Coconut Oil : జిడ్డు వలన బాధపడుతున్నారా.. అయితే ఇలా ట్రై చేయండి..!
ప్రధానాంశాలు:
Coconut Oil : జిడ్డు వలన బాధపడుతున్నారా.. అయితే ఇలా ట్రై చేయండి..!
Coconut Oil : కొబ్బరి నూనె… మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు ఎంతగా ఉన్నాయో చాలా మందికి తెలుసుండదు. వేల రూపాయలు ఖర్చు చేసే కాస్మెటిక్ ఉత్పత్తులకంటే కొబ్బరి నూనె సహజమైనది, ఆరోగ్యకరమైనది. ముఖ్యంగా మొటిమలు, నల్లటి వలయాలు, బ్లాక్‌హెడ్స్, పళ్ల మెరుపు వంటి సమస్యలకు ఇది అద్భుత పరిష్కారంగా పనిచేస్తుంది.ఇక్కడ ఇచ్చిన నాలుగు చిట్కాలు సరైన విధంగా పాటిస్తే చర్మం, దంతాలు మెరుగు పడతాయి. బ్లాక్ హెడ్స్‌కు చెక్ పెట్టండి. చర్మంపై బ్లాక్ హెడ్స్ సమస్య సాధారణమే,

Coconut Oil : జిడ్డు వలన బాధపడుతున్నారా.. అయితే ఇలా ట్రై చేయండి..!
Coconut Oil : ఈ టిప్స్ తో చాలా ఉపయోగం
దీని కోసం ఖరీదైన స్క్రబ్బులు కాకుండా…కొబ్బరి నూనెలో చక్కెర కలిపి, బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో 2-3 నిమిషాలు మృదువుగా మసాజ్ చేయండి.ఇది సహజమైన స్క్రబ్‌లా పనిచేసి చర్మాన్ని హాని లేకుండా శుభ్రపరుస్తుంది. కళ్ళ కింద నల్లటి వలయాలు? అలసిన చూపు? అయితే ఈ చిట్కా పాటించండి. కొబ్బరి నూనెలో కాఫీ పొడి కొద్దిగా కలిపి పేస్ట్ చేయండి. ఈ మిశ్రమాన్ని కళ్ళ కింద, కనురెప్పలపై అప్లై చేయండి.ఇది డార్క్ సర్కిల్స్‌ను తగ్గించడమే కాదు, ఫైన్ లైన్స్‌ను కూడా దూరం చేస్తుంది.
నవ్వు మెరిసేలా కావాలా? కొబ్బరి నూనెతో ఇది సాధ్యమే. కొబ్బరి నూనెలో చిటికెడు పసుపు కలపండి. బ్రష్‌పై వేసుకుని బాగా రుద్దండి రసాయనాలు లేని సహజ టూత్ క్లీనర్‌లా ఇది పనిచేస్తుంది. పళ్లు ప్రకాశవంతంగా మెరిసిపోతాయి. రాత్రి పడుకునే ముందు కొద్దిగా కొబ్బరి నూనెను ముఖానికి మసాజ్ చేయండి. ఇది చర్మానికి తేమనిస్తుందే కాకుండా, సున్నితంగా మృదువుగా మారుస్తుంది.