Coconut Oil : చలికాలంలో వచ్చే చర్మ సమస్యలకు కొబ్బరినూనె బెస్ట్ ఆప్షన్… ఎలా వాడాలంటే…??
Coconut Oil : చలికాలం రానే వచ్చేసింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరుగుతుంది. అలాగే రోజు రోజుకి ఉష్ణోగ్రతలు కూడా బాగా పడిపోతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే చలికాలం అనగానే చర్మ సమస్యలు ఎక్కువగా వస్తాయి. అలాగే ముఖంపై ముడతలు మరియు పాదాల పగుళ్ళు, పేదల పగుళ్లు, డెడ్ స్కిన్ సెల్స్ తగ్గించలేకపోవడం లాంటి ఎన్నో రకాల సమస్యలు చుట్టుముడతాయి. అయితే వీటన్నిటికీ కూడా కొబ్బరి నూనెతో చేక్ పెట్టొచ్చు అని అంటున్నారు నిపుణులు. సాధారణంగా మనకు […]
ప్రధానాంశాలు:
Coconut Oil : చలికాలంలో వచ్చే చర్మ సమస్యలకు కొబ్బరినూనె బెస్ట్ ఆప్షన్... ఎలా వాడాలంటే...??
Coconut Oil : చలికాలం రానే వచ్చేసింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరుగుతుంది. అలాగే రోజు రోజుకి ఉష్ణోగ్రతలు కూడా బాగా పడిపోతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే చలికాలం అనగానే చర్మ సమస్యలు ఎక్కువగా వస్తాయి. అలాగే ముఖంపై ముడతలు మరియు పాదాల పగుళ్ళు, పేదల పగుళ్లు, డెడ్ స్కిన్ సెల్స్ తగ్గించలేకపోవడం లాంటి ఎన్నో రకాల సమస్యలు చుట్టుముడతాయి. అయితే వీటన్నిటికీ కూడా కొబ్బరి నూనెతో చేక్ పెట్టొచ్చు అని అంటున్నారు నిపుణులు. సాధారణంగా మనకు మార్కెట్లో దొరికే లోషన్లకు బదులుగా కొబ్బరి నూనె రాస్తే చర్మం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది అని అంటున్నారు. అలాగే చలికాలంలో రోజు రాత్రి పడుకునే ముందు ముఖానికి కొబ్బరి నూనె రాసుకోవడం వలన వెంటనే మార్పు కనిపిస్తుంది అని అంటున్నారు. ఇంతకీ రోజు కొబ్బరి నూనె రాసుకుంటే జరిగే ఆ మార్పులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సాధారణంగా చలికాలంలో చర్మం అనేది పొడిబారటం సర్వసాధారణమైన విషయం. ఈ సమస్యలకు చెక్ పెట్టడానికి వ్యాషిలెన్ లో కొంత కొబ్బరి నూనె కలుపుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. మీరు ఇలా చేయడం వలన చర్మం అనేది ఎంతో తేమగా ఉంటుంది. అలాగే రాత్రంతా ఉంచుకొని ఉదయాన్నే ముఖాన్ని క్లీన్ చేస్తే ముఖం నున్నగా మారి ఎంతో ప్రకాశవంతంగా మారుతుంది. అంతేకాక ఇది చర్మానికి మంచి పోషణలు కూడా ఇస్తుంది.
ఇకపోతే కాళ్లు మరియు చేతులకు కూడా కొబ్బరి నూనెను రాసుకోవడం వలన చర్మం పగిలిపోకుండా ఉంటుంది. అంతేకాక చలికాలం సబ్బుకు బదులుగా శనగపిండి మరియు బియ్యం పిండి లాంటి వాటిని వాడితే చర్మం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది అని అంటున్నారు నిపుణులు. అలాగే చలికాలంలో చర్మం అనేది ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అంటే నీటిని కూడా అధికంగా తాగాలి అని అంటున్నారు. దీనివలన డీహైడ్రేషన్ సమస్య కూడా రాకుండా ఉంటుంది అని అంటున్నారు. అంతేకాక మీరు తీసుకునే ఆహారంలో విటమిన్ ఏ మరియు విటమిన్ డి, ఐరన్, జింక్, కాల్షియం లాంటి పోషకాలు అధికంగా ఉండేలా చూసుకోవాలి అని అంటున్నారు నిపుణులు