Weight Loss : ఉదయాన్నే పరిగడుపున ఈ డ్రింక్ తాగితే మీరు వద్దన్నా లోపల దాక్కున్న కొవ్వు కూడా కరగాల్సిందే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Weight Loss : ఉదయాన్నే పరిగడుపున ఈ డ్రింక్ తాగితే మీరు వద్దన్నా లోపల దాక్కున్న కొవ్వు కూడా కరగాల్సిందే

 Authored By kranthi | The Telugu News | Updated on :13 May 2023,8:00 am

Weight Loss : బరువు పెరగడం చాలా ఈజీ. కానీ.. తగ్గడం చాలా కష్టం. నెల రోజులు ఏది పడితే అది తింటే.. కనీసం ఓ 10 కిలోలు అయినా పెరుగుతాం. అదే 10 కిలోలు తగ్గాలంటే మాత్రం చాలా కష్టం. 10 కిలోలు పక్కన పెట్టండి.. కిలో తగ్గాలన్నా కూడా కష్టమే. బరువు తగ్గడానికి చాలామంది ఎన్నో ప్రయాసలు పడతారు. జిమ్ లో కసరత్తులు చేస్తారు. అయినా కూడా తగ్గరు. అటువంటి వాళ్లు ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు.. వద్దన్నా కూడా బరువు తగ్గుతారు. అది కూడా ఏదో బరువులు మోయడం కాదు.

coriander and cinnamon water is good for weight loss

coriander and cinnamon water is good for weight loss

మీ వంటింట్లోనే ఉంది ఆ చిట్కా. దీన్ని తాగితే ఎంతటి పొట్ట అయినా ఈజీగా తగ్గేస్తుంది.బరువు తగ్గడం మీదనే ఎప్పుడూ ఫోకస్ పెట్టకూడదు. ఎందుకంటే.. బరువు తగ్గే ప్రాసెస్ లో చాలామంది తమ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటారు. అందుకే.. బరువు తగ్గుతూ… ఆరోగ్యం బాగుండేలా చూసుకోవాలి. అప్పుడే అనారోగ్యం దరిచేరదు. దాని కోసం మీరు పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఈ డ్రింక్ తాగితే చాలు.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. బరువు కూడా తగ్గుతారు. దాని కోసం మీరు ధనియాలు రెండు స్పూన్లు, కొన్ని మిరియాలు, దాల్చిన చెక్క పొడి ఒక చెంచా, నీరు ఒక కప్పు తీసుకోండి.

Easy weight loss tips: Good diet plan, regular exercise and sound sleep are  the magic words

Weight Loss : ఆ డ్రింక్ ఎలా తయారు చేయాలి?

ధనియాలను ఒక పాన్ లో వేసి వేయించుకోవాలి. అందులో కొన్ని మిరియాలు వేసుకోండి. కొంచెంద దాల్చిన చెక్క కలిపి మూడింటిని మిక్సీ పట్టండి. మెత్తగా పొడిగా అయ్యాక దాన్ని పక్కన పెట్టండి. ఇక.. ఒక గిన్నెలో కొన్ని మంచినీళ్లు పోసి బాగా మరగబెట్టండి. నీరు మరిగాక.. అందులో రెడీ చేసి పెట్టుకున్న పొడిని వేయండి. కాసేపు మరిగించాక.. వడకట్టి.. గోరు వెచ్చగా అయ్యాక తాగాలి. ప్రతి రోజు ఉదయం పరిగడుపున దాన్ని తాగాల్సి ఉంటుంది. అలాగే.. రాత్రి కూడా పడుకునే ముందు ఒకసారి తాగితే బెటర్. ఇలా రోజూ చేయడం వల్ల.. వద్దన్నా కూడా ఒంట్లోని కొవ్వు కరుగుతుంది. దాని వల్ల బరువు తగ్గుతారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది