Diabetes : బీ కేర్ ఫుల్..వివాహానికి ముందర మధుమేహం ఉంటే మీకు ఈ ఇబ్బందులు..
Diabetes : ప్రస్తుతం మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ డయాబెటిస్ పేషెంట్స్ పెరిగిపోతున్నారు. వివిధ కారణాల వలన సంఖ్య భవిష్యత్తులో ఇంకా పెరిగే చాన్సెస్ ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రతీ ఒక్కరు ఆరోగ్యం పట్ల దృష్టి సారించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ సంగతులు అలా ఉంచితే..డయాబెటిస్ వివాహానికి ముందర నుంచి ఉన్నట్లయితే మ్యారేజ్ తర్వాత వారికి వచ్చే ఇబ్బందులేంటి.. వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలుసుకుందాం.
చాలా మందికి వంశపారంపర్యంగా ఈ డయాబెటిస్ వచ్చే అవకాశాలుంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే, డయాబెటిస్ గురించి భయపడాల్సిన అవసరం లేదని, ఒకవేళ మధుమేహం ఉన్నట్లయితే పెళ్లికి ముందర ఈ విషయాన్ని తెలపాలని సూచిస్తున్నారు. విషయం బయటకు చెప్పిన తర్వాతనే మ్యారేజ్ చేసుకుంటే మంచిదని అంటున్నారు. డయాబెటిస్ ఉన్న వారికి వివాహం తర్వాత వచ్చే సమస్యలు కూడా సాధారణంగానే ఉంటాయి. కానీ, అజాగ్రత్త వహించరాదు. అలా చేస్తే కనుక సమస్యలు ఇంకా ఎక్కువయ్యే చాన్సెస్ ఉంటాయి. బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంచుకోవాలి.
Diabetes : అశ్రద్ధ వహించ వద్దు.. వైద్యుల సూచనలు పాటించాలి..
షుగర్ లెవల్స్ ఎక్కువైతే నరాలకు బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. ఫలితంగా అంగస్తంభన సమస్య రావొచ్చు. దాంతో పాటు శీఘ్రస్కలనం కూడా కావచ్చు. ఒకటి లేదా రెండుసార్లు ఇలా జరిగితే తమ మీద తమకు నమ్మకం పోయి చాలా మంది భయపడిపోతుంటారు. కానీ, అలా భయపడాల్సిన అవసరం లేదు. బ్లడ్ లో షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంచుకునేందుకుగాను జాగ్రత్తలు తీసుకోవాలి. మహిళల్లో బ్లడ్ లెవల్స్ ఎక్కువైతే రకరకాల సమస్యలు వచ్చే చాన్సెస్ ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడంతో పాటు సరిగా నిద్ర పోవాలి. ప్రతీ రోజు 7 నుంచి 8 గంటల పాటు కంపల్సరీగా నిద్రపోవాలి. పీచు పదార్థాలను ఆహారంగా తీసుకోవాలి. ఎప్పటికప్పుడు హెల్త్ పట్ల జాగ్రత్త వహించాలి. ప్రతీ రోజు నీరు ఎక్కువగా తీసుకోవాలి. శారీరక శ్రమ చేయాలి. అలా అయితేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు.