Rice | అన్నం అతిగా తింటే ఆరోగ్యానికి ప్రమాదం .. నిపుణుల హెచ్చరిక
Rice | రోజువారీ ఆహారంలో ప్రధానమైన భాగం అయిన అన్నం అతిగా తినడం ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ మొత్తంలో అన్నం తీసుకోవడం వల్ల శరీరంలో అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయని వారు చెబుతున్నారు.ఆహార నిపుణుల ప్రకారం, అన్నం ఎక్కువగా తినడం వలన జీర్ణ సమస్యలు, కడుపు నొప్పి, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి.
#image_title
ఇలా చేయోద్దు..
రైస్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. దీని కారణంగా మధుమేహం, బరువు పెరుగుదల, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.అన్నంలో నియాసిన్, థయామిన్, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నప్పటికీ, అధిక మోతాదులో తీసుకుంటే అవి శరీరానికి భారం కలిగిస్తాయని వైద్యులు హెచ్చరించారు. ఎక్కువగా కార్బోహైడ్రేట్లు ఉన్నందున ఇది శరీరానికి తాత్కాలిక శక్తినిచ్చినా, దీర్ఘకాలికంగా కొవ్వు నిల్వలు పెరిగే అవకాశం ఉంటుంది.
అలాగే, అన్నం ఎక్కువగా తినడం వల్ల కాలేయంపై ఒత్తిడి పెరిగి, కాలేయ కార్యకలాపాలు దెబ్బతినే ప్రమాదం ఉందని కూడా నిపుణులు సూచించారు. దీనివల్ల అలసట, బరువు పెరుగుదల, జీర్ణ సమస్యలు వంటి లక్షణాలు కనబడవచ్చు. వైద్యుల సూచన ప్రకారం, రోజువారీ ఆహారంలో అన్నం పరిమిత మోతాదులో తీసుకోవడం మంచిది. దానికి బదులుగా కూరగాయలు, పప్పులు, ప్రోటీన్ ఫుడ్స్‌ను చేర్చడం ద్వారా శరీరానికి సమతుల్య పోషణ లభిస్తుందని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.