Tea Bags : టీ బ్యాగులను ఎక్కువగా వినియోగిస్తునారా… అయితే భారి మూల్యం చెల్లించాల్సిందే జాగ్రత్త… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tea Bags : టీ బ్యాగులను ఎక్కువగా వినియోగిస్తునారా… అయితే భారి మూల్యం చెల్లించాల్సిందే జాగ్రత్త…

 Authored By ramu | The Telugu News | Updated on :30 December 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Tea Bags : టీ బ్యాగులను ఎక్కువగా వినియోగిస్తునారా...అయితే భారి మూల్యం చెల్లించాల్సిందే జాగ్రత్త...

Tea Bags : నేటి ఆధునిక కాలంలో నిద్ర లేచిన తరువాత నుండి పడుకునే వరకు టీలు కాఫీ లను విపరీతంగా తాగుతున్నారు. అయితే గతంలో ఫిల్టర్లు కాఫీలు ఉండగా ప్రస్తుతం ఇన్ స్టాండ్ అంటూ వచ్చాయి. దీంతో అంతే త్వరగా రోగాలు కూడా వస్తున్నాయి. అయితే ప్రస్తుతం టీ బ్యాగుల వినియోగం అధికమవుతుంది. వీటి వలన టీ తయారీ సులభవంతం కావడంతో ప్రతి ఒక్కరు వీటిని వినియోగిస్తున్నారు. మరి వీటి వినియోగం వెనుక పెద్ద పెను ప్రమాదమే పొంచి ఉందని మీకు తెలుసా.. అవును టీ బ్యాగులను అధికంగా వినియోగిస్తే ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని ఒక అధ్యాయనంలో తేలింది. ముఖ్యంగా ఇది బ్యాగుల బయట పోరకు ఉపయోగించే పదార్థం ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. అదేవిధంగా ఆధారిత పదార్థాలతో తయారు చేసినటువంటి వాణిజ్య టీ బ్యాగులు మైక్రో ప్లాస్టిక్లను విడుదల చేస్తున్నాయి. ఇక వీటిని ఉపయోగించేటప్పుడు మిలియన్ల కొద్దీ మైక్రో ప్లాస్టిక్ లు టీ కప్పు లోకి విడుదలవుతున్నాయి.

Tea Bags టీ బ్యాగులను ఎక్కువగా వినియోగిస్తునారాఅయితే భారి మూల్యం చెల్లించాల్సిందే జాగ్రత్త

Tea Bags : టీ బ్యాగులను ఎక్కువగా వినియోగిస్తునారా…అయితే భారి మూల్యం చెల్లించాల్సిందే జాగ్రత్త…

అటానమస్ యూనివర్సిటీ ఆఫ్ బార్సిలో చేసిన ఒక అధ్యయనం ప్రకారం ఫుడ్ ప్యాకింగ్ లో మైక్రో అండ్ నాన్ ప్లాస్టిక్ కాలుష్యం కి ప్రధాన మూలకంగా పేర్కొన్నారు. అయితే ఈ నాన్ ప్లాస్టిక్ మైక్రో ప్లాస్టిక్ కణాలు పేగు కణాల ద్వారా శరీరంలోకి ప్రవేశించడం జరుగుతుంది. అదేవిధంగా ఇది రక్త కణాలలో చేరడం వలన శరీరంలోని ఇతర భాగాలలో కూడా పేరుకు పోతాయి. UAB పరిశోధనలలో ఈ టీ బ్యాగులను ఇన్ఫ్యూషన్ కోసం ఉపయోగించినప్పుడు అధిక మొత్తంలో నాన్ సైజ్ కణాలు మరియు నానో ఫిలమెంటేస్ కణాలు విడుదలతాయని పేర్కొన్నారు.

అదేవిధంగా పరిశోధనలు ఉపయోగించినటువంటి టీ బ్యాగులు నైలాన్ -6 పాలీప్రొఫైలిన్ సెల్యులోజ్ వంటి వాటిని పాలిమర్‌లతో తయారవుతాయి. ఇక టీ తయారు చేసేటప్పుడు పాలీప్రొఫైలిన్ ఒక మిల్లీలీటర్ కు అంటే దాదాపు 1.2 బిలియన్ కణాలను విడుదల చేయగా దానికి సగటు పరిమాణం 136.7 నానో మీటర్లు. సెల్యులోజ్ ఒక మిల్లీలీటర్ కు 135 మిలియన్ విడుదల చేయడం జరుగుతుంది. ఇక వీటి సగటు పరిమాణం దాదాపు 244 నానో మీటర్లు. నైలాన్ -6 , ఒక మిల్లీలీటర్ కు 8.18 మిలియన్ల కణాలను విడుదల చేయగా దాని సగటు పరిమాణం 138.4 నానో మీటర్లు. కనుక ఇటువంటి టీ బ్యాగులను వినియోగించడం వలన మానవ ఆరోగ్యం పై చెడు ప్రభావం చూపుతాయి కాబట్టి వీటిని ఉపయోగించకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది