకుండా చపాతీలు తినడం చేస్తూ ఉంటారు.. అయితే కేవలం చపాతి తింటేనే బరువు తగ్గుతారు అనుకోవడం పెద్ద పొరపాటు. చపాతి కంటే ఎన్నో ఆరోగ్యవంతమైన రోటీలు తయారు చేసుకుని తీసుకోవచ్చు. దీనిలో రాగులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చాలామంది రాగి పిండితో అంబలి లేదా దోశలు లాంటివి తయారుచేసుకొని తింటూ ఉంటారు..
అయితే రాగి పిండితో కూడా చపాతీ తయారు చేసుకుని తీసుకోవచ్చు.. దీన్ని తినడం వలన సులువుగా అధిక బరువు తగ్గడమే కాకుండా మంచి పోషకాలు కూడా శరీరానికి అందుతాయి..

అలాగే ఓట్స్ తో కూడా రోటీలను తయారు చేసుకుని తీసుకోవచ్చు. ఓట్స్ అనేవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఓట్స్ ను కూడా పిండి పట్టించి వీటితో కూడా రోటీలను తయారు చేసి తీసుకోవచ్చు. వీటిని తిన్నట్లయితే అధిక బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.అలాగే సజ్జలతో కూడా రోటీలను తయారు చేసుకొని తీసుకోవచ్చు. ఇది కూడా ఆరోగ్యానికి మంచి పోషకాలను అందిస్తాయి.

వీటితో రోటీలు తయారు చేసుకొని తీసుకున్నట్లయితే సులభంగా బరువు తగ్గుతారు. గోధుమపిండి చపాతీలు తిని బోర్ కొట్టిన వాళ్ళు వీటిని తయారు చేసుకుని తీసుకోవచ్చు.. అదేవిధంగా జొన్నలు కూడా ఆరోగ్యానికి మంచి ఆహారం. జొన్నలతో చేసిన రైస్ కూడా తయారు చేసుకుని తింటూ ఉంటారు. పాతకాలంలో జనులతో రొట్టెలు తయారు చేసుకుని తినేవారు జొన్నలతో తయారుచేసే రొట్టెలు ఇంకా ఆరోగ్యానికి మంచిది. అలాగే త్వరగా బరువు తగ్గుతారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది