Cockroach Milk : బొద్దింక పాలలో ఇన్ని ప్రయోజనాలా... శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే...!
Cockroach Milk : ప్రతి ఒక్కరికి ఆవుపాలు గేద పాలు బర్రె పాలు గొర్రె పాలు గురించి తెలుసు. కానీ బొద్దింక పాల గురించి ఎప్పుడైనా విన్నారా…మరో విచిత్రం ఏంటంటే ఆవు గేద పాలకంటే కూడా బొద్దింక పాలలోనే మూడు రెట్లు ఎక్కువ పోషకాలు లభిస్తాయట. పాలలాగా కనిపించే ఈ స్పటికంలో ప్రోటీన్ తో పాటు ముఖ్యమైన ఆమ్లాలు ఉంటాయట. అంతేకాక దీనిలో ఆరోగ్యానికి మంచి చేసే కొవ్వులు మరియు చక్కెరలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే 100 గ్రాముల బొద్దింకపాలు తీసుకున్నట్లయితే దాంట్లో దాదాపు 232 క్యాలరీల శక్తి లభిస్తుందట. అయితే ఇక్కడ 100 గ్రాముల ఆవుపాలలో కేవలం 66 కేలరీల శక్తి మాత్రమే లభిస్తుంది.
Cockroach Milk : బొద్దింక పాలలో ఇన్ని ప్రయోజనాలా… శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే…!
అంటే బొద్దింక పాలలో దాదాపు 40 శాతం ప్రోటీన్, 25 శాతం కార్బోహైడ్రేట్లు , 22 శాతం కొవ్వు మరియు 5 శాతం ఆమ్లాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఈ విషయాలన్నింటినీ కూడా ప్రీ ప్రెస్ జర్నల్ నివేదించడం జరిగింది. అంతేకాక బొద్దింక పాలలో ,ఒలేయిక్ ఆమ్లం, లినోలెయిక్ ఆమ్లం, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు, షార్ట్-చైన్, మీడియం-చైన్ కొవ్వు ఆమ్లాలు ఈ విధంగా మొత్తం 9కి పైన ఆమ్లాలు ఉంటాయి. దీని కారణంగా ఆవు పాలకంటే బర్రె పాలకంటే కూడా బొద్దింక పాలు మంచి ఎంపికని నిపుణులు చెబుతున్నారు. అంతేకాక ఆవు పాలలో లాక్టోస్ ఉండడం వలన కొందరిలో అది జీర్ణం కాదు. కానీ బొద్దింక పాలలో లాక్టోస్ ఉండదు. దీని కారణంగా ఈ పాలు తాగిన వారికి అజీర్ణం ఉబ్బరం, వికారం, విరోచనాలు వంటి సమస్యలు రావట.
అంతేకాక బొద్దింక పాలలో అధిక క్యాలరీలు ఉండడం వలన బరువు పెరగాలి అనుకునే వారికి ఇది మంచి ఎంపిక. అయితే ఇప్పటివరకు అంతా బాగానే ఉన్నప్పటికీ బొద్దింక నుండి పాలు తీయడం అనేది సులువైన పని కాదు. ఇది చాలా సంక్లిష్టమైన ప్రక్రియని శాస్త్రవేత్తలు సైతం చెబుతున్నారు.బొద్దింక ప్రేగులో పాల ఉత్పత్తి అనేది జరుగుతుంది. దీనికోసం కచ్చితంగా బొద్దింకలను చంపాల్సి ఉంటుంది. అంటే 100 గ్రాముల బొద్దింక పాలు తీయాలంటే దాదాపు 1000 బొద్దింకలను చంపాలి అన్నమాట.
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
This website uses cookies.