Belly Fat : మీ బెల్లీ ఫ్యాట్ కు చెక్ పెట్టాలంటే.. బ్రేక్ ఫాస్ట్ లో ఈ ఫుడ్ ని తీసుకుంటే చాలు…!!
Belly Fat : బ్రేక్ ఫాస్ట్ లో సహజంగా ఇడ్లీ, బోండా, దోశ ఇలా కొన్ని రకాలు తింటూ ఉంటాం. అయితే బ్రేక్ ఫాస్ట్ లో ఈ ఫుడ్ ని తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది అని వైద్యనిపుణులు చెప్తున్నారు. కొన్ని ఆహార పదార్థాలు మన కడుపు నింపడమే కానీ మన శరీరానికి ఎటువంటి పోషకాలు అందించవు. అలాగే బరువు పెరిగేలా చేస్తుంటాయి. మన బరువు కంట్రోల్ చేయడానికి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉదయం పూట తినకూడని ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం… బ్రేక్ ఫాస్ట్ అనేది రోజులో ప్రధానమైన ఆహారం. రోజంతా పనిచేయడానికి కావలసిన శక్తి బ్రేక్ ఫాస్ట్ నుంచే వస్తుంది. కావున ఎట్టి పరిస్థితిలోనూ బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేయొద్దని ఆహారం నిపుణులు చెప్తున్నారు.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం పూట 7 నుంచి ఎనిమిది గంటల మధ్య లేదా పది గంటల వరకు బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. ఉదయం నిద్ర లేచిన తర్వాత రోజంతా మిమ్మల్ని చురుగ్గా ఉంచడానికి బ్రేక్ ఫాస్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది.. బ్రేక్ ఫాస్ట్ లో ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాం అనేది చాలా ప్రధానం.. వైట్ బ్రెడ్ : ఇప్పుడు మనం జీవిస్తున్న జీవనశైలి కారణంగా చాలామంది అల్పాహారంలో వైట్ బ్రెడ్ టోస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. వైట్ బ్రెడ్ మైదాతో తయారుచేస్తారు. శుద్ధి చేసిన పదార్థాల కారణంగా వేగంగా బరువు పెరుగుతూ ఉంటారు. ప్రధానంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుంటూ ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్ : చాలామంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ ఇవి ఆరోగ్యానికి ఎంతగానో చెడు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
ఫాస్ట్ ఫుడ్ లో ట్రాన్స్పర్ ఫ్యాట్ చాలా అదికంగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకుంటే ఉబకాయలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా బెల్లీ ఫ్యాట్, గుండె సమస్యలు, డయాబెటిస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సేరల్స్ : యూరోపియన్ జనరల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీ పరిశోధన ప్రకారం అధిక చక్కర కారణమవుతుంది. మార్కెట్లో దొరికే రెడీమేడ్ సేరల్స్ లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇది టిఫిన్ లో తింటే బరువు పెరుగుతారు. ప్రాసెస్ చేసిన ఫుడ్ : ప్రాసెస్ చేసిన మాంసంలో క్యాలరీలు ట్రాన్స్ ఫర్ ఫ్యాట్ అధికంగా ఉంటుంది. వీటి మూలంగా బెల్లీ ఫ్యాట్ వస్తుంది.
ఇవి ఎక్కువగా తీసుకుంటే గుండె జబ్బులు, ప్రమాదం ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. కా ఫీ: బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలనుకుంటే బ్రేక్ ఫాస్ట్ లో క్రీం, అదనపు చక్కర వేసిన కాఫీలు తీసుకోకూడదని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఉదయం పూట చక్కర తీసుకుంటే బరువు పెరగడంతో పాటు బెల్లీఫ్యాట్ అధికమవుతుంది. వీటితోపాటు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. షుగర్ వేసిన డ్రింక్స్ ఆహార పదార్థాలు చాలా ప్రమాదమని హార్బర్డ్ హెల్త్ స్పష్టం చేసింది. ఈ పానీయాలలో చాలా తక్కువ పోషకాలు ఉంటాయి. ఉదయం పూట కాఫీ తాగాలనుకుంటే తక్కువ చక్కెర వేసుకోవాలని వీలైతే బ్లాక్ కాఫీ తాగాలని వైద్య నిపుణులు తెలుపుతున్నారు…