Black Hair | 7 రోజుల్లో తెల్ల జుట్టును నల్లగా మార్చే ఆయుర్వేద నూనె.. డాక్టర్ సూచనలు వైరల్
Black Hair | ఈ రోజుల్లో వయసు తక్కువగా ఉన్నవారికీ తెల్ల జుట్టు (Premature Greying) పెద్ద సమస్యగా మారింది. ఆటో ఇమ్యూన్ వ్యాధులు, థైరాయిడ్ సమస్యలు, విటమిన్ లోపాలు, ఒత్తిడి, పెరుగుతున్న కాలుష్యం వంటి అంశాలు జుట్టు నెరవడానికి దారితీస్తున్నాయి. వయస్సు పెరుగుతున్న కొద్దీ సహజంగా మెలనిన్ ఉత్పత్తి తగ్గడం కూడా దీనికి కారణం.
ఈ సమస్యతో బాధపడుతున్న వారి కోసం డాక్టర్ సలీం జైదీ ఇటీవల యూట్యూబ్‌లో పంచుకున్న ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో ఆయన, “7 రోజుల్లో వేర్ల నుంచే తెల్ల జుట్టును నల్లగా మార్చగల ఆయుర్వేద నూనె” ను తయారు చేసే విధానాన్ని వివరించారు.
#image_title
తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి సహజమైన పద్ధతిలో ఈ నూనెను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చని ఆయన చెప్పారు.
కావలసిన పదార్థాలు:
ఎండిన ఉసిరి ముక్కలు – 2 టీ స్పూన్లు
తాజా కరివేపాకు – 1 గుప్పెడు
భ్రింగ్రాజ్ పౌడర్ – 2 టీ స్పూన్లు
కొబ్బరి నూనె – 1 కప్పు
తయారీ విధానం
ఒక పాత్రలో కొబ్బరి నూనె పోసి అందులో ఉసిరి ముక్కలు, కరివేపాకు, భ్రింగ్రాజ్ పౌడర్ వేసి మంటపై ఉంచండి. కరివేపాకు, ఉసిరి ముక్కలు నల్లగా మారే వరకు నెమ్మదిగా ఉడికించాలి. తర్వాత చల్లారనివ్వాలి. వడకట్టి కంటైనర్‌లో నిల్వ చేయండి.
వాడే విధానం
ఈ నూనెను వారానికి కనీసం మూడు సార్లు అప్లై చేయాలని డాక్టర్ సలీం సూచిస్తున్నారు. రాత్రి పడుకునే ముందు తలపై మసాజ్ చేసి, ఉదయం షాంపూతో కడిగేయాలి. 3 నెలల పాటు క్రమం తప్పకుండా వాడితే ఉత్తమ ఫలితాలు కనపడతాయని చెప్పారు.