Green And Blue Tea : గ్రీన్ టీ కి,బ్లూ టీ కి మధ్య ఉన్న తేడా ఏంటో… తెలుసుకోండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Green And Blue Tea : గ్రీన్ టీ కి,బ్లూ టీ కి మధ్య ఉన్న తేడా ఏంటో… తెలుసుకోండి…!

 Authored By ramu | The Telugu News | Updated on :30 July 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Green And Blue Tea : గ్రీన్ టీ కి,బ్లూ టీ కి మధ్య ఉన్న తేడా ఏంటో... తెలుసుకోండి...!

Green And Blue Tea : మనం ఇప్పటి.వరకు బ్లూ టీ మరియు హెర్బల్ టీ గురించి విన్నాం. కానీ ఈ బ్లూ టీ ఏమిటి. దీని గురించి ఎవరికీ తెలియదు. అయితే ఈ టీ అనేది అపరాజిత నీలిరంగు పువ్వుతో తయారు చేయబడినటువంటి కెఫిన్ లేని హెర్బల్ టీ అని చెప్పొచ్చు. ఈ మూలికను బటర్ ప్లే పీ,కోర్దో పాన్ పీ, బ్లూ పీ అని కూడా అంటారు. అయితే ఈ బ్లూ టీ లో పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. ఈ టీ తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. బరువు తగ్గటం మరియు శరీరాన్ని శుభ్రంగా ఉంచటం లో బ్లూ టీ ఎంతో సహాయపడుతుంది. అంతేకాక మనసును శాంత పరచటం మరియు చర్మ గారింపుకు, జుట్టు ఆరోగ్యానికి ఇలా ఎన్నో రకాలుగా ఈ బ్లూ టీ అనేది ఔషధంలా పని చేస్తుంది. ఈ బ్లూ టీ జీర్ణ క్రియ వ్యవస్థను కూడా ఎంతో మెరుగుపరుస్తుంది. అలాగే ప్రతి నిత్యం జీర్ణ క్రియ సమస్యలతో బాధపడేవారు ప్రతినిత్యం రెండు కప్పుల బ్లూ టీ ని తీసుకోవటం వలన మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఉబ్బసం నుండి కూడా ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది. అంతేకాక జ్వరాన్ని మరియు మధుమేహాని నియంత్రించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది.

బ్లూ టీ మరియు గ్రీన్ టీ అనేది పూర్తిగా హెర్బల్. ఈ టీ లో కెఫిన్ అనేది ఉండదు. అంతేకాక ఇది యాంటీ ఆక్సిడెంట్లకు అద్భుతమైన మూలం అని చెప్పొచ్చు. ఇవి ఫ్లేవనాయిడ్స్ మరియు టానిన్లు, ఫాలీ ఫైనల్స్ లాంటి రోగ నిరోధక శక్తిని కలిగించే,శోథ నిరోధక పదార్థాల ప్రత్యేకమైన సాంద్రతను కలిగి ఉంటుంది. అయితే ఈ టీ ని ఆకులకు బదులుగా పువ్వులను ఉపయోగించి తయారు చేస్తారు. అయితే దీనిని గ్రీన్ టీ లా కాకుండా బ్లూ టీ కేఫిన్ లేనిది. ఈ బ్లూ టీ అద్భుతమైన ప్రయోజనాలు కలిగిన యాంటీ ఆక్సిడెంట్ అని పిలవబడే ఫ్రీ రాడికల్స్ స్కావెంజింగ్ పదార్థాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే మీ శరీరంలో ఫ్రీ రాడికల్స్ వలన ఆక్సీకరణ ఒత్తిడి రావచ్చు. ఇది ఎన్నో రకాల వ్యాధులకు దారి తీసే అవకాశం ఉన్నది.

Green And Blue Tea కొలెస్ట్రాల్ నియంత్రిస్తుంది

ఈ బ్లూ టీ ని తీసుకోవటం వలన కొలెస్ట్రాల్ మరియు రక్తపోటు తగ్గుతుంది. అలాగే ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా ఎంతో మేలు చేస్తుంది. అంతేకాక రక్తం గడ్డ కట్టడాన్ని తగ్గిస్తుంది

డయాబెటిస్ అదుపులో ఉంచుతుంది : ఈ బ్లూ టి లో ఉన్న అథోసైనిన్స్ రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మేలు చేస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం చూస్తే, ఈ మిశ్రమంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మరియు కార్బోహైడ్రేట్లను విచ్ఛిన్నం చేసి జీర్ణ ఎంజైమ్ లను తగ్గిస్తుంది. అయితే కోన్ ఫ్లవర్ సారంలో ఉన్నటువంటి పదార్థాలు కార్బోహైడ్రేట్ల విచ్చన్న శోషణను నెమ్మదిస్తుంది. ఇది ఇన్సులిన్ నిరోధకతను కూడా నియంత్రిస్తుంది…

గుండె,మెదడు ఆరోగ్యం : ఈ బ్లూ టీ లో ఎక్కువ అథోసైనిక్స్ కారణం వలన గుండె మరియు మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది యాంటీ డయాబెటిక్ మరియు యాంటీ క్యాన్సర్ అలాగే యాంటీ బ్యాక్టీరియల్ లాంటి ప్రభావాలను కూడా నియంత్రిస్తుంది. అయితే ఈ విషయంలో మరింత నిర్ధారణ కోసం కొన్ని అధ్యయనాలు కూడా జరుపుతున్నారు…

క్యాన్సర్ ను నియంత్రిస్తుంది : ఈ కోన్ ఫ్లవర్ పువ్వులో ఉండే టెర్మినేషన్స్ అని పిలవబడే ఆంథో సైనిన్ అణువులు అనేవి మంటను నియంత్రించి క్యాన్సర్ కణాలు రాకుండా చూస్తుంది. ఇవి కాన్సర్ కణాలను నాశనం చేస్తుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Green And Blue Tea గ్రీన్ టీ కిబ్లూ టీ కి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకోండి

Green And Blue Tea : గ్రీన్ టీ కి,బ్లూ టీ కి మధ్య ఉన్న తేడా ఏంటో… తెలుసుకోండి…!

బరువు తగ్గించే ప్రయోజనాలు : సహజమైన మరియు హెర్బల్ కెఫిన్ లేని ఈ బ్లూ టీని తీసుకోవటం వలన బరువు తగ్గించడంలో కూడా మేలు చేస్తుంది. గ్రీన్ టీ కాక హెర్బల్ టీ అనగా బరువును నియంత్రించడం లేటెస్ట్ క్రేజ్..

ఒత్తిడి తగ్గిస్తుంది : బ్లూ టీ లో యాంటీ స్ట్రెస్ గుణాలు అధికంగా ఉన్నాయి. ఇవి ఆందోళన లక్షణాలను నియంత్రించడంలో ఎంతో మేలు చేస్తుంది. అలాగే మానసిక స్థితిని కూడా ఎంతగానో మెరుగుపరుస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది