Colon Cancer : మలబద్ధక సమస్యను నిర్లక్ష్యం చేస్తే… అది ప్రాణాంతక వ్యాధికి దారితిస్తుందని తెలుసా…?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Colon Cancer : మలబద్ధక సమస్యను నిర్లక్ష్యం చేస్తే… అది ప్రాణాంతక వ్యాధికి దారితిస్తుందని తెలుసా…??

Colon Cancer : మీరు మలబద్ధక సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.? ఏదైనా తిన్న వెంటనే కడుపు నిండుగా అనిపిస్తుందా. మీ సమాధానం అవును అయితే మాత్రం జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే. ఎందుకు అంటే తరచు మలబద్దక సమస్యతో ఇబ్బంది పడితే పెద్ద పేగు క్యాన్సర్ కు సంకేతం కావచ్చు అని అంటున్నారు నిపుణులు. అయితే పెద్ద పేగు లేక కొలొరెక్టల్ క్యాన్సర్ ను పెద్ద పేగు క్యాన్సర్ అని అంటారు. ఈ క్యాన్సర్ అనేది పెద్ద పేగు లేక […]

 Authored By ramu | The Telugu News | Updated on :14 November 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Colon Cancer : మలబద్ధక సమస్యను నిర్లక్ష్యం చేస్తే... అది ప్రాణాంతక వ్యాధికి దారితిస్తుందని తెలుసా...??

Colon Cancer : మీరు మలబద్ధక సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.? ఏదైనా తిన్న వెంటనే కడుపు నిండుగా అనిపిస్తుందా. మీ సమాధానం అవును అయితే మాత్రం జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే. ఎందుకు అంటే తరచు మలబద్దక సమస్యతో ఇబ్బంది పడితే పెద్ద పేగు క్యాన్సర్ కు సంకేతం కావచ్చు అని అంటున్నారు నిపుణులు. అయితే పెద్ద పేగు లేక కొలొరెక్టల్ క్యాన్సర్ ను పెద్ద పేగు క్యాన్సర్ అని అంటారు. ఈ క్యాన్సర్ అనేది పెద్ద పేగు లేక పురుషనాలంలో వస్తుంది. ఇది మన జీర్ణనాశయంలో చివరి భాగం. అయితే చాలామంది ఈ క్యాన్సర్ మొదటి సంకేతాలను అస్సలు పట్టించుకోరు. దీని వలన అది ఎంతో ప్రాణాంతకంగా మారుతుంది. ఈ సంకేతాలను సరైన టైంలో గుర్తిస్తే చికిత్స చేయటం కూడా ఈజీ అవుతుంది. అయితే ఈ క్యాన్సర్ యొక్క లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం…

Colon Cancer పెద్ద పేగు క్యాన్సర్ యొక్క లక్షణాలు

– మలంలో రక్తస్రావం.
– బరువు తగ్గడం.
– బలహీనత.
– ఉదర విస్తరణ.
– అజీర్ణం.
– వాంతులు.
– నిరంతరం కడుపునొప్పి.

Colon Cancer పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి

– జంక్ ఫుడ్ మరియు ఫాస్ట్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ తీసుకోకుండా ఉండాలి.
– ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా మరియు ద్యానం కచ్చితంగా చేయాలి.
– ఆహారంలో విటమిన్ లు మరియు ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు,ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలను మరియు తృణ ధాన్యాలను ఆహారంలో భాగం చేర్చుకోవాలి.
– మలబద్ధక సమస్యను ఎట్టి పరిస్థితులలో నిర్లక్ష్యం చేయొద్దు.
– మద్యం మరియు డ్రింక్స్ కు వీలైనంతగా దూరంగా ఉంటేనే మంచిది.
– మంచినీరు మరియు జ్యూస్ లాంటివి అధికంగా తాగాలి.
– సిగరెట్ మరియు పొగాకు కూడా దూరంగా ఉండాలి…

Colon Cancer మలబద్ధక సమస్యను నిర్లక్ష్యం చేస్తే అది ప్రాణాంతక వ్యాధికి దారితిస్తుందని తెలుసా

Colon Cancer : మలబద్ధక సమస్యను నిర్లక్ష్యం చేస్తే… అది ప్రాణాంతక వ్యాధికి దారితిస్తుందని తెలుసా…??

పెద్దపేగు క్యాన్సర్ కు చికిత్స ఏమిటి : ఇతర క్యాన్సర్ లాగా పెద్ద పేగు క్యాన్సర్ ను ముందుగా గుర్తించటం అంత ఈజీ అయిన పని కాదు. దీనిని దాని యొక్క లక్షణాల కారణం చేతనే గుర్తించడం జరుగుతుంది. నిజం చెప్పాలంటే కొంతమంది ఎసిడిటీ మరియు గుండెల్లో మంట, అల్స రేట్ వ్యాధులు లాంటి వాటిని ఇంటి నివారణలతో తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దీని వలన సకాలంలో చికిత్స అనేది అందక అది మరింత ప్రాణాంతకంగా మారుతుంది. తరచుగా పెద్దపేగు క్యాన్సర్ అనేది చివరి దశలో నిర్ధారణ అవుతుంది. దీంతో వైద్యులు రేడియేషన్ థేరపి మరియు కీమోథెరపీతో చికిత్స చేస్తారు. అలాగే అవసరమైతే ఆరోగి కి కణితిని తొలగించడానికి శస్త్ర చికిత్స కూడా చేస్తారు. ఈ చికిత్స చేసేందుకు ల్యాప్రొ స్కోపిక్ మరియు రోబోటిక్ ల ను వాడతారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది